భారతదేశంలోని ప్రధాన ఐటీ నగరాల్లో ఒకటైన హైదరాబాద్ ఈ సమ్మల భరించలేని నీటి కొరతతో అల్లాడుతోంది. ఎటు చూసినా నీటి ట్యాంకర్లే కనిపిస్తున్నాయి. నగరమంతా ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWS&SB) ఇప్పటికే వేల సంఖ్యలో ట్యాంకర్లను నడుపుతున్నా, పశ్చిమ, మధ్య ప్రాంతాలైన కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి చోట్ల మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడి ప్రజలు పూర్తిగా ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఈ నీటి సంక్షోభం సామాన్యుడి జేబులకు చిల్లు పెడుతోంది. దింతో కేవలం నీటి కోసమే వారానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి నెలకొంది.

ఒకప్పుడు రోజుకు 5-6 ట్యాంకర్లను అందించే ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ఇప్పుడు డిమాండ్‌కు తగ్గట్టు సప్లయ్ చేయలేకపోతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. 25 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ.3,500 నుంచి రూ. 4 వేల వరకు అలాగే 10 వేల లీటర్ల ట్యాంకర్‌కు రూ. 1,500 నుంచి రూ. 2 వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ ధరల పెరుగుదల ముఖ్యంగా కొండాపూర్, మాదాపూర్, గుచ్చిబౌలి వంటి ప్రాంతాల ప్రజలను తీవ్రంగా బాధిస్తోంది. కొండాపూర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో నివసిస్తున్న రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేస్తూ, "గత సంవత్సరం మాకు ట్యాంకర్ నీటి అవసరం లేకుండా ఉండేది. కానీ ఈసారి తప్పనిసరిగా ట్యాంకర్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. సాధారణంగా 7-8 గంటలు వచ్చే నీరు ఇప్పుడు కేవలం 3-4 గంటలే వస్తోంది" అని తెలిపారు.
నగరంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో ఈ సమస్య మరింత జఠిలమైంది. "గతంలో 600 మీటర్ల లోతులో నీరు కనిపించేది. కానీ ఇప్పుడు 1,200 మీటర్లు తవ్వినా నీరు లేదు" అని రవిశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అపార్ట్‌మెంట్ సముదాయాలు పూర్తిగా ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాయి. ప్రతి కుటుంబం వారానికి కనీసం రూ. 2,500 నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. మే, జూన్ నెలల్లో ఈ ఖర్చు రూ. 3 వేల వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ నీటి కొరత హైదరాబాద్ వాసుల జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమ, మధ్య ప్రాంతాల్లోని ఉన్నత స్థాయి నివాస ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. 2025 మే నెలలో దేశంలో సమ్మర్ వేడి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అహ్మదాబాద్, రాజ్‌కోట్, నాగ్‌పూర్, చెన్నై, జోధ్‌పూర్, భువనేశ్వర్ వంటి నగరాలతో పాటు హైదరాబాద్ కూడా తీవ్రమైన వేడిగాలులను ఎదుర్కొంటోంది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications