For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోట్లరద్దు టైంలో 625 టన్నుల కొత్త నోట్లు మోసుకెళ్లిన IAF

|

2016లో నోట్లరద్దు అనంతరం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ఎలా సహకరించిందగో మాజీ చీఫ్ బీఎస్ ధనోవా ఆదివారం వెల్లడించారు. నోట్ల రద్దు అనంతరం పెద్ద మొత్తంలో కొత్త నోట్లను వాయిసేన విమానాల్లో తరలించామని చెప్పారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు వైమానిక దళం సాయంతో దాదాపు 625 టన్నుల బరువు కలిగిన కొత్త కరెన్సీ కట్టలను చేర్చినట్లు చెప్పారు.

దాదాపు రూ.1 కోటి రూపాయల విలువ కలిగిన కొత్త నోట్ల బరువు 20 కేజీలు ఉండవచ్చునని, అలా చూసుకుంటే తాము ఎంత మొత్తం తరలించామో తనకైతే తెలియదన్నారు. ఇందుకోసం ఐఏఎఫ్ 33 మిషన్స్‌ను చేపట్టినట్లు తెలిపారు. ధనోవా డిసెంబర్ 31 2016 నుంచి సెప్టెంబర్ 30 2019 మధ్య ఐఎఫ్ చీఫ్‌గా ఉన్నారు.

నోట్లరద్దు, జీఎస్టీ వల్ల వారికి లాభం, రూ.2 లక్షల కోట్లు తేవాలి: సంగీతారెడ్డినోట్లరద్దు, జీఎస్టీ వల్ల వారికి లాభం, రూ.2 లక్షల కోట్లు తేవాలి: సంగీతారెడ్డి

IAF flew 625 tonnes of new notes post demonetisation

అభినందన్ వర్ధమాన్ గురించి స్పందిస్తూ ఆయన మిగ్ 21కు బదులు రాఫెల్ విమానంలో వెళ్లి ఉంటే కనుక పరిస్థితి మరోరకంగా ఉండేదన్నారు. కనీసం ఏ విమానాన్ని కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకోలేదని, నిర్ణయానికే పదేళ్లు తీసుకున్నారని, అందుకే అభినందన్ రాఫెల్‌లో వెళ్లలేకపోయారన్నారు. అంతకుముందు బోఫోర్స్ శతఘ్నులు కొనుగోలు చేసినప్పుడు కూడా ఇలాగే వివాదమైందన్నారు. కానీ ఆ శతఘ్నులు అద్భుతంగా పని చేస్తున్నాయని చెప్పారు.

రక్షణ సముపార్జన వ్యవస్థను రాజకీయం చేస్తే అంతా వెనుకబడుతుందని, బోఫోర్స్ అనంతరం కొత్త వాటిని ఎప్పుడు కొనుగోలు చేస్తామని ప్రశ్నించారు. ఎస్400 గేమ్ చేంజర్ అని తాను ఎప్పుడూ చెబుతానన్నారు.

English summary

నోట్లరద్దు టైంలో 625 టన్నుల కొత్త నోట్లు మోసుకెళ్లిన IAF | IAF flew 625 tonnes of new notes post demonetisation

Former Air Chief Marshal BS Dhanoa has said that after demonetisation in 2016, the Indian Air Force (IAF) transported 625 tonnes of new currency notes to various parts of the country.
Story first published: Sunday, January 5, 2020, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X