Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు సవరించిన ఐసీఐసీఐ..
ఐసిఐసిఐ బ్యాంక్ ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెచ్చింది. రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల మధ్య ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు మెచ్యూరిటీ ఉన్న డిపాజిట్లపై 4.75 శాతం నుంచి 6.75 శాతం మధ్య వడ్డీ రేట్లు పొందవచ్చు. ICICI బ్యాంక్ ఇప్పుడు 1 సంవత్సరం నుంచి 15 నెలల కాలవ్యవధితో డిపాజిట్లపై గరిష్టంగా 7.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. సవరించిన వడ్డీ రేట్లు 13 ఏప్రిల్ 2023 నుంచి అమలులోకి వచ్చాయి.
7 రోజుల నుంచీ 29 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.75% వడ్డీ రేటును ఇస్తుంది. 30 రోజుల నుంచి 45 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై ICICI బ్యాంక్ 5.50 శాతం వడ్డీ రేటును అందజేస్తోంది. ICICI బ్యాంక్ ప్రకారం 46 రోజుల నుంచి 60 రోజుల వరకు డిపాజిట్ అవధి 5.75% చొప్పున వడ్డీని పొందనున్నారు. అయితే 61 రోజుల నుంచి 90 రోజులలో ఒకదానికి 6 శాతం చొప్పున వడ్డీ లభించనుంది. 91 నుంచి 184 రోజులలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లు ఇప్పుడు 6.50శాతం వడ్డీని పొందుతున్నారు.

అయితే తదుపరి 185 నుండి 270 రోజులలో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డ్ డిపాజిట్లపై 6.65 శాతం వడ్డీని పొందుతాయి.ICICI బ్యాంక్ ఇప్పుడు 271 రోజుల నుంచి 1 సంవత్సరం లోపు మెచ్యూర్ అయ్యే బల్క్ FDలపై 7.25% వడ్డీ రేటును, 1 సంవత్సరం నుంచి 15 నెలలలోపు మెచ్యూర్ అయ్యే వాటిపై 6.75% వడ్డీ రేటును అందజేస్తోంది. ICICI బ్యాంక్ 2 సంవత్సరాల డిపాజిట్ పై 7 శాతం వడ్డీ రేటు, 1 రోజు నుంచి 3 సంవత్సరాల డిపాజిట్ పై 7.15 శాతం వడ్డీ రేటు చెల్లిస్తోంది.


Click it and Unblock the Notifications