హైడ్రా తరువాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీపై ఫోకస్ పెట్టింది. నగరం చుట్టుపక్కల శివార్లలో మూసీ నది శుద్ధి, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంతో సహా ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అభివృద్ధిని ప్లాన్ చేస్తోంది. ఈ పనులన్నీ నగరాన్ని మార్చే లక్ష్యంతో ఉన్నాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ విద్య, క్రీడలు, వైద్య పర్యాటకానికి హబ్‌గా ఉండనుంది. దింతో హైదరాబాద్ హోదా మరింతగా పెరగనుంది. చారిత్రాత్మకంగా హైదరాబాద్ కుతుబ్ షాహీ రాజవంశం ద్వారా స్థాపించగా సికింద్రాబాద్ బ్రిటిష్ పాలనలో అభివృద్ధి కాగా ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు హయాంలో సైబరాబాద్ అనే ఐటీ హబ్ ఆవిర్భవించింది. హైదరాబాద్ ఎవల్యూషన్ అండ్ ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ హైదరాబాద్ మరో దశ వృద్ధికి ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయడం చాలా కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ ఫ్యూచర్ సిటీకి ఔటర్ తరహా రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి ఫ్యూచర్ సిటీకి త్వరగా చేరుకునేందుకు ఔటర్ రింగు రోడ్డు తరహాలో 330 అడుగుల రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే హైదరాబాద్ శివారు నుండి ఫ్యూచర్ సిటీ మీదుగా రీజినల్ రింగు రోడ్డు వరకూ 40 కిలోమీటర్ల వరకు రహదారిని నిర్మించనున్నారు. అందుకు దాదాపు 1000 ఎకరాల ప్రైవేటు భూములను అధికారులు సేకరించనున్నారు. మొదటి దశలో 458 ఎకరాలు సేకరణకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు.

భారతదేశంలోని ప్రముఖ నగరంగా హైదరాబాద్‌ను మార్చడం ఒక వ్యూహంలో భాగంగా కనిపిస్తుంది. మరోపక్క ఫ్యూచర్ సిటీకి సమీపంలో రియల్ ఎస్టేట్ ఉపందుకొంనుంది. దీనికితోడు ఇప్పటికే నగరంలోని శివారు ప్రాంతాల్లో ఐటీ కంపెనీలు, వెంచర్లు కూడా కొలువుదీరడంతో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ సమీపంలో కూడా ఐటీ కంపెనీలు క్యూ కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళా ఇదే జరిగితే ఇక్కడ టౌన్ షిప్స్, అపార్ట్మెంట్స్ ఇలా కొత్త వెంచర్స్ ఏర్పడనున్నాయి. తాజగా ఏపీ రాజధాని అభివృద్ధి పనులకు గ్రీన్ సిగ్నల్ రావడం అక్కడికి ఇప్పుడు పెట్టుబడుల కంపెనీలు వస్తున్నాయి. ఈ తరుణం ఫ్యూచర్ సిటీకి చేరువలో కూడా పెట్టుబడుల పరంపర కొనసాగవచ్చు.


Click it and Unblock the Notifications