మీరు ICICI బ్యాంకు క్రెడిట్ కార్డ్ కస్టమరా? అయితే మీకో బ్యాడ్ న్యూస్! క్రెడిట్ కార్డు ఛార్జీలను పెంచుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంకు తన క్రెడిట్ కార్డు కస్టమర్లకు శనివారం నాడు సందేశాలు పంపించింది. వివిధ క్రెడిట్ కార్డ్ సేవల పైన ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపింది. ఆలస్య ఫీజుకు కూడా ఇది వర్తిస్తుందని తెలిపింది. 'డియర్ కస్టమర్ ఫిబ్రవరి 10, 2022 తేదీ నుండి ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డ్ స్ట్రక్చర్ సవరించబడుతోంది. మరిన్ని వివరాల కోసం వెబ్ సైట్‌ను సందర్శించగలరు' అని ఈ ప్రయివేటు దిగ్గజం తన క్రెడిట్ కార్డు కస్టమర్లకు సందేశాన్ని పంపించింది. బ్యాంకు ప్రకారం కొత్త క్రెడిట్ కార్డ్ స్ట్రక్చర్ ఫీజు వచ్చే నెల పదో తేదీ నుండి అమల్లోకి వస్తోంది.

చెల్లింపు ఇలా
దీని ప్రకారం ఫిబ్రవరి 10, 2022 నుండి ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు కస్టమర్లు క్యాష్ అడ్వాన్స్ ట్రాన్సాక్షన్స్ ఛార్జీని 2.50 శాతం అదనంగా చెల్లించాలి. అన్ని కార్డ్స్‌కు ఇది వర్తిస్తుంది. కనీసం రూ.500 ఉంటుంది.
క్యాష్ అడ్వాన్స్ అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరించుకోవడం.
చెక్ రిటర్న్స్ అయితే బ్యాంకు 2 శాతం ఛార్జ్ చేస్తుంది. కనీస ఛార్జ్ రూ.500. సాధారణంగా క్రెడిట్ కార్డు ఉపయోగించి నగదు కూడా చాలామంది తీస్తారు. కొందరు అలా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి ట్రాన్సాక్షన్ చేసేవారు ఇకపై భారీగా చెల్లించాల్సిందే. ఇలా తీసిన మొత్తంపై అన్ని కార్డులపై పై విధంగా 2.50 శాతం చొప్పున ఫీజు చెల్లించాలి. చెక్ రిటర్న్ లేదా ఆటో డెబిట్ ఫెయిల్ అయితే 2 శాతం వసూలు చేస్తారు. ఈ రెండు సందర్భాల్లో కనీసం రూ.500 చెల్లించాలి.
అత్యవసర పరిస్థితుల్లో తప్ప నగదును క్రెడిట్ కార్డు ద్వారా ఉపసంహరించుకోవడం సరికాదు. అలాగే చిన్న మొత్తంలో ఎక్కువ ఉపసంహరణలు చేయడాన్ని పక్కన పెట్టాలి. ఎందుకంటే అలా చేస్తే అధిక ఛార్జీలు వర్తిస్తాయి.

క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లిస్తే
క్రెడిట్ కార్డు బిల్లు ఆలస్యంగా చెల్లించినా భారంగా మారుతుంది. బిల్లు మొత్తం రూ.100 లోపు ఉంటే ఎలాంటి ఛార్జీలు చెల్లించవలసిన అవసరం లేదు. అదే మొత్తం రూ.100 నుండి రూ.500 అయితే రూ.100, రూ.501 నుండి రూ.5000 అయితే రూ.500, రూ.5001 నుండి రూ.10,000 అయితే రూ.750, రూ.10,001 నుండి రూ.25,000 వరకు రూ.900, రూ.25,001 నుండి రూ.50,000 వరకు రూ.1000, రూ.50వేలు ఆ పైన రూ.1200 ఆలస్య రుసుము చెల్లించాలి. ఈ ఛార్జీలకు మరో రూ.50 ప్లస్ జీఎస్టీ చెల్లించాలి.

వీరికి మినహాయింపు కానీ..
ఎమరాల్డ్ క్రెడిట్ కార్డులకు లేట్ ఫీజు ఛార్జీల నుండి మినహాయింపు ఉంది. అయితే సకాలంలో బిల్లులను చెల్లిస్తే ఎలాంటి ఛార్జీ లేదు. ఆలస్యంగా చెల్లించడం, ఏటీఎం కేంద్రాల నుండి డబ్బులు డ్రా చేయడం వంటివి చేసే వారికి ఈ ఛార్జీలు వర్తిస్తాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications