హైదరాబాద్ వాసులకు అలర్ట్.. తాగునీటితో ఇంటి నేల తుడిస్తే రూ.20 వేల జరిమానా..

Hyderabad Water Crisis Measures: హైదరాబాద్ నగరంలో తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB) కఠిన చర్యలకు దిగింది. తాగునీటితో నేలలు, ప్రాంగణాలు తుడుస్తున్న వారికి బోర్డు రూ. 1,000 నుండి రూ. 20,000 వరకు జరిమానాలు విధిస్తోంది. అక్టోబర్ 29, గురువారం నాడు వాటర్ బోర్డు ప్రారంభించిన 'పానీ' (PAANI) మొబైల్ యాప్ ద్వారా ప్రజలు వాటర్ వారియర్స్ గా నీటి వృధాను ఫొటోలు, వీడియోల రూపంలో నివేదిస్తున్నారు.

ఈ యాప్ ప్రారంభమైనప్పటి నుండి గత నాలుగు వారాల్లో 250కి పైగా ఫిర్యాదులు నమోదు కాగా.. అందులో సుమారు 75 ఫిర్యాదులు తాగునీరు లేదా భూగర్భ జలాలతో నేలలు శుభ్రం చేస్తున్న వాటిపైనే రావడం గమనార్హం. ది టైమ్స్ ఆఫ్ ఇండియా సేకరించిన బోర్డు వివరాల ప్రకారం.. ఈ ఫిర్యాదులలో అత్యధికంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ నివాస ప్రాంతాల నుండి వచ్చాయి. వీటితో పాటు కూకట్‌పల్లి, ఖైరతాబాద్, మెహదీపట్నం ప్రాంతాల్లోనూ కేసులు వెలుగుచూశాయి.

Hyderabad water wastage fine Rs 20000 water fine Hyderabad Hyderabad drinking water rules mopping with drinking water Hyderabad water conservation water wastage penalty Hyderabad residents water restrictions drinking water misuse Hyderabad water crisis 20

క్షేత్రస్థాయిలో జరుగుతున్న తనిఖీలు, ఉల్లంఘనల తీరుపై బోర్డు రెవెన్యూ విభాగంలోని సీనియర్ అధికారులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యాప్‌లో వచ్చిన ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయి బృందాలు స్వయంగా ధృవీకరిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం పూట పలు ఇళ్లలో తాగునీటి లైన్లకు నేరుగా ప్రెషర్ మోటార్లను అనుసంధానించి నేలలు, డ్రైవ్‌వేలు, చుట్టుపక్కల ఆవరణాలను కడుగుతున్నట్లు అధికారులు గుర్తించారు.

Also Read

తనిఖీ బృందాలు సంబంధిత ప్రాంగణానికి వెళ్లి ఫిర్యాదుదారు అప్‌లోడ్ చేసిన ఫొటోలు, వీడియోలను వినియోగదారులకు చూపిస్తున్నాయి. తొలుత నోటీసులు జారీ చేస్తున్న అధికారులు, నిర్ణీత గడువులోగా జరిమానా చెల్లించని పక్షంలో ఆ మొత్తాన్ని నేరుగా నెలవారీ నీటి బిల్లులో జతచేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుండి ఇప్పటివరకు నీటిని వృధా చేసినందుకు సుమారు 1,700 మంది నివాసితులకు జరిమానాలు విధించిన వాటర్ బోర్డు, మొత్తం దాదాపు రూ. 50 లక్షల జరిమానాలను వసూలు చేసింది.

కేవలం ఇళ్లలో నేలలు కడగడమే కాకుండా 'పానీ' యాప్ ద్వారా అనేక ఇతర రకాల నీటి దుర్వినియోగం, లీకేజీలను కూడా పౌరులు నివేదిస్తున్నారు. యాప్‌లో నమోదైన ఫిర్యాదులలో సుమారు 60 ఫిర్యాదులు పైప్‌లైన్ నీటి లీకేజీలకు సంబంధించినవి కాగా.. మరో 31 ఫిర్యాదులు తాగునీటితో వీధులను కడగడంపై వచ్చాయి. మోటార్ల అక్రమ వినియోగం, పొంగిపొర్లుతున్న ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, నిర్మాణ పనులకు, తోటపనికి తాగునీటిని వినియోగించడం వంటి మొత్తం 10 రకాల ఉల్లంఘనలను ఈ యాప్ పరిధిలోకి తీసుకువచ్చారు.

ఇప్పటివరకు 'పానీ' యాప్ 1,000కి పైగా డౌన్‌లోడ్‌లు నమోదు చేసుకోగా, సుమారు 700 మంది క్రియాశీల వినియోగదారులు నిరంతరం నీటి వృధాను పర్యవేక్షిస్తూ అధికారులకు సమాచారం అందిస్తున్నారు. పౌరుల భాగస్వామ్యంతో నడిచే ఈ వ్యవస్థ నగరంలో జల సంరక్షణకు రోజురోజుకు మరింత బలమైన సాధనంగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు.

మరోవైపు నగర జలాశయాలలో నీటి నిల్వల పరిస్థితి, పెరుగుతున్న జనాభా అవసరాల దృష్ట్యా జలమండలి ఇటీవల పర్యవేక్షణను మరింత ముమ్మరం చేసింది. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు, మంజీరా, సింగూరు జలాశయాలపై ఆధారపడుతుండగా, వేసవి ముందు నుంచే నీటి సరఫరాలో సమతుల్యత పాటించేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

తాగునీటిని కేవలం తాగడానికి, వంట అవసరాలకు మాత్రమే పరిమితం చేయాలని నివాసితులు, వాణిజ్య సముదాయాలు, అపార్ట్‌మెంట్ అసోసియేషన్లకు HMWSSB విజ్ఞప్తి చేసింది. నేలలు శుభ్రపరచడానికి, వాహనాలు కడగడానికి, గార్డెనింగ్, నిర్మాణ పనులకు మురుగునీటి శుద్ధి కేంద్రాల నుండి వచ్చే శుద్ధి చేసిన నీటిని మాత్రమే వినియోగించాలని సూచించింది. భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండాలంటే ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే భారీ జరిమానాలు, కనెక్షన్ల నిలిపివేత వంటి కఠిన చర్యలు తప్పవని బోర్డు స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+