దేశంలోని బ్యాంకులు వారానికి ఐదు రోజులు పని చేసే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ ప్రతిపాదనపై జూలై 28న నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. వచ్చే వారం యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు)తో శుక్రవారం జరిగే సమావేశంలో ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబిఎ) నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఒక నివేదిక తెలిపింది.
యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ జూలై 19న తాము ఐదు బ్యాంకింగ్ రోజులను ప్రవేశపెట్టే అంశాన్ని ముందుగా చర్చలో తీసుకున్నామని తెలిపింది. "ఈ సమస్య వివిధ వాటాదారుల క్రియాశీల పరిశీలనలో ఉంది. మరింత ఆలస్యం చేయకుండా వారానికి ఐదు బ్యాంకింగ్ రోజులను ప్రవేశపెట్టడానికి మేము IBAని కోరాము" అని అది తెలిపింది. రెండు సంస్థలు జూలై 28 సమావేశంలో జీతం పెంపు, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీలపై చర్చించనున్నారు.

ప్రస్తుతం బ్యాంకులు నెలలో రెండు శనివారాలు తెరిచి ఉంటున్నాయి. మొదటి, మూడవ శనివారం బ్యాంకులు తెరిచి ఉండగా.. రెండో, నాలోగు శనివారం మూసి ఉంటున్నాయి. UBFU బ్యాంకులకు పని దినాలు వారానికి ఐదు రోజులు మాత్రమే ఉండాలని, అలాగే ఉద్యోగులకు వారానికి 2 రోజులు సెలవు ఇవ్వాలని కోరింది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)లో ప్రభుత్వం ఐదు పనిదినాల నిబంధనను అమలు చేసిన తర్వాత బ్యాంకుల్లో వారానికి ఐదు రోజుల పని డిమాండ్ తెరపైకి వచ్చింది.
బ్యాంకు ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని కల్పించాలన్న UBFU డిమాండ్‌పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ గతంలో తెలియజేసింది. ఈ మేరకు ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ప్రతిపాదన ప్రకారం, బ్యాంకు ఉద్యోగులకు రోజువారీ పని సమయం 40 నిమిషాలు పెంచనున్నారు.
రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగుల మెడికల్ ఇన్సూరెన్స్‌కు సంబంధించి, UBFU, రిటైర్ అయిన వారికి కొన్ని సీలింగ్‌లు, బెడ్ ఛార్జీలు/ప్యాకేజీ ట్రీట్‌మెంట్‌లు మొదలైన వాటిపై పరిమితులతో కూడిన బేస్ పాలసీని రూ.2 లక్షలకు అందించడానికి తాము అంగీకరించామని తెలిపింది. ప్రీమియం మొత్తం తగ్గుతుందని నిర్ధారించుకోవడానికి ఇది జరిగింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో చాలా రోజుల పాటు బ్యాంకులకు సెలవులున్నాయి. అయితే, సెలవులు ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు మరియు ATMలు ప్రజలకు తెరిచి ఉంటాయి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications