మీరు ICICI Bank క్రెడిట్ కార్డ్‌ని వాడుతున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. ICICI బ్యాంక్ కొత్త ఏడాది 2026 నుంచి తన క్రెడిట్ కార్డ్ నిబంధనలు, రివార్డ్ పాయింట్లు, సర్వీస్ ఛార్జీల్లో భారీగా మార్పులు చేయబోతోంది. జనవరి, ఫిబ్రవరి నెలల నుంచి దశలవారీగా ఈ కొత్త మార్పులు అమలులోకి రానున్నాయి. దీనివల్ల సామాన్య వినియోగదారులపై అదనపు భారం పడటం ఖాయంగా కనిపిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బుక్ మై షో ఆఫర్‌పై కండిషన్లు!
సినిమా ప్రియులకు అత్యంత ఇష్టమైన 'బై వన్ గెట్ వన్' ఆఫర్‌పై బ్యాంక్ ఇప్పుడు నిబంధనలు పెట్టింది. ఇకపై ఈ ఆఫర్ పొందాలంటే అంతకుముందు త్రైమాసికంలో (Quarter) కనీసం రూ. 25,000 ఖర్చు చేసి ఉండాలి. అంతేకాకుండా ఫిబ్రవరి 2026 నుంచి 'ఇన్‌స్టంట్ ప్లాటినం' క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు ఈ ఉచిత టికెట్ సౌకర్యం పూర్తిగా రద్దవుతుంది.
వాలెట్ లోడింగ్, గేమింగ్‌పై ఛార్జీల బాదుడు!
డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ఇది పెద్ద షాక్. Paytm, Amazon Pay, Mobikwik వంటి వాలెట్‌లలో రూ. 5,000 అంతకంటే ఎక్కువ లోడ్ చేస్తే 1% రుసుము చెల్లించాలి. ఇక ఆన్‌లైన్ గేమింగ్ పిచ్చి ఉన్నవారికి మరింత కష్టం. Dream11, MPL, Rummy Culture వంటి ప్లాట్‌ఫారమ్‌లలో జరిపే లావాదేవీలపై ఏకంగా 2% ఫీజు వసూలు చేయనున్నారు.
ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులపై కొత్త నిబంధనలు!
బస్సులు, రైళ్లు లేదా విమాన ప్రయాణాలకు సంబంధించి రూ. 50,000 దాటి ఖర్చు చేస్తే 1% అదనపు ఛార్జీ పడుతుంది. వీటితో పాటు రివార్డ్ పాయింట్లపై కూడా పరిమితులు విధించారు..
- • ఎమెరాల్డ్, సాఫిరో: నెలకు రూ. 20,000 వరకు ఖర్చుపైనే రివార్డ్స్ వస్తాయి.
- • కోరల్, ప్లాటినం: నెలకు కేవలం రూ. 10,000 ఖర్చుపైనే రివార్డ్ పాయింట్లు లభిస్తాయి.
ఎమెరాల్డ్ మెటల్ కార్డ్ హోల్డర్లకు మరిన్ని షాక్‌లు!
సూపర్ ప్రీమియం కార్డుగా పేరున్న ఎమెరాల్డ్ మెటల్ కార్డుపై ఇకపై ప్రభుత్వ సేవలు, ఇంధనం (Fuel), అద్దె చెల్లింపులు, పన్నుల చెల్లింపులపై ఎటువంటి రివార్డ్ పాయింట్లు రావు. అంతేకాకుండా కొత్తగా యాడ్-ఆన్ కార్డ్ కావాలంటే రూ. 3,500 వన్-టైమ్ ఫీజు కట్టాల్సిందే. డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఫీజును కూడా 2 శాతానికి పెంచారు.
ముఖ్యమైన తేదీలు గుర్తుంచుకోండి!
ఈ మార్పుల్లో మెజారిటీ నిబంధనలు జనవరి 15, 2026 నుంచి అమల్లోకి వస్తాయి. రివార్డ్ పాయింట్ల పరిమితి, కొన్ని బెనిఫిట్స్ ఉపసంహరణ ఫిబ్రవరి 1, 2026 నుంచి ప్రారంభమవుతాయి.
బ్యాంకింగ్ రంగంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా ఐసీఐసీఐ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దీంతో క్రెడిట్ కార్డ్ వాడకం మరింత ఖరీదైనదిగా మారింది. మున్ముందు మిగతా బ్యాంకులు కూడా ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. కాబట్టి కార్డ్ వాడేముందు ఒకటికి రెండుసార్లు కొత్త ఛార్జీలను సరిచూసుకోవడం మంచిది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications