For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వడ్డీ మాఫీ సొమ్ము వాపసు చేయండి: ఆర్థిక శాఖకు IBA అభ్యర్థన

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది మార్చి-ఆగస్ట్ మధ్య లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. లోన్ మారటోరియాన్ని ఎంచుకున్న కేసులన్నింటిలోను చక్రవడ్డీని మాఫీ చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును శిరసావహించి రద్దు చేసిన చక్రవడ్డీ మొత్తాన్ని బ్యాంకులకు తిరిగి చెల్లించాలని బ్యాంకుల తరఫున కేంద్ర ఆర్థిక శాఖను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(IBA) అభ్యర్థించింది.

లోన్ మారటోరియంను ఎంచుకున్న రూ.2 కోట్ల పైబడిన రుణాలు అన్నింటికి చక్రవడ్డీ మాఫీ చేయాలని సుప్రీంకోర్టు మార్చి నెలలో తీర్పు చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రకటించిన ఈ వడ్డీమాఫీ భారం భారత ప్రభుత్వంపై రూ.5500 కోట్ల మేరకు పడుతోంది. లోన్ మారటోరియం ఉపయోగించుకోని వారితో సహా రుణగ్రహీతలు అందరికీ ఈ స్కీం వర్తిస్తుంది. వివిధ బ్యాంకులు విభిన్న దశల్లో ఈ స్కీంను అమలు చేశాయి.

IBA reaches out to government for refund of compound interest waiver by banks

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది (2020) మార్చి చివరి వారంలో సుదీర్ఘ లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల పాటు లోన్ మారటోరియం వెసులుబాటు కల్పించింది. ఆగస్ట్ తర్వాత కూడా మారటోరియం వెసులుబాటు కల్పించాలనే విజ్ఞప్తులు వచ్చినప్పటికీ ఆ వెసులుబాటు లభించలేదు.

English summary

వడ్డీ మాఫీ సొమ్ము వాపసు చేయండి: ఆర్థిక శాఖకు IBA అభ్యర్థన | IBA reaches out to government for refund of compound interest waiver by banks

The Indian Banks' Association (IBA) on behalf of lenders has approached the finance ministry to refund the burden fallen on their shoulders due to a recent Supreme Court judgment on the waiver of compound interest on all loan accounts which opted for moratorium during March-August 2020.
Story first published: Monday, May 24, 2021, 18:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X