Layoffs: లేఆఫ్స్‌లో IBM కొత్త కాన్సెప్ట్.. వినూత్న పద్ధతిలో ఉద్యోగుల తొలగింపు
IT News: కరోనా అనంతరం ఉద్యోగుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని సందిగ్ధంలో కొనసాగుతున్నారు. అంతర్జాతీయ దిగ్గజ సంస్థల నుంచి స్టార్టప్స్ వరకు పలు సంస్థలు సిబ్బందికి ఉద్వాసన పలికి ఖర్చులు మిగుల్చుకోవాలని చూస్తున్నాయి. తాజాగా IBM ఓ కొత్త కాన్సెప్ట్‌తో ముందుకొచ్చింది.
IBM తీసుకున్న నిర్ణయం ఇప్పుడు IT రంగంలో సంచలనంగా మారింది. భవిష్యత్తులో గొప్ప మార్పుకు ఇది నాందిగా భావిస్తున్నారు. ఉద్యోగుల తొలగింపులపై ఇష్టారీతిగా వ్యవహరించకుండా, స్వచ్ఛంద లేఆఫ్స్ దిశగా సిబ్బందిని ప్రోత్సహిస్తోంది. కంపెనీ ప్రకటించనున్న మరో రౌండ్ లే ఆఫ్స్ కు బాధితులను ఇదే పద్ధతిలో సెలక్ట్ చేస్తోంది. ఈ తొలగింపుల వల్ల యూరప్ ఉద్యోగులు ప్రభావితం అవుతారని తెలుస్తోంది.

గత నెలలో Q4 ఫలితాల సమయంలో కంపెనీ లేఆఫ్స్ ప్రకటించింది. ఇది కేవలం ఆర్థికపరమైన నిర్ణయంగానే కాకుండా వనరుల సమతుల్యతగా చూడాలని పేర్కొంది. IBM CFO జేమ్స్ కవనాగ్ మాట్లాడుతూ.. 2024 చివరి నాటికి 3 బిలియన్ డాలర్ల వార్షిక సేవింగ్స్ కంపెనీ లక్ష్యమని తెలిపారు. ఈ కోతల్లో 80 శాతం ఎంటర్‌ప్రైజ్ ఆపరేషన్స్ & సపోర్ట్ (EO&S) మరియు Q2C మిషన్‌లతో పాటు ఫైనాన్స్ & ఆపరేషన్స్ విభాగాల్లో ఉండనున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
దాదాపు 50 శాతం వర్క్‌ఫోర్స్ తగ్గింపు లక్ష్యంతో యూరప్ అంతటా పలు స్థాయిల్లో సిబ్బందిని IBM నిర్ణయం ప్రభావితం చేయనుంది. తొలగింపుల విషయంలో మొదట స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారిని పరిగణలోనికి తీసుకోవాలని కంపెనీ భావిస్తోంది. AI సహా హైబ్రిడ్ క్లౌడ్ విభాగాల్లో సిబ్బందిని సమలేఖనం చేసే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది.


Click it and Unblock the Notifications