హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ వార్నింగ్.. వాహనంతో బయటకు వస్తే ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ జేబులో ఉండాల్సిందే..

భాగ్యనగరంలో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ నడిపేవారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మార్చి 1 నుంచి కఠిన రూల్స్ అమల్లోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే బైక్‌లు, కార్లు నడుపితే వారికి భారీగా ఫైన్లు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. మైనర్లకు వాహనాలు అప్పగించి రోడ్లపైకి పంపిస్తే జైలుకు పంపిస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇకపై ఇలాంటి నిర్లక్ష్యానికి అవకాశం లేదని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.

ట్రాఫిక్ పోలీసుల ప్రకారం..లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానాలతో పాటు కేసులు కూడా తప్పవని చెబుతున్నారు.నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం ప్రమాదాలకు లైసెన్స్ లేని డ్రైవర్లే కారణమవుతున్నారు. సరైన శిక్షణ, అవగాహన లేకుండా వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.

Hyderabad traffic police driving without license fine Hyderabad traffic rules driving license violation no driving license penalty Hyderabad police warning traffic challan Hyderabad heavy fines traffic rules unlicensed driving Hyderabad motor vehicle act fines traffic police advisory Hyderabad road safety rules Hyderabad driving license mandatory Hyderabad traffic news traffic rule violations India vehicle checking Hyderabad traffic enforcement Hyderabad

ఈ క్రమంలో మార్చి 1 నుంచి హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిరంతరంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు Hyderabad Traffic Police ప్రకటించారు. ప్రధాన రహదారులు, కాలనీలు, స్కూళ్లు-కాలేజీల పరిసరాలు, ట్రాఫిక్ ఎక్కువగా ఉండే జంక్షన్లలో ప్రత్యేక తనిఖీలు చేపడతామని తెలిపారు. తనిఖీల్లో లైసెన్స్ లేకుండా వాహనం నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

డ్రైవింగ్ చేయాలంటే ముందుగా ఆర్టీఏ కార్యాలయంలో లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి అని పోలీసులు సూచిస్తున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడపడం చట్టవిరుద్ధమని, ఇది ఇతరుల ప్రాణాలకు ప్రమాదంగా మారుతుందని తెలిపారు. వాహనంతో బయటకు వచ్చిన ప్రతిసారి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని సూచించారు.

ఇక మరో కీలక అంశంపై కూడా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.లైసెన్స్ లేని వ్యక్తులకు వాహనాలు ఇవ్వకూడదు అని స్పష్టం చేశారు. డ్రైవింగ్ అర్హత లేని వారికి వాహనం అప్పగించడం కూడా నేరమేనని తెలిపారు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులు, వాహన యజమానులు చట్టపరమైన సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

లైసెన్స్ లేని వ్యక్తి మీ వాహనంతో ప్రమాదానికి గురైతే.. ఇన్సూరెన్స్ కంపెనీలు ఎలాంటి పరిహారం చెల్లించవని ట్రాఫిక్ పోలీసులు గుర్తుచేశారు. అప్పుడు ప్రమాదానికి సంబంధించిన ఆర్థిక భారం మొత్తం వాహన యజమానిపైనే పడుతుందని, అంతేకాకుండా కేసులు, కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కోవాల్సి వస్తుందని వివరించారు. ఈ విషయాన్ని ప్రతి వాహన యజమాని గమనించాలని సూచించారు.

ఇదే సమయంలో, ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి కొంతమంది వాహన యజమానులు నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నంబర్ ప్లేట్‌లో అంకెలు మార్చడం, స్టిక్కర్లు లేదా మాస్కులు తగిలించడం, రంగు పూయడం, వంకరగా అమర్చడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.

ఇలాంటి పనులకు పాల్పడితే కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. సీసీటీవీ కెమెరాలు, ఏఐ ఆధారిత ట్రాఫిక్ సిస్టమ్స్ ద్వారా నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌ను గుర్తించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+