For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్లోకి హ్యుండాయ్ ఓరా: కారు ధరలు, ఫీచర్స్ ఇవే

|

హ్యుండాయ్ ఓరా మంగళవారం మార్కెట్లోకి వచ్చింది. కంపాక్ట్ సెడాన్ విభాగంలో ఈ కారు మారుతీ డిజైర్, ఫోర్డ్ అస్పైర్, హోండా అమెజా, టాటా టిగోర్‌కు పోటీ ఇవ్వనుంది. ఈ సెగ్మెంట్లో ఇప్పటి వరకు మారుతీ డిజైర్, హోండా అమెజ్‌లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. వీటికి ఇది గట్టి పోటీ అని భావిస్తున్నారు.

హ్యుండాయ్ ఓరా ధరలు రూ.5.79 లక్షల నుంచి రూ.9.22 లక్షలుగా (ఎక్స్ షోరూం, ఢిల్లీ) ఉంది. BS-6 నిబంధనల్ని పాటించే 1.2 లీటర్ల ఇంజిన్ సామర్థ్యంతో ఈ కారును రూపొందించారు. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో లభిస్తుంది. ఈ సెగ్మెంట్లో ప్రస్తుతం ఉన్న తమ మోడల్ ఎక్సెంట్ పెద్దగా అమ్మకాలు సాధించడం లేదని, కానీ హ్యుండాయ్ ఓరా మాత్రం మంచి అమ్మకాలు సాధించగలదని కంపెనీ ధీమాగా ఉంది.

భారీగా పెరిగిన నిరుద్యోగం, చదువుకున్న వారికి ఉద్యోగాల్లేవు!భారీగా పెరిగిన నిరుద్యోగం, చదువుకున్న వారికి ఉద్యోగాల్లేవు!

Hyundai Aura launched, Price prices start at Rs 5.79 lakhs

పెట్రోల్ కారు 20 కిమీ, డీజిల్ కారు 25 కి.మీ. మైలేజీని ఇస్తాయి. ఈ కారులో వైర్‌లెస్ ఛార్జర్, డ్రైవర్ రియర్ వ్యూ మానిటర్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్, 8.0 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ప్రొజెక్టర్ ఫాగ్ ల్యాంప్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. నాలుగు సిలిండర్లు, 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తున్న వేరియంట్ 83 బీహెచ్‌పీ శక్తి, 114 ఎన్ఎం టార్క్‌ను విడుదల చేస్తుంది. దీనికి సీఎన్జీ ఆప్షన్ ఉంది.

మూడు సిలిండర్లు, 1.3 లీటర్ డీజిల్ టర్పో ఛార్జ్ ఇంజిన్‌తో రానున్న వేరియంట్ 74 బీహెచ్‌పీ శక్తి, 190 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మరిన్ని వేరియంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక డీజిల్ వేరియంట్ 25.47 కేఎంపీఎల్, పెట్రోల్ 25 కేఎంపీఎల్ మైలేజీ ఇస్తుంది.

రెండు ఎయిర్ బ్యాగ్స్, యాంటీ బ్రేకింగ్ సిస్టం, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ వార్నింగ్ వంటి వసతులు ఉన్నాయి. కొన్ని వేరియంట్లలో పార్కింగ్ కెమెరా, క్రూజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి.

Read more about: hyundai business news
English summary

మార్కెట్లోకి హ్యుండాయ్ ఓరా: కారు ధరలు, ఫీచర్స్ ఇవే | Hyundai Aura launched, Price prices start at Rs 5.79 lakhs

Hyundai has expanded its product line-up in India with the launch of the Aura compact sedan. The vehicle has been introduced at a starting price of Rs 5,79,900 and it is available in petrol, diesel and CNG options.
Story first published: Wednesday, January 22, 2020, 12:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X