హైదరాబాద్ vs బెంగళూరు: స్కూల్ ఫీజు గ్రేడ్ 1-5 కి రూ.7.5 లక్షలా..ఇదేమి చదువంటూ షాక్ అవుతున్న నెటిజన్లు!

ఇప్పటి రోజుల్లో పిల్లలకి మంచి విద్య ఇవ్వడం తల్లిదండ్రుల ప్రధాన లక్ష్యం. కానీ ఆ ఫీజులు మాత్రం వేలకు వేలు పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్‌ మరియు బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో టాప్‌ స్కూల్‌లలో అడ్మిషన్‌ చూస్తే ఫీజులు లక్షల్లో దాటుతున్నాయి. ప్లే స్కూల్ నుంచి హై స్కూల్‌ వరకు ప్రతి క్లాస్‌కి వేరువేరుగా ఫీజులు ఉండగా, ముఖ్యంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు తల్లిదండ్రులు ఎక్కువగా ఫీజు భారాన్ని మోయాల్సి వస్తోంది. ముఖ్యంగా మెట్రో సిటీల్లో అయితే, స్కూల్ ఫీజులు విన్న వెంటనే తల్లిదండ్రులకి "అయ్యో, ఇది MBA కంటే ఎక్కువ ఖర్చు!" అనిపించే పరిస్థితి. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ టాప్‌ స్కూల్స్‌ మరియు బెంగళూరు టాప్‌ స్కూల్స్‌ ఫీజు నిర్మాణంలో ఎలాంటి తేడాలు ఉన్నాయో చూద్దాం.

Hyderabad school fees Bengaluru school fees International schools India Aga Khan Academy Hyderabad fees HPS Begumpet fees Neev Academy Bengaluru fees TISB Bengaluru fees IB curriculum fees India Hyderabad vs Bengaluru school comparison International education cost India IB

బెంగళూరులోని ఒక ఇంటర్నేషనల్ స్కూల్ 1వ తరగతి ఫీజు రూ. 7.35 లక్షలు అని బయటికి రాగానే సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ మొదలైంది. "ఇంత ఫీజు అంటే చదువు నిజంగానే లగ్జరీ అయిపోయిందా?" అనే ప్రశ్న తల్లిదండ్రుల మధ్య చర్చకు దారి తీసింది.

ఎక్కడ మొదలైందంటే ట్విట్టర్ యూజర్ D. ముతుకృష్ణన్ స్కూల్ ఫీజు స్క్రీన్‌షాట్ పెట్టి,
"రూ.50 లక్షలు సంపాదించే IT కపుల్స్‌కి కూడా ఈ స్కూల్ భరించలేరు" అని రాసాడు. అది వెంటనే వైరల్ అయి, వేల లైకులు, రీట్వీట్లు, ఇన్‌స్టాగ్రామ్-వాట్సాప్‌లో షేర్లు అయ్యాయి. మనం ముందుగా హైదరాబాద్ మరియు బెంగుళూరు పాఠశాలల గ్రేడ్ 1-5 ఫీజు చూద్దం.

Hyderabad school fees Bengaluru school fees International schools India Aga Khan Academy Hyderabad fees HPS Begumpet fees Neev Academy Bengaluru fees TISB Bengaluru fees IB curriculum fees India Hyderabad vs Bengaluru school comparison International education cost India IB

హైదరాబాద్‌లో టాప్ స్కూల్స్ ఫీజులు (గ్రేడ్ 1-5):

Aga Khan Academy - అడ్మిషన్ + ఇతర ఫీజులు కలిపి రూ. 6-రూ. 9 లక్షల వరకు వెళ్ళొచ్చు.

HPS Begumpet (ICSE) - రూ.1.91 లక్షలు.

Oakridge International School - రూ. 3.5-రూ. 4.5 లక్షలు.

Chirec International School - రూ. 3-రూ. 4 లక్షలు.

Delhi Public School (DPS Hyderabad) - రూ. 1.5-రూ. 2.5 లక్షలు.

Glendale Academy - రూ. 2.5-రూ. 3.5 లక్షలు.

Birla Open Minds - రూ. 2-రూ. 3 లక్షలు.

ఈ సమాచారం ఎల్లో స్టేట్ వెబ్‌సైట్‌ నుండి తీసుకోబడింది. మొత్తంగా, హైదరాబాద్‌లో యావరేజ్ స్కూల్ ఫీజు రూ. 2.5-రూ. 3.5 లక్షల మధ్య ఉంటుంది.

బెంగళూరులో టాప్ స్కూల్స్ ఫీజులు (గ్రేడ్ 1-5):

Neev Academy (Yemalur Campus) - రూ. 6.5 లక్షలు (అడ్మిషన్ ఫీజు కలిపి).

Viral International/IB School - Grade 1కే రూ. 7.3 లక్షలు.

Greenwood High International School - రూ. 4-రూ. 5.5 లక్షలు.

Inventure Academy - రూ. 3.5-రూ. 5 లక్షలు.

The International School Bangalore (TISB) - రూ. 5-రూ. 6.5 లక్షలు.

Indus International School - రూ. 5.5-రూ. 7 లక్షలు.

Canadian International School - రూ. 4-రూ. 5.5 లక్షలు.

ఈ సమాచారం ఎడ్యుఫండ్ వెబ్‌సైట్‌ నుండి తీసుకోబడింది. బెంగళూరులో యావరేజ్ ఫీజు రూ. 4.5-రూ. 6 లక్షల మధ్య ఉంటుంది.

హైదరాబాద్‌లో HPS లాంటి ఆప్షన్లు ఉండటంతో తల్లిదండ్రులకు కొంత ఊరట. కానీ బెంగళూరులో IB కరికులం, అంతర్జాతీయ exposure పేరుతో ఫీజులు 40-60% ఎక్కువగా ఉంటాయి. Aga Khan (Hyderabad) vs Neev (Bangalore) ఫీజులు దాదాపు సమానమే, కానీ బెంగళూరులోని TISB, Indus, Viral IB Schools మాత్రం నిప్పంటిస్తున్నాయి.

సోషల్ మీడియాలో రియాక్షన్స్ కొందరు "అందుకే జనాలు పిల్లలు అక్కరలేదు అని అంటున్నారు!" అని కామెంట్స్. ఇంకొందరు "గ్లోబల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలంటే ఇంత ఖర్చు తప్పదు" అని డిఫెండ్ చేశారు. స్కూల్ సపోర్ట చేస్తు ఇంకొందరు IB, Cambridge లాంటి సిలబస్, ఇంటర్నేషనల్ exposure, స్టూడెంట్-టీచర్ రేషియో వీటిని జస్టిఫై చేస్తాయి అంటున్నారు. కానీ మరోవైపు, ప్రతి ఏడాది 10-30% వరకు ఫీజు పెంచుతున్న ట్రెండ్ను తల్లిదండ్రులు భరించలేకపోతున్నారు.

పేరెంట్స్ అసోసియేషన్స్ ఇప్పటికే ఆందోళన మొదలుపెట్టాయి. "ఫీజులు ఇష్టం వచ్చినట్టు పెంచకూడదు" అని కమిటీల ద్వారా కంట్రోల్ చేయాలని కోరుతున్నారు. కొందరు అయితే "ఫ్రీ మార్కెట్‌కి వదిలేయాలి, ఎవరికైతే వీలవుతుందో వాళ్లు చదివించాలి" అంటున్నారు.

హైదరాబాద్‌ vs బెంగళూరు విషయానికి వస్తే, ఇక్కడ కూడా తల్లిదండ్రులు డిస్కస్ చేసే పాయింట్స్ చాలా ఉన్నాయి. హైదరాబాద్‌లో స్కూళ్లు కొంచెం తక్కువ ఫీజులతో కూడా డీసెంట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాయని చాలామంది అంటారు. కానీ బెంగళూరులో ఫీజులు ఎక్కువైనా, అక్కడి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఫెసిలిటీస్, బోధనా విధానం కాస్త హై లెవెల్‌లో ఉంటుందని మరికొందరు చెబుతున్నారు. అంటే, ఎక్కడ ఖర్చు తక్కువగా, ఎక్కడ స్టాండర్డ్స్ ఎక్కువగా అన్నదే ఇక్కడ పోలికగా నిలుస్తోంది.

బోధనా విధానం కూడా ఫీజులపై పెద్ద ఎఫెక్ట్ చూపుతుంది. ఉదాహరణకి, CBSE, ICSE, IB, Cambridge లాంటి బోర్డులు ఉంటే, వాటి బోధనా విధానం, సిలబస్, మెలకువలు వేరుగా ఉంటాయి. వాటి ఆధారంగా స్కూల్స్ ఫీజులు కూడా మారిపోతాయి. అంతేకాక, రెగ్యులేటరీ చర్చ కూడా ఇక్కడ వస్తుంది. అంటే, పాఠశాల ఫీజులపై ప్రభుత్వం ఏమైనా కంట్రోల్ పెట్టాలా? లేక ఫ్రీగా స్కూల్స్ నిర్ణయించుకోవాలా? అన్నది చాలా మంది తల్లిదండ్రులు, విద్యావేత్తలు డిబేట్ చేసే టాపిక్‌గా మారింది.

కానీ పెద్ద ప్రశ్న మాత్రం భారతదేశంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్నది అందరికి దక్కే హక్కా? లేక కొద్దిమందికి మాత్రమే లభించే విలాసమా?

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+