I Bomma Ravi: ఐ బొమ్మ రవికి ఆర్థిక కష్టాలు.. బ్యాంకు ఖాతాల్లో రూ.3 కోట్లు ఉన్నా..!
ఒకప్పుడు విదేశాల్లో ఉంటూ జల్సాలు చేసిన ఐ బొమ్మ రవి ఇప్పుడు ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్నాడు. రోజు గడవడానికి ఇబ్బందిగా ఉందని, రోజు వారి ఖర్చులకు కూడా డబ్బులు లేవని నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశాడు. తన కుటుంబాన్ని పోషించడం ఇబ్బందిగా మారిందని, వైద్య ఖర్చులకు కూడా డబ్బులు లేవని పిటిషన్ లో పేర్కొన్నాడు. దయచేసి తన బ్యాంకు ఖాతాలు అన్ ఫ్రీజ్ చేయాలని కోరాడు. తన బ్యాంకు ఖాతాల్లో రూ.3 కోట్లు ఉన్నాయని. అందులో కొన్ని బ్యాంక్ ఖాతాలు అన్ ఫ్రీజ్ చేసినా తన ఆర్థిక కష్టాలు తీరిపోతాయని పిటిషన్ లో ప్రస్తావించాడు. రవి పిటిషన్ పై నాంపల్లి 9వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు విచారణ చేయనుంది.
కాగా విశాఖపట్నంకు చెందిన ఇమంది రవి పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చాడు. ఆ తర్వాత ఉద్యోగం సాధించి పెళ్లి చేసుకున్నాడు. అయితే జీతం డబ్బులు సరిపోక.. భార్య కూడా విలాసంగా ఉండాలని కోరడంతో ఏం చేయాలేక సతమతమయ్యాడు. చివరికి సినిమాలు ఫైరసీ చేయడం మొదలు పెట్టాడు. ఇందుకు ఐ బొమ్మ సైట్ ప్రారంభించాడు. విడుదలైన సినిమాలను ఫైరసీ చేసి ఐ బొమ్మలో అందుబాటులోకి తెచ్చేవాడు. ఇలా వందల సినిమాలు ఫైరసీ చేశాడు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవడంతో బప్పం టీవీ స్టార్ట్ అందులో పైరసీ సినిమాలు అప్ లోడ్ చేశాడు. ఇలా కోట్లు సంపాదించాడు. అయితే అతడిపై పోలీసులు నిఘా పెట్టారు.

ఈ క్రమంలో విదేశాల నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఐ బొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే అతని బ్యాంకు ఖాతాలన్నీ ఫ్రీజ్ చేశారు. దీంతో అతడి బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.3 కోట్లు అలానే ఉన్నాయి. రవి ఐబొమ్మ వెబ్‌సైట్లకు వచ్చే భారీ ట్రాఫిక్‌ను బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించి రవిపై పలు సెక్షన్స్ పేరిటా కేసులు నమోదు అయ్యాయి. అయితే దాదాపు మూడు నెలలపాటు జైలులో ఉన్న రవికి 2026 ఫిబ్రవరి 17న తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 18ను చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.
ఐ బొమ్మ రవి వల్ల టాలీవుడ్ కు భారీ నష్టం వాటిల్లింది. ఇండస్ట్రీ వేల కోట్లు నష్టపోయింది. అందుకే ఇండస్ట్రీ పెద్దలు పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఐ బొమ్మ రవి నిఘా ఉంచిన పోలీసులు ఎట్టాకేలకు అరెస్ట్ చేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
