శాన్‌ఫ్రాన్సిస్కో: కార్పొరేట్ సెక్టార్‌లో మరో సంచలనానికి తెర తీసినట్టయింది. సాఫ్ట్‌వేర్ రంగంలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ (IBM) కార్పొరేషన్ అధినేత జిమ్ వైట్‌హర్ట్స్ (Jim Whitehurst) వైదొలగారు. ఐబీఎంకు గుడ్‌బై చెప్పారు. కంపెనీ చీఫ్ హోదా నుంచి అర్ధాంతరంగా తప్పుకొన్నారు. రాజీనామా చేశారు. 14 నెలల కిందటే ఆయన ఐబీఎం చీఫ్‌గా బాధ్యతలను స్వీకరించారు. అతి స్వల్పకాలంలోనే ఆయన వైదొలగడం కార్పొరేట్ రంగంలో కలకలాన్ని పుట్టిస్తోంది. ప్రెసిడెంట్ హోదా నుంచి ఆయన తప్పుకొన్నప్పటికీ.. కంపెనీ ఛైర్మన్ అండ్ సీఈఓ అరవింద్ కృష్ణకు సీనియర్ అడ్వైజర్‌గా కొనసాగుతారు.
అమెరికన్ మల్టీనేషన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ రెడ్ హ్యాట్‌ను 2018లో ఐబీఎం 34 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో జిమ్ వైట్‌హర్ట్స్ రెడ్‌హ్యాట్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఉన్నారు. రెడ్‌హ్యాట్ విలీన సమయంలో ఐబీఎం సీఈఓగా పనిచేసిన గిన్నీ రొమెట్టి వైదొలగారు. తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత హోదాలో ఉన్న మరొ టాప్ ఎగ్జిక్యూటివ్ అర్ధాంతరంగా తప్పుకోవడం ఇదే తొలిసారి. గిన్నీ రొమెట్టి తరువాత అరవింద్ కృష్ణ ఆ బాధ్యతలను స్వీకరించారు. ఆయన అదే స్థానంలో కొనసాగుతోన్నారు.

తాజాగా జిమ్ వైట్‌హర్ట్స్ తన పదవికి రాజీనామా చేసిన విషయాన్ని అరవింద్ కృష్ణ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. రెడ్ హ్యాట్‌ను టేకోవర్ చేసిన తరువాత ఐబీఎంను అత్యున్నత స్థితికి చేర్చడంలో వైట్‌హర్ట్స్ కృషి చేశారని పేర్కొన్నారు. కాంపిటిటీవ్ కంపెనీల కంటే వ్యూహాత్మకంగా విధానాలను రూపొందించారని గుర్తు చేశారు. ఐబీఎంను టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ అండ్ ఇన్నోవేషన్స్‌గా మార్చడానికి శ్రమించారని చెప్పారు. వైట్‌హర్ట్స్ సేవలు తక్కువ కాలానికి పరిమతం అయ్యాయని చెప్పుకొచ్చారు.

అరవింద్ కృష్ణ ఐబీఎం ఛైర్మన్ అండ్ సీఈఓగా బాధ్యతలను స్వీకరించిన తరువాత.. చోటు చేసుకున్న మేజర్ కార్పొరేట్ రీషఫల్‌గా దీన్నఅభివర్ణిస్తోన్నాయి మార్కెట్ వర్గాలు. ఐబీఎం పగ్గాలను అరవింద్ చేపట్టిన తరువాతే కంపెనీ లాభాల బాట పట్టిందనే వాదనలూ లేకపోలేదు. ఇదిలావుండగా- జిమ్ వైట్‌హర్ట్స్ వైదొలగిన ప్రభావం కంపెనీ షేర్లపై పడింది. ఆయన రాజీనామా ప్రకటన వెలువడిన తరువాత ఐబీఎం షేర్ల వ్యాల్యూ ఒక్కసారిగా నేల చూపులు చూసింది. అయిదు నెలల కనిష్ఠానికి ఆ కంపెనీ షేర్లు క్షీణించాయి. 4.8 శాతం మేర అంటే 139.83 డాలర్ల మేర తగ్గింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications