హైదరాబాద్ (Hyderabad) నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఐటీ రంగం పుణ్యమా అని జనాల రద్దీ, వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యంగా సిటీ లోపల నుండి ఔటర్ రింగ్ రోడ్డు (ORR) చేరుకోవాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) నడుం బిగించింది. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులకు తోడుగా తాజాగా మరో రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రెడీ చేసింది.

బంజారాహిల్స్ నుంచి నేరుగా గచ్చిబౌలికి..
సిటీలో అత్యంత రద్దీగా ఉండే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి గచ్చిబౌలి వెళ్లాలంటే ఇప్పుడు ట్రాఫిక్‌లో నరకం కనిపిస్తుంది. దీనికి చెక్ పెడుతూ, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 నుంచి జడ్జెస్ కాలనీ, దుర్గం చెరువు మీదుగా నేరుగా శిల్పా లేఅవుట్ వరకు ఒక కొత్త ఎక్స్‌ప్రెస్ వే రాబోతోంది. సుమారు 10 కిలోమీటర్ల మేర సాగే ఈ రహదారిలో 6 నుంచి 7 కిలోమీటర్ల వరకు భారీ స్టీల్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. ఇది పూర్తయితే ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ తిప్పలు తప్పినట్లే!
షేక్‌పేట నుంచి గండిపేట వరకు 200 అడుగుల రోడ్డు!
మరోవైపు మెహదీపట్నం నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లే వాహనదారుల కోసం షేక్‌పేట నాలా నుంచి గండిపేటలోని సీబీఐటీ (CBIT) కాలేజీ వరకు సరికొత్త మార్గాన్ని డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గండిపేట కాండూట్ రోడ్డును ఏకంగా 200 అడుగులకు విస్తరించనున్నారు. భవిష్యత్తులో ఇక్కడ 7 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్నది అధికారుల ప్లాన్. దీనివల్ల మణికొండ, రాయదుర్గం ఏరియాల నుంచి ఔటర్ కు వెళ్లడం చాలా ఈజీ అవుతుంది.
శామీర్‌పేట కారిడార్ పనులకు గ్రీన్ సిగ్నల్!
ఇప్పటికే సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట ORR జంక్షన్ వరకు 18.5 కిలోమీటర్ల భారీ కారిడార్ పనులు పట్టాలెక్కాయి. రూ.2,232 కోట్లతో చేపట్టే ఈ పనులను 'బెకెమ్ ఇన్‌ఫ్రా' సంస్థ దక్కించుకుంది. ఇందులో భాగంగా ఆరు లైన్ల ఫ్లైఓవర్ తో పాటు హకీంపేట వద్ద అండర్ గ్రౌండ్ టన్నెల్ కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వచ్చే వారికి హైదరాబాద్ ప్రయాణం చాలా వేగంగా మారుతుంది.
ఎందుకు ఈ ప్రాజెక్టులు?
హైదరాబాద్ కు ఔటర్ రింగ్ రోడ్డు ఒక మణిహారంలా ఉన్నప్పటికీ.. సిటీ లోపల నుంచి అక్కడికి చేరుకోవడమే పెద్ద సవాలుగా మారింది. ఇన్నర్ రింగ్ రోడ్డులోని మెహదీపట్నం, ఉప్పల్, ఎల్బీ నగర్, పంజాగుట్ట వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటోంది. ఈ రద్దీని తగ్గించి, వాహనాలు ఎక్కడా ఆగకుండా 'సిటీ టు ఓఆర్ఆర్' చేరుకోవడమే ఈ కొత్త కారిడార్ల ప్రధాన ఉద్దేశ్యం.
ఈ కొత్త రోడ్లు అందుబాటులోకి వస్తే కేవలం ప్రయాణ సమయం తగ్గడమే కాదు, ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. రాబోయే రెండేళ్లలో హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి!
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..



Click it and Unblock the Notifications