బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్. వేతనం పెంపుకు బ్యాంకు యూనియన్లు, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) అంగీకారానికి వచ్చాయి. దీని ద్వారా 8.5 లక్షల మంది ఉద్యోగులు, అధికారులకు ప్రయోజనం కలగనుంది. దాదాపు మూడేళ్ల పాటు జరిగిన చర్చల అనంతరం బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు, ఐబీఏ ఇప్పుడు ఒక అంగీకారానికి వచ్చాయి.

ఎంత పెంపుకు అంగీకారం
15 శాతం వార్షిక వేతనం పెంపుకు బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు, ఐబీఏ ఒక అంగీకారానికి వచ్చాయి. దీంతో బ్యాంకులు అదనంగా రూ.7,900 కోట్లు ఇందుకు కేటాయించవలసి వస్తుంది. నవంబర్ 2019 నుండి అమల్లోకి వచ్చే ఈ వేతన పెంపుతో 8.5 లక్షల మంది ఉద్యోగులు, అధికారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ఒప్పందం బుధవారం కుదిరింది.

పనితీరు ఆధారిత ప్రోత్సాహకం
తాజా ఒప్పందం ప్రకారం ప్రభుత్వరంగ బ్యాంకుల ఉద్యోగులకు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు(పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్-PLI) కూడా అందిస్తారు. ఆయా బ్యాంకుల నికర లాభం లేదా నిర్వహణ లాభం ఆధారంగా దీనిని నిర్ణయిస్తారు. అంటే లాభాలు ఎక్కువగా ఉన్న బ్యాంకు ఉద్యోగులకు అదనపు వేతనం లభిస్తుంది. PLI ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వరంగ బ్యాంకులకు వర్తింపచేస్తారు. ప్రయివేటు, విదేశఈ బ్యాంకులకు సంబంధించి ఇది ఆప్షనల్. బ్యాంకు నిర్వహణ లాభం 5 శాతం కంటే తక్కువగా ఉంటే PLI ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే, మూలధన వేతనం, డీఏలను కలుపుతున్నట్లు ఐబీఐ తెలిపింది.

2017 నవంబర్ నుండి... పెన్షన్ వాటా పెంపు
ప్రభుత్వ, ప్రయివేటు, విదేశీ బ్యాంకులు 35కు పైగా ఉన్నాయి. తమ ఉద్యోగుల వేతన పెంపు అంశంపై యూనియన్లతో చర్చలు జరపాలని ఐబీఏను కోరాయి. ఈ వేతనం పెంపు విషయంలో ఐబీఏ, యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (UFBU) మధ్య అంగీకారం కుదిరింది. నవంబర్ 2017 నాటి వేతనంపై 15 శాతం లెక్కించి వార్షిక వేతన పెంపును అమలు చేస్తారు.
అలాగే, కొత్త పెన్షన్ పథకంకు (NPS) బ్యాంకులు ఇచ్చే వాటాను కూడా 10 శాతం నుండి 14 శాతానికి పెంచనున్నారు. ప్రభుత్వం ఆమోదం లభించాక ఇది అమలు అవుతుంది. ఫ్యామిలీ పెన్షన్ విషయంలో పరిమితిని తొలగించడంతో పాటు మూలవేతనంలో 30 శాతాన్ని ఇవ్వడానికి అంగీకారం కుదిరింది.

కీలక అంశాలు..
- వేతన సవరణ నవంబర్ 2017 నుండి 2022 వరకు
- అంతకుముందు సెటిల్మెంట్ రూ.4,725తో పోలిస్తే తాజా వేజ్ బిల్ పెంపు ప్రకారం రూ.7,898 కోట్లుగా ఉంది.
- బ్యాంకుల నిర్వహణ లాభం 5 శాతం కంటే తక్కువగా ఉంటే అదనపు వేతనం లేదా ప్రోత్సాహకం లభించదు.
- 5%-10% నిర్వహణ లాభం ఉంటే అదనపు వేతనం 5 రోజులకు, 10%-15% నిర్వహణ లాభం ఉంటే అదనపు వేతనం 10 రోజులకు, 15% శాతానికి పైగా ఉంటే 15 రోజుల అదనపు వేతనం లభిస్తుంది.
- NPS కాంట్రిబ్యూషన్ ప్రస్తుతం ఉన్న 10 శాతం నుండి 14 శాతానికి పెంపు.
- ఫ్యామిలీ పెన్షన్ విషయంలో ప్రస్తుతం ఉన్న రూ.9,000 పరిమితి తొలగింపు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications