హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రముఖ పైరసీ వెబ్‌సైట్లు iBomma, Bapam TVలను నడిపిన ఇమ్మంది రవిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అరెస్టు అనంతరం రవిని మెజిస్ట్రేట్ లో హాజరుపరచగా, 14 రోజుల న్యాయపరమైన రిమాండ్ విధించడంతో అతన్ని చంచల్‌గూడ జైలుకు తరలించారు. చలన చిత్ర పరిశ్రమకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించిన iBomma రవిని అరెస్ట్ చేసిన తరువాత తన కార్యకలాపాలను శాశ్వతంగా నిలిపివేసింది. ప్రస్తుతం వెబ్‌సైట్‌ను తెరవడానికి ప్రయత్నిస్తే.. మీ దేశంలో మా సేవలు శాశ్వతంగా నిలిపివేయబడ్డాయి అనే సందేశం మాత్రమే కనిపిస్తోంది. ఇది పైరసీ వ్యవస్థ పూర్తిగా కూలిపోయిందనే సంకేతంగా పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి.
విశాఖపట్నానికి చెందిన రవి, కరీబియన్ దీవుల్లో నివసిస్తూ పైరసీ నెట్‌వర్క్‌ను విదేశాల నుంచి నియంత్రిస్తున్నాడు. కొత్తగా విడుదలైన తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాల మాస్టర్ కాపీలను సీక్రెట్ కెమెరాలు, థియేటర్ ఇన్‌సైడర్ లింకులు ఉపయోగించి పొందుతూ వాటిని పలు డొమైన్లలో అప్‌లోడ్ చేసి భారీ ఆదాయం సంపాదించాడు. అతను భారతదేశానికి వ్యక్తిగత కారణంతో అంటే తన భార్యతో విడాకుల ప్రక్రియ కోసం వచ్చిన సమయంలోపోలీసులు వలపన్ని పట్టుకున్నారు.పైరసీ ద్వారా వచ్చిన అక్రమ ఆదాయంతో రవి హైదరాబాద్‌లో మూడు కోట్ల రూపాయల విలువైన ఇల్లు కొనుగోలు చేసినట్లు విచారణలో బయటపడింది. ఐటీ యాక్ట్, కాపీరైట్ చట్టం కింద ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. రవిని పట్టుకోవడం సినిమా పరిశ్రమకు పెద్ద మేలని అన్నారు. రవి కేవలం పైరసీ మాత్రమే కాకుండా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహించి యువతను ఆర్థిక, మానసిక నష్టాలకు గురిచేశాడని తెలిపారు. ఒకసారి బ్లాక్ చేసినా వెంటనే కొత్త వెబ్‌సైట్‌ను తెరచి పనిచేయడం అతని నెట్‌వర్క్‌కు ప్రత్యేక లక్షణం. మొత్తం 65 మిర్రర్ సైట్లు నిర్వహిస్తూ పైరసీ కొనసాగించాడు.
పోలీసులు జప్తు చేసిన రవి హార్డ్ డిస్క్‌లలో 1972 'గాడ్‌ఫాదర్' నుండి 2024 'ఓజీ' వరకు.. మొత్తం 21 వేల సినిమాలు ఉన్నట్లు వెల్లడైంది. పైరసీ ద్వారా మొత్తం రూ. 20 కోట్లు సంపాదించగా, అందులో రూ. 3 కోట్లు ఫ్రీజ్ చేశారు. అలాగే రవి వద్ద 50 లక్షల మంది సబ్ స్క్రైబర్ల వ్యక్తిగత డేటా ఉండడం ఒక పెద్ద ప్రమాదమని అధికారులు హెచ్చరించారు. ఈ డేటాను సైబర్ క్రైమ్ గ్యాంగులకు అమ్మినట్లు కూడా అనుమానిస్తున్నారు.
ఇమ్మడి రవి తన అసలు గుర్తింపును దాచేందుకు మహారాష్ట్రలో నకిలీ పత్రాలు పొందాడు. తరువాత భారత పౌరసత్వాన్ని వదిలి సెయింట్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. 2019 నుంచి విదేశాల్లోని అమెరికా, నెదర్లాండ్, స్విట్జర్లాండ్ సర్వర్లను ఉపయోగించి iBomma నెట్‌వర్క్‌ను నడిపాడు. 110 డొమైన్లను కొనుగోలు చేసి వాటిని వరుసగా మార్చుతూ పైరసీ కొనసాగించాడు. టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా సినిమాల డేటా మార్పిడి జరిగేది.
సీనియర్ సినీ ప్రముఖులు..చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, సురేశ్ బాబు, దర్శకుడు రాజమౌళి వంటి పెద్దలు సీపీ సజ్జనార్‌ను కలిసి ఈ కేసు విచారణపై వివరాలు తెలుసుకున్నారు. దీనిని పరిశ్రమకు జరిగిన అత్యంత ముఖ్యమైన విజయంగా వారు అభివర్ణించారు.సజ్జనార్ చివరిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పైరసీ వెబ్‌సైట్లు సినిమాలకు మాత్రమే కాదు, ప్రజల వ్యక్తిగత డేటాకు, ఆర్థిక భద్రతకు కూడా ప్రమాదమని పేర్కొన్నారు. ఇమ్మడి రవి నెట్‌వర్క్‌లో ఉన్న మిగతా వ్యక్తులను కూడా త్వరలో బయటకు తేవాలని తెలిపారు.
More From GoodReturns

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

Gold rates: పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి పరుగు! హైదరాబాద్, బెంగళూరులో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Hyderabad: షాపింగ్, వెల్నెస్, గ్యాస్ట్రోనమీ.. హైదరాబాద్ బ్రాండింగ్ మార్చబోతున్న మూడు కీలక స్తంభాలు!

Hyderabad:హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్: మారుతున్న నగరం ముఖచిత్రం.. కొత్త ఫ్లైఓవర్లు ఇవే!

Bullet train: మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్! సౌత్ ఇండియాలో రాబోయే రూట్లు ఇవే..

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరల పెరుగుదలపై దిమ్మతిరిగే న్యూస్.. గత చరిత్రతో కీలక నివేదికను విడుదల చేసిన Kedia Advisory

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?



Click it and Unblock the Notifications