సంక్రాంతి వచ్చిందంటే చాలు.. భాగ్యనగరం ఖాళీ అయిపోతుంది. లక్షలాది మంది తమ సొంత ఊర్లకు క్యూ కడతారు. అయితే ఈ పండగ ప్రయాణాల్లో అందరినీ వేధించే ప్రధాన సమస్య ట్రాఫిక్ జామ్స్ అలాగే టోల్ ప్లాజాల వద్ద గంటల తరబడి వేచి చూడటం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల లైఫ్ లైన్ అయిన హైదరాబాద్ విజయవాడ (Hyderabad Vijayawada (NH-65)) నేషనల్ హైవేపై రద్దీ ఊహించని స్థాయిలో ఉంటుంది. అయితే ఈసారి ప్రయాణికులకు ఊరటనిచ్చే ఒక అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. అదేంటంటే..

కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం కీలక విన్నపం
తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఒక సంచలన లేఖ రాశారు. జనవరి 9 నుండి 18 వరకు సంక్రాంతి రద్దీ దృష్ట్యా.. హైదరాబాద్ విజయవాడ (Hyderabad Vijayawada) హైవేపై టోల్ ఫీజును మినహాయించాలని ఆయన కోరారు. పండగ సమయంలో ట్రాఫిక్ సాధారణం కంటే 200% ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల టోల్ ప్లాజాల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయని ఆయన లేఖలో వివరించారు.
తెలంగాణ వాసులకు భారీ లబ్ధి!
సాధారణంగా ఈ హైవేని కేవలం ఆంధ్రప్రదేశ్ వెళ్లేవారే వాడతారని అనుకుంటారు. కానీ, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం వంటి జిల్లాలకు వెళ్లే వేలాది మంది తెలంగాణ ప్రజలు కూడా ఈ రోడ్డునే నమ్ముకున్నారు. వీరు రాష్ట్రం దాటకపోయినా పంతంగి, కొర్లపహాడ్ వంటి ప్లాజాల వద్ద భారీగా టోల్ చెల్లించాల్సి వస్తోంది. ఒకవేళ కేంద్రం ఈ ప్రతిపాదనకు ఓకే చెబితే.. కేవలం ఒక కారు ప్రయాణంలోనే అటు ఇటు కలిపి సుమారు రూ. 700 పైగా ఆదా అయ్యే అవకాశం ఉంది.
టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ గండం
సాధారణ రోజుల్లో పంతంగి టోల్ గేట్ వద్ద రోజుకు 25 వేల నుంచి 30 వేల వాహనాలు వెళ్తుంటాయి. కానీ, సంక్రాంతి సమయానికి ఆ సంఖ్య ఏకంగా 1 లక్షకు చేరుకుంటుందని గణాంకాలు చెబుతున్నాయి.
- పంతంగి: ఇది హైదరాబాద్ నుంచి 60 కి.మీ దూరంలో ఉంది.
- కొర్లపహాడ్: ఇది మరో 60 కి.మీ దూరంలో ఉంటుంది.
- చిల్లకల్లు: ఇది ఏపీ సరిహద్దు సమీపంలో ఉంటుంది.
బస్ టికెట్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో సొంత వాహనాల్లో వెళ్లే మధ్యతరగతి కుటుంబాలకు ఈ టోల్ మినహాయింపు దొరికితే అది నిజంగా పెద్ద పండగే అని చెప్పాలి.
మంత్రి కోమటిరెడ్డి చేసిన ఈ విన్నపంపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తే, ఈ సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగిపోవడమే కాకుండా జేబుకి కూడా చిల్లు పడకుండా ఉంటుంది. దీనిపై కేంద్రం నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో అని సామాన్య ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రకటన వస్తే ప్రయాణీకులకు టోల్ బాధలు తప్పే అవకాశం ఉంటుంది.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications