IBM: భారతీయులకు షాక్.. యూఎస్ వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ను నిలిపివేసిన ఐబీఎం..!
150,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న తన అతిపెద్ద విభాగమైన ఐబిఎం కన్సల్టింగ్లోని చాలా ఉద్యోగాలకు యూఎస్ వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ను ఐబిఎం నిలిపివేస్తోంది. దీంతో ఉద్యోగులు యూఎస్ విడిచి ఇతర దేశాల్లో ఉన్న ఐపీఎం ఆఫీసులకు వెళ్లాలి లేదా ఈ ఏడాది చివరి నాటికి కంపెనీని విడిచి పెట్టి వెళ్లాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి యూనిట్ మేనేజర్లకు కంపెనీ మెయిల్ చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ నిర్ణయాన్ని ధృవీకరించింది. "నైపుణ్యాల కొరతను పరిష్కరించడానికి ఐబిఎం కన్సల్టింగ్ యూఎస్ ఉన్నత-నైపుణ్య వీసా కార్యక్రమాలలో పాల్గొంటుంది," అని ఐబిఎం ప్రతినిధి ఒకరు చెప్పారు.
నైపుణ్యాల లభ్యత క్లయింట్ అవసరాలు మారినందున, ఐబిఎం కన్సల్టింగ్లోని అటువంటి చాలా ఉద్యోగాలకు వీసా, గ్రీన్ కార్డ్ స్పాన్సర్షిప్ను నిలిపివేయాలని తాము నిర్ణయించుకున్నామని వివరించారు. ఈ నిర్ణయం అంత సులభమైనది కాదన్నారు. కంపెనీ నిర్ణయంపై నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగులకు మూడు వారాల సమయం ఉంటుంది. విదేశాలలో ఉద్యోగం తీసుకోని వారికి మూడు నెలల సెవరెన్స్ పేమెంట్ లభిస్తుంది. బయటకు వెళ్లేవారికి, రిజైన్ చేసేవారికి డిసెంబర్ 31 వారి చివరి పనిదినంగా ఉంటుంది. ఇండియాకి తిరిగి వెళ్లేవారికి జీతంలో దాదాపు 80 శాతం కోత పడొచ్చని ఒక ఐబీఎం ఉద్యోగి బ్లైండ్లో రాశారు. చాలా ఖాళీలు కూడా ఒకే దేశంలో ఉన్నాయి. నవంబర్ 19న ఐబీఎం కెరీర్స్ పోర్టల్ అమెరికా వెలుపల 1,278 కన్సల్టింగ్ ఉద్యోగాలను లిస్ట్ పెట్టింది. వాటిలో 1,125 భారతదేశంలో, 23 సింగపూర్లో 18 యూకేలో ఉన్నాయి.

అమెరికాలో 89 ఉన్నాయి. దేశాల వారీగా తమ ఉద్యోగుల విభజన ఎలా ఉందో ఐబీఎం వెల్లడించలేదు. కాబట్టి ఎంత మంది ప్రభావితమయ్యారనే కచ్చితమైన సంఖ్య అస్పష్టంగా ఉంది. ఆర్థిక సంవత్సరం 2026లో కంపెనీకి 1,600కు పైగా H-1B పిటిషన్లు ఆమోదం పొందాయి. ఇది 2025లో 2,000 ఉండగా, 2024లో దాదాపు 3,000 గా ఉంది. అప్పటి నుంచి క్రమంగా వీసాలు తగ్గుతూ వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ టెక్ నియామకాలపై కఠినమైన పరిశీలన జరుపుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు. గత నెలలో మైక్రోసాఫ్ట్, అడోబ్, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి అనేక ప్రధాన అవుట్సోర్సింగ్ సంస్థలను శాశ్వత కార్మిక ధృవీకరణ (PERM) ప్రక్రియ నుంచి సస్పెండ్ అయ్యాయి.
అలాగే సెప్టెంబర్ 2025లో కొత్త H-1B పిటిషన్లపై ఒకేసారి $100,000 రుసుమును వైట్ హౌస్ ప్రకటించింది. అయితే ఈ నిర్ణయం అప్పటి నుంచి కోర్టులలో ఉంది. అత్యధిక జీతాలు చెల్లించే యజమానులకు అనుకూలంగా ఉండేలా వార్షిక H-1B లాటరీలో మార్పులను కూడా ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనివల్ల భారతీయ నిపుణులు ఎక్కువగా ప్రభావితం అయ్యే అవకాశం ఉంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications