Hyundai IPO: భారతీయ స్టాక్ మార్కెట్లో ఐపీవోలపై బెట్టింగ్ వేస్తున్న వారి పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. అవును దరఖాస్తులో ఏ ఐపీవో తగిలినా లాభాలు మాత్రం పొందుతూనే ఉన్నారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో వస్తున్న ఐపీవోల్లో ఒక మెగా ఐపీవో కూడా ఉండటం గమనార్హం.
దేశంలో చాలా కాలం కిందట ఎల్ఐసీ అతిపెద్ద ఐపీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దానీ తర్వాత తాజాగా ఎల్ఐసీ రికార్డులను బద్ధలుకొడుతూ హ్యుందాయ్ ఇండియా రూ.25,000 కోట్ల మెగా ఐపీవోకు తెరలేపింది. తాజాగా దీనికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావటంతో ఇన్వెస్టర్లు పండుగ చేసుకుంటున్నారు. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ నుంచి ఆమోదం పొందిన తర్వాత భారతదేశపు అతిపెద్ద ప్రారంభ పబ్లిక్ ఆఫర్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. జూన్ 2024లో కంపెనీ సెబీ వద్ద ఐపీవో కోసం డ్రాఫ్ట్ పేపర్‌లను దాఖలు చేసింది.

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీవో రాబోతోందన్న చర్చ ఊపందుకోగానే ఇన్వెస్టర్ల మదిలో తాము కూడా అందులో పాల్గొనాలనే ఆలోచన మెుదలైంది. అయితే ఇక్కడ కంపెనీ విలువ ఎంత అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ క్రమంలో కంపెనీ ఐరీవో ప్రైస్ బ్యాండ్ ధర ఒక్కో షేరుకు రూ.1265 నుంచి రూ.1988 మధ్య ఉండొచ్చని కొన్ని నివేదికల ప్రకారం తెలుస్తోంది. తాజా ఐపీవో ద్వారా భారత స్టాక్ మార్కెట్ల నుంచి కంపెనీ 3.5 బిలియన్ డాలర్లను సమీకరించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఆటో దిగ్గజం ఐపీవోను వచ్చే నెల ప్రారంభించవచ్చని తెలుస్తోంది. దక్షిణ కొరియా ఆటో దిగ్గజం భారత క్యాపిటల్ మార్కెట్ వాచ్‌డాగ్ నుంచి క్లియరెన్స్ పొందటంతో మార్కెట్లో ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు డబ్బు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఇష్యూ పూర్తిగా ప్రమోటర్ హ్యుందాయ్ మోటార్ కంపెనీచే ఆఫర్-ఫర్-సేల్ అని తెలుస్తోంది. హ్యుందాయ్ మోటార్స్ ఇండియా ఈక్విటీ షేర్ల లిస్టింగ్ కంపెనీ బ్రాండ్ ఇమేజ్‌ను మెరుగుపరుస్తుందని భావిస్తోంది. హ్యుందాయ్ మోటార్ ఇండియా FY24లో ప్రయాణీకుల విక్రయాల పరిమాణంలో మారుతి సుజుకి తర్వాత భారతదేశపు రెండవ అతిపెద్ద కార్ల తయారీ సంస్థగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హ్యుందాయ్ ఐపీవో ప్రక్రియను సిటీ, హెచ్‌ఎస్‌బిసి సెక్యూరిటీస్, జెపీ మోర్గాన్, కోటక్ మహీంద్రా క్యాపిటల్, మోర్గాన్ స్టాన్లీ లీడ్ మేనేజర్‌లుగా ఉండనున్నాయి.
స్విగ్గీ ఐపీవోకి సెబీ ఓకే..
మరోపక్క అతిపెద్ద ఐపీవో కోసం దేశీయ ఫుడ్ డెలివరీ స్టార్టప్ స్విగ్గీ సైతం మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ నుంచి అనుమతులు పొందినట్లు వెల్లడైంది. స్విగ్గీ ఇష్యూ నవంబర్‌లో ప్రారంభించవచ్చని నివేదికల ప్రకారం తెలుస్తోంది. కంపెనీ తన ఐపీవో పరిమాణాన్ని సుమారు రూ.11,700 కోట్లకు పెంచుతుందని భావిస్తున్నారు. ఇదే జరిగితే కంపెనీ 5వ అతిపెద్ద ఐపీవోగా మార్కెట్లో అవతరించనుంది. ఆఫర్ పరిమాణాన్ని పెంచడానికి అక్టోబర్ మొదటి వారంలో ఇన్వెస్టర్ల మీటింగ్ ప్లాన్ చేయబడుతుందని సమాచారం. దీని ప్రకారం 2021లో ప్రారంభించబడిన దాని ప్రధాన ప్రత్యర్థి జొమాటో యొక్క రూ.9,375 కోట్ల ఇష్యూ కంటే స్విగ్గీ ఐపీవో పెద్దదిగా ఉండనుందని తెలుస్తోంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications