బ్రిటిష్ మాజీ ప్రధాని రిషి సునక్.. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, రచయిత్రి సుధా మూర్తి కుమార్తె అక్షత మూర్తిని మనువాడిన సంగతి అందరికీ తెలిసిందే.తాజాగా తన భార్యకు ఎలా ప్రపోజ్ చేశాననే విషయాలను పంచుకున్నాడు.. తన భార్యకి కన్నడలో ప్రపోజ్ చేశానని..అందుకు ఆమె ఆనందంగా అంగీకరించిందని చెప్పుకొచ్చారు.ఆ సమయంలో తనకు కన్నడ భాష అంతగా రాకపోయినా ఆ భాషలోనే ప్రపోజ్ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపాడు.
ఎట్టకేలకు బెంగుళూరు ఫ్యామిలీ నుండి తాను అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని దీంతో పాటు కన్నడ సంస్కృతిని కూడా స్వీకరించానని తెలిపారు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో ఇంటర్యూలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. బ్రిటిష్ మాజీ ప్రధాని రిషి సునక్ ఈ ఇంటర్యూలో మాట్లాడుతూ..ఇద్దరం స్టాన్‌ఫోర్డ్‌లో కలుసుకున్నామని చెప్పుకొచ్చారు. అనంతరం 2009లో బెంగళూరులో కన్నడ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఇద్దరికీ ఇప్పుడు కృష్ణ, అనౌష్క అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

దీంతో పాటుగా క్రికెట్ కి సంబంధించిన ఆసక్తిర విషయాలను కూడా షేర్ చేసుకున్నాడు. ఇష్టమైన క్రికెటర్ గురించి మాట్లాడుతూ..విరాట్ కోహ్లీ అంటే చాలా ఇష్టమని తెలిపారు. కాగా పెళ్లి సమయంలో అత్తమామలు అతనికి RCB జెర్సీని బహుమతిగా ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. అప్పటి నుండి ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)కి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. చాలా కాలం క్రితం మేము ఐపీఎల్ మ్యాచ్‌లకు వెళ్ళామని చెప్పుకొచ్చారు. నేను డౌనింగ్ స్ట్రీట్‌లో ఆటగాళ్లని ఉత్సాహపరిచేవాడినని తెలిపారు.
తనకు ఇండియా నుంచి లభించిన విలువైన వస్తువు గురించి కూడా సునక్ మాట్లాడారు. తాను యూకే ప్రధానిగా ఉన్నప్పుడు భారతదేశ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తనకు బహుమతిగా బ్యాట్ ఇచ్చారని..అది ఎంతో విలువైన వస్తువు అని చెప్పారు సునక్. ఫిల్ సాల్ట్, లియామ్ లివింగ్‌స్టోన్ ఆర్సీబీని ఫైనల్లో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపిఎల్ 2025 ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబికి గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు సునక్.
వ్యక్తిగత అభిమానం కన్నా దౌత్య పరంగా క్రికెట్ గురించి మాజీ ప్రధాని ఎక్కువగా మాట్లాడారు. ఈ దౌత్యపరమైన సంబంధాలు ఇరుదేశాధి నేతలతో కలిసి విభేదాలను పరిష్కరించుకునే మార్గానికి నాంది పలుకుతాయన్నారు. ముఖ్యంగా యాషెస్ సిరీస్ సమయంలో ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో జరిగిన వివాదాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తరచూ చర్చల్లో క్రికెట్ గురించి మాట్లాడుతూ ఉత్సహాభరితంగా చర్చలు ముందుకు సాగేందుకు సహకరించుకున్నట్లు తెలిపారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications