ICICI: కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా పలు కంపెనీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక కార్యక్రమాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది. ఇందుకోసం ICICI బ్యాంకు చేసిన పని ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆరోగ్య రంగంపై దృష్టి సారించిన ఈ ప్రైవేట్ బ్యాంకు ఏకంగా 1,200 కోట్లను టాటా మెమోరియల్ సెంటర్(TMC)కి విరాళంగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
క్యాన్సర్ రోగులు ముంబై వరకు వెళ్లకుండా ఇళ్లకు చేరువలోనే చికిత్స పొందడంలో సహాయపడటానికి ఈ విరాళాన్ని వినియోగించనున్నట్లు టాటా మెమోరియల్ సెంటర్ (TMC) తెలిపింది. మరో రెండు రాష్ట్రాల్లో క్యాన్సర్ సంరక్షణ సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలో తమ యూనిట్‌ని విస్తరించడానికి కొంత మొత్తాన్ని ఉపయోగించనున్నట్లు చెప్పింది. 2027 నాటికి ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ప్రకటించింది.

ఓ ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి అందిన అతిపెద్ద విరాళం ఇదే కావడం విశేషం. ICICI బ్యాంక్ ఛైర్మన్ గిరీష్ చంద్ర చతుర్వేది సమక్షంలో ICICI ఫౌండేషన్ అధ్యక్షులు సంజయ్ దత్తా ఈమేరకు MoUపై సంతకం చేశారు. నవీ ముంబైలో 460 కోట్లు, మల్లన్‌పూర్‌లో 350 కోట్లు, విశాఖపట్నంలో 390 కోట్లు చొప్పున వెచ్చించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.
"దేశంలో ప్రతి సంవత్సరం బయటపడుతున్న 13 లక్షల కొత్త క్యాన్సర్ కేసులలో 10 శాతం టాటా మెమోరియల్ ఆసుపత్రులలోనే చికిత్స పొందుతున్నారు. ICICI ఫౌండేషన్‌కు చాలా కృతజ్ఞతలు. అధునాతన క్యాన్సర్ కేర్‌ను ఇంటి దగ్గరే అందించడం చాలా కీలకం. తద్వారా ఈ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ప్రజలు ప్రయోజనం పొందుతారు" అని డాక్టర్ బద్వే పేర్కొన్నారు.
"ICICI బ్యాంక్ తన CSR నిధుల నుంచి ఈ విరాళం అందజేసింది. నవీ ముంబైలోని TMC కేంద్రం, పంజాబ్‌లోని ముల్లన్‌పూర్ మరియు APలోని విశాఖపట్నంలలో 7.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు కొత్త భవనాలను ఏర్పాటు చేయడానికి ఈ మొత్తం వినియోగించబడుతుంది. వాటిలో అత్యాధునిక యంత్రాలను సైతం సిద్ధం చేస్తాం" అని ICICI బ్యాంక్ ఛైర్మన్ చతుర్వేది తెలిపారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications