Layoffs: దిగ్గజ టెక్ కంపెనీలో మరోసారి లేఆఫ్స్.. 7 నిమిషాల మీటింగ్ అనంతరం..
IT News: గత రెండేళ్లుగా దాదాపు ప్రతి కంపెనీలోనూ ఉద్యోగులు లేఆఫ్స్‌ను కచ్చితంగా దగ్గర నుంచి చూసే ఉంచారు. పలు దఫాలుగా సిబ్బందిపై వేటు వేస్తూ ఖర్చులు మిగుల్చుకోవాలని ఆయా సంస్థలు భావిస్తున్నాయి. వీటికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, అంతకంతకూ తగ్గుతున్న రెవెన్యూను రికవర్ చేసేందుకు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
కంపెనీకి చెందిన మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ విభాగం నుంచి భారీ సంఖ్యలో ఐబీఎం తన ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. సంఖ్యపై క్లారిటీ లేనప్పటికీ కోతలు పెద్ద మొత్తంలో ఉన్నాయని విశ్లేషణలు వెలుతున్నాయి. 7 నిమిషాల పాటు జరిగిన మీటింగ్ అనంతరం ఆకస్మాత్తుగా ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు నివేదికలు చెబుతున్నాయి. చీఫ్ కమ్యూనికేషన్స్ ఆఫీసర్ జోనాతాన్ అదాషేక్ చావు కబురు చల్లగా చెప్పినట్లు తెలుస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో రీప్లేస్ చేసే అవకాశం ఉన్న పోస్టులకు రిక్రూట్మెంట్ ను IBM ఇటీవల నిలిపివేసింది. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ CEO అరవింద్ కృష్ణ ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో హ్యూమన్ రిసోర్స్ వంటి బ్యాక్ ఆఫీస్ జాబ్స్ 30 శాతాన్ని AI లేదా ఆటోమేషన్తో భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. 3 వేల 900 మంది ఉద్యోగులను తొలగించి 400 కంపెనీల పునరుద్దీకరణకు ఉపయోగించినట్లు CFO చెప్పారు. కాగా ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వెచ్చించనున్నట్లు ప్రకటించారు.
2024లో IBMతో పాటు దాదాపు 204 కంపెనీలు ఉద్యోగులకు లే ఆఫ్ ప్రకటించినట్లు layoffs.fyi వెబ్‌సైట్ డేటా చెబుతోంది. వీటివల్ల దాదాపు 50 వేల మంది సిబ్బంది నష్టపోయినట్లు అంచనా. ఇటీవలే స్వచ్ఛంద లే ఆఫ్స్ విధానంతో IPO వార్తల్లో నిలిచింది. ఈ తరహా విధానాన్ని ఫాలో అయ్యి ఐటీ రంగంలో ట్రెండ్ సెట్ చేసింది.


Click it and Unblock the Notifications