Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్! ఆ ఫ్లైఓవర్ క్లోజ్! అటు వెళ్తే ఇరుక్కుపోయినట్టే!

భాగ్యనగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉప్పల్ రింగ్ రోడ్డు ఒకటి. మీరు గనుక ఈ రూట్‌లో రెగ్యులర్‌గా ప్రయాణించే వారైతే మీకు ఒక ముఖ్యమైన అలర్ట్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వేగం పెరగడంతో, అధికారులు రింగ్ రోడ్డును తాత్కాలికంగా మూసివేశారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో ట్రాఫిక్ పోలీసులు కొత్త రూట్ మ్యాప్‌ను ప్రకటించారు. హైదరాబాద్ (Hyderabad) లో ఇప్పటికే పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలకు తోడు, ఈ పనులు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

Hyderabad Uppal Ring Road Closed Traffic Diversions Flyover Construction Routes Map 2026

బస్సు ప్రయాణికులకు గమనిక

సాధారణంగా ఉప్పల్ రింగ్ రోడ్డు బస్టాండ్ దగ్గర హన్మకొండ, వరంగల్ వైపు వెళ్లే బస్సులు ఆగుతుంటాయి. అయితే ఇప్పుడు ఆ బస్టాండ్‌ను నల్లచెరువు సమీపంలోని తాత్కాలిక స్టాప్‌కు మార్చారు. అంటే మీరు వరంగల్ హైవే వైపు వెళ్లాలంటే ఇకపై పాత రింగ్ రోడ్డు దగ్గర కాకుండా, అధికారులు సూచించిన కొత్త ప్రదేశానికి చేరుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల చాలామంది ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారు.

ఎటు నుంచి ఎటు వెళ్ళాలి? (కొత్త రూట్ మ్యాప్)

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా ఉన్నాయి..

  • బోడుప్పల్ వైపు నుంచి వచ్చే వారు: ఏషియన్ థియేటర్ జంక్షన్ నుంచి భాగ్యత్ లేఅవుట్ మీదుగా నాగోల్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.
  • సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లే భారీ వాహనాలు: హబ్సిగూడ నుంచి నాచారం మీదుగా చెంగిచెర్ల వెళ్ళి, అక్కడ నేషనల్ హైవేను కలవాలి.
  • చిన్న వాహనాలు (కార్లు, బైకులు): లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక ఉన్న మార్గం ద్వారా హైవేకి చేరుకోవచ్చు.

ఎందుకు ఈ పనులు?

హైదరాబాద్ (Hyderabad) తూర్పు ప్రాంతంలో ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఉప్పల్ - నారపల్లి మధ్య భారీ ఎలివేటెడ్ కారిడార్‌ను నిర్మిస్తోంది. దాదాపు 6.2 కిలోమీటర్ల మేర సాగే ఈ ఫ్లైఓవర్ పూర్తయితే, ఉప్పల్ జంక్షన్ వద్ద గంటల తరబడి వేచి ఉండే పని తప్పుతుంది. అయితే, స్థల సేకరణ , ఇతర సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. తాజా పనుల వల్లనైనా ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తవుతుందని నగరవాసులు ఆశిస్తున్నారు.

జనం గుండెల్లో రైళ్లు.. ఎంత కాలం ఈ తిప్పలు?

ఉప్పల్ రూట్‌లో నిత్యం ప్రయాణించే ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు ఈ వార్తతో ఆందోళన చెందుతున్నారు. అధికారులు రోడ్లు మూసివేసి, మళ్లింపులు అయితే విధించారు కానీ, ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయనే దానిపై స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు. మెట్రో స్టేషన్, బస్టాండ్ , నేషనల్ హైవే కలయికలో ఉండే ఈ ప్రాంతం ఇప్పుడు ఒక 'ట్రాఫిక్ గందరగోళం'లా మారింది. వరంగల్ హైవేపై ప్రయాణించే వారు కనీసం గంట సమయాన్ని ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+