భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 600 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఫిబ్రవర 8) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 51,000 పాయింట్లను క్రాస్ చేయగా, నిఫ్టీ 15,100 పాయింట్లను దాటి ముగిసింది. కేవలం ఎఫ్ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంకు రంగాలు మినహా మిగతా అన్నీ లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, మెటల్ రంగాలు మూడు శాతం చొప్పున లాభపడ్డాయి. డాలర్ మారకంతో రూపాయి 72.96 పైసల వద్ద ముగిసింది. నేడు ఉదయం 72.87 వద్ద ప్రారంభమైన ధర, 72.81-72.97 మధ్య కదలాడింది. క్రితం సెషన్లో 72.92 వద్ద క్లోజ్ అయింది.

భారీ లాభాల్లో మార్కెట్
నేడు సెన్సెక్స్ 617.14 పాయింట్లు లేదా 1.22% లాభపడి 51,348.77 పాయింట్లు, నిఫ్టీ 191.50 పాయింట్లు లేదా 1.28% ఎగిసి 15,115.80 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1689 షేర్లు లాభాల్లో, 1284 షేర్లు నష్టాల్లో ముగియగా, 188 షేర్లలో ఎలాంటి మార్పులేదు. బడ్జెట్ తర్వాత నుండి స్టాక్ మార్కెట్లు భారీగా లాభాల్లోకి వచ్చాయి. బడ్జెట్ రోజున 46వేల స్థాయి నుండి నేటికి 51వేల స్థాయికి వచ్చింది.

టాప్ గెయినర్స్, లూజర్స్
టాప్ గెయినర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా 7.27 శాతం, హిండాల్కో 6.45 శాతం, టాటా మోటార్స్ 6.35 శాతం, శ్రీసిమెంట్స్ 4.86 శాతం, JSW స్టీల్ 3.84 శాతం లాభాల్లో ముగిశాయి.
బ్రిటానియా 1.92 శాతం, HUL 1.45 శాతం, కొటక్ మహీంద్రా 1.29 శాతం, దివిస్ ల్యాబ్స్ 1.06 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.74 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా మోటార్స్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్ ఉన్నాయి.

రంగాలవారీగా..
నిఫ్టీ 50 స్టాక్స్ 1.28 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.74 శాతం లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 3.14 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.92 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.43 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83 శాతం, నిఫ్టీ ఐటీ 2.31 శాతం, నిఫ్టీ మీడియా 1.08 శాతం, నిఫ్టీ మెటల్ 3.17 శాతం, నిఫ్టీ ఫార్మా 0.16 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.01 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.97 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.55 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 1.04 శాతం నష్టపోయాయి.


Click it and Unblock the Notifications