బనకచర్లపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు.. చుక్క నీరు కూడా వదిలిపెట్టేది లేదని స్పష్టం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో గోల్కొండ కోట ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కీలక ప్రసంగం చేశారు. తొలుత దేశ స్వాతంత్ర్య పోరాటం గురించి మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య సంగ్రామం అహింసా మార్గాన్ని అనుసరించి ప్రపంచానికి సరికొత్త దారి చూపిందని తెలిపారు. 1947 ఆగస్టు 15 నాటికి భారతదేశం ఐక గొప్ప ఐక్యతను కాపాడుకుని ముందడుగు వేసిందన్నారు. నెహ్రూ అప్పట్లో చేసిన ప్రసంగం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని.. అదే స్ఫూర్తితో పేదల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి దిశగా పయనిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం మారుపేరుగా మారిందని నొక్కి చెప్పారు. మూడు కోట్లకు పైగా జనాభాకు రూ.1 కిలో సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత మా ప్రభుత్వానిదేనని తెలిపారు. ఈ పథకం కేవలం ఆకలి తీరుస్తుందే కాకుండా పేదల ఆత్మగౌరవాన్ని సమర్థిస్తుందని తెలిపారు. వీటితో పాటు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేస్తూ రూ.2 లక్షల రుణ మాఫీని ప్రారంభించినామని.. రైతు భరోసా నిధులను సమయానికి గ్రామీణుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఒక్కొక్క రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని సీఎం స్పష్టం చేశారు. 78 లక్షల వ్యవసాయ మోటార్లకు నిరంతర ఉచిత విద్యుత్‌ అందించడం ద్వారా రైతులు రాష్ట్రాన్ని అన్నపూర్ణ తెలంగాణగా నిలిపారని అన్నారు.

CM Revanth Reddy speech Hyderabad game changer for India Independence Day speech Telangana Revanth Reddy on Hyderabad growth Telangana CM statement economy Hyderabad development news India economic future Hyderabad Revanth Reddy latest news Telangana Independence Day address Hyderabad emerging global city -2047

జలవనరులు రాష్ట్రానికి జీవనాధారమని.. గోదావరి-కృష్ణా నదుల వాటాలో ఎలాంటి రాజీపడబోమన్నారు. తమ హక్కును సాధించేవరకు వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో వేల కోట్ల రూపాయలను వృథా చేసినప్పటికీ, తమ ప్రభుత్వం నీటి ప్రాజెక్టుల విషయంలో ఆచరణాత్మక దిశగా ముందుకెళ్తుందని చెప్పారు. హైదరాబాదుకు ఉన్న బ్రాండ్‌ విలువ మరింత పెంచే కార్యక్రమాలు చేపట్టానని పేర్కొన్నారు. AI సిటీ కోసం 200 ఎకరాలు కేటాయించడం, బయో-ఏసియా సదస్సు విజయవంతంగా నిర్వహించడం ద్వారా నగరం అవకాశాలతో నిండిన "ఫ్యూచర్ సిటీ"గా హైదరాబాద్ ఎదుగుతోందన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదం మళ్లీ మొదలైంది. బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల ఎవరికీ నష్టం జరగదని... ఈ ప్రాజెక్టుపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని ఈరోజు ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీనిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కృష్ణా, గోదావరి నదులపై తెలంగాణకు ఉన్న హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ప్రతి నీటి చుక్క కోసం తమ ప్రభుత్వం పోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కు అప్పగించారని విమర్శించారు. ఆనాటి ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే ఈరోజు తెలంగాణ సాగునీటి హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.

హైదరాబాద్‌ గొప్పతనాన్ని కాపాడేందుకు మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు . హైడ్రా వ్యవస్థ ద్వారా నగరంలోని విలువైన ప్రభుత్వ భూములను అక్రమాల నుంచి రక్షించామని తెలిపారు. బతుకమ్మకుంటలను తిరిగి పునఃసృష్టించడం ద్వారా రాష్ట్ర సంస్కృతి పునరుజ్జీవించబడిందని తెలిపారు. శంషాబాద్‌ తర్వాత వరంగల్‌, ఆదిలాబాద్‌లలో కూడా విమానాశ్రయాల నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్-బెంగళూరు కారిడార్ లో కీలక ప్రాజెక్టులు ప్రారంభించనున్నట్టు తెలిపారు.

తెలంగాణ రైజింగ్-2047 పేరుతో రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధికి ప్రత్యేక విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించామన్నారు. డిసెంబర్ 9న దీనిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని పేర్కొన్నారు. వచ్చే దశల్లో భారత్‌ పోటీలో గేమ్‌ ఛేంజర్‌ గా హైదరాబాద్‌ నిలుస్తుందన్నారు. దేశ GDPలో ప్రస్తుతం తెలంగాణ భాగస్వామ్యం 5 శాతమైతే దాన్ని 10 శాతం వరకు పెంచేదిశగా మా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక స్కిల్ యూనివర్సిటీ, క్రీడలకు ప్రత్యేకంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు శుభవార్త చెప్పారు.

ఇక పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులు దేశంలోనే కాక ప్రపంచంలోనే ఉత్తమ ఔత్సాహిక సదస్సులను నిర్వహించడంలో ముందు వరసలో ఉండటం చాలా గర్వంగా ఉందన్నారు. డ్రగ్ నియంత్రణలో తెలంగాణ పోలీసులు ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలిచారని వెల్లడించారు. చివరగా ఆయన ఉపన్యాసం ముగిస్తూ.. గత ప్రభుత్వం తమకు రూ.8.21 లక్షల కోట్లు అప్పుగా వదిలి వెళ్లినా కూడా, తాము ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+