ICICI బ్యాంకు సేవలకు అంతరాయం, ట్రాన్సాక్షన్స్ ఫెయిల్

ప్రయివేటు బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. నెట్ బ్యాంకింగ్, యూపీఐ, డెబిట్ కార్డు ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అయినట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. శుక్రవారం ఉదయం నుండి డెబిట్ కార్డ్, యూపీఐ ట్రాన్సాక్షన్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపే సమయంలో అవాంతరాలు ఎదురవుతున్నట్లు తెలిపారు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్ నడుస్తోంది. ఎక్కువమంది ట్రాన్సాక్షన్స్ నిర్వహించడంతో సర్వర్లపై ఒత్తిడి పెరిగి ఈ సమస్య తలెత్తినట్లు భావిస్తున్నారు. కొంతమంది యూజర్లు పేమెంట్ సమయంలో ఓటీపీలు రావడం లేదని చెబుతున్నారు. మొబైల్ యాప్ సహా వివిధ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వెబ్ సైట్లు డౌన్ అయ్యాయి. అమెజాన్ సేల్స్ సమయంలో ట్రాన్సాక్షన్లు ఫెయిల్ కావడంతో చాలామంది నిరాశకు గురయ్యారు.

ICICI Bank faces technical issue, onlin transactions fail

ఉదయం నుండి తలెత్తిన సమస్య మధ్యాహ్నం సమయానికి మరింత ఎక్కువగా అయినట్లు కస్టమర్లు ఫిర్యాదు చేశారు. శుక్రవారం ప్రైమ్ మెంబర్స్‌కు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ సేల్ ప్రారంభమైంది. ఫ్లిప్‌కార్ట్‌లోను ఆఫర్ సేల్స్ ప్రారంభమయ్యాయి. టెక్నికల్ ఇష్యూ కారణంగా ప్రస్తుతం మీ(ICICI) బ్యాంక్ పేమెంట్ ప్రాసెస్ కావడం లేదని, కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ట్రాన్సాక్షన్స్ నిర్వహించాలని అమెజాన్ యాప్ మెసేజ్‌లో పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+