హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ఐటీ కారిడార్‌లో మాస్టర్ ప్లాన్ రెడీ చేసిన దిగ్గజ కంపెనీలు..

Hyderabad Traffic: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని ఐటీ కారిడార్‌లో రోజురోజుకూ తీవ్రమవుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు సుమారు ఐదు లక్షల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 15 ప్రధాన కార్పొరేట్ సంస్థల కూటమి ఒక సమన్విత కార్యాచరణకు శ్రీకారం చుట్టింది.

ఇన్ఫోసిస్, టీసీఎస్, కాగ్నిజెంట్, టెక్ మహీంద్రా, ఎల్పీఎల్ ఫైనాన్షియల్ వంటి దిగ్గజ కంపెనీలు 2027 నాటికి తమ కార్యకలాపాలకు సంబంధించిన వాహనాల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించాలని అధికారికంగా ప్రతిజ్ఞ చేశాయి. సైబరాబాద్ మూవ్స్ (Cyberabad Moves) పేరిట రూపొందించిన ఈ వినూత్న కార్యక్రమాన్ని టి-హబ్‌లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ ప్రారంభించారు.

Hyderabad traffic congestion Hyderabad traffic news corporate mobility pledge Cyberabad Moves 2026 10 vehicle reduction Hyderabad IT companies Infosys TCS Cognizant carpooling Hyderabad employee commute vehicles corporate shuttle buses Hyderabad traffic solution 2026 10

ఉద్యోగులు వ్యక్తిగత కార్లు, క్యాబ్‌లపై ఆధారపడటాన్ని తగ్గించి.. భాగస్వామ్య, సుస్థిర ప్రజా రవాణా వైపు మళ్లించేందుకు షటిల్ బస్సుల విస్తరణ, కార్‌పూలింగ్ ప్రోత్సాహం, హైబ్రిడ్ పని విధానాల కొనసాగింపు వంటి బహుముఖ వ్యూహాలను సంస్థలు అమలు చేస్తున్నాయి.

ఈ చొరవలో భాగంగా పలు ఐటీ సంస్థలు చిన్న క్యాబ్‌ల స్థానంలో అధిక సామర్థ్యం గల పెద్ద వాహనాలను ప్రవేశపెట్టడంతో పాటు మెట్రో స్టేషన్లు, పబ్లిక్ బస్ స్టాప్‌ల వద్ద ప్రత్యేక రవాణా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఫస్ట్-మైల్ లాస్ట్-మైల్ కనెక్టివిటీ సమస్యలను పరిష్కరిస్తున్నాయి.

Also Read

కాగ్నిజెంట్ హైదరాబాద్ కేంద్రం అధిపతి రత్న శర్మ కొలచన మాట్లాడుతూ.. ఉద్యోగుల లాగిన్, లాగౌట్ సమయాలను వేర్వేరుగా కేటాయించడం, కార్‌పూలింగ్ వాహనాలకు రిజర్వ్డ్ పార్కింగ్ కల్పించడం వల్ల ప్రాంగణంలోకి వచ్చే వ్యక్తిగత వాహనాల సంఖ్య ఇప్పటికే తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం తమ సిబ్బందిలో 25 నుండి 30 శాతం మంది వ్యక్తిగత వాహనాల్లో వస్తున్నారని, షటిల్ సర్వీసుల ఫ్రీక్వెన్సీని పెంచడం ద్వారా దీనిని మరింత తగ్గిస్తామని వివరించారు.

అదేవిధంగా లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ తమ వాహన సముదాయంలో జీపీఎస్ ట్రాకింగ్‌ను అనుసంధానించి, మార్గాలను ఆప్టిమైజ్ చేయడం ద్వారా క్యాబ్ వినియోగాన్ని విజయవంతంగా తగ్గించినట్లు హెచ్‌ఆర్ లీడర్ తనుజ అబ్బూరి పేర్కొన్నారు.

మరోవైపు ఈ కార్పొరేట్ ప్రయత్నాలకు రాష్ట్ర ప్రభుత్వం, సైబరాబాద్ పోలీసులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సొసైటీ (SCSC) పూర్తి మద్దతు అందిస్తున్నాయి. ఒకే మార్గంలో ప్రయాణించే వివిధ కంపెనీల ఉద్యోగులు సులభంగా రైడ్‌లను పంచుకునేందుకు వీలుగా ఒక ప్రత్యేక కార్‌పూలింగ్ విధానం, మొబైల్ అప్లికేషన్ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని SCSC సభ్యులు వెల్లడించారు.

ఇలాంటి డిజిటల్ మౌలిక సదుపాయాల వేదిక కార్పొరేట్ మొబిలిటీ కార్యక్రమాల ప్రభావాన్ని గణనీయంగా పెంచి, ఐటీ కారిడార్‌లో రోజువారీ ట్రాఫిక్ జామ్‌లకు దీర్ఘకాలిక పరిష్కారం చూపుతుందని SCSC కౌన్సిల్ సభ్యుడు, ఎల్పీఎల్ ఫైనాన్షియల్ GCC ఎనేబుల్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ విభాగాధిపతి రాజేష్ బాలరాజు అభిప్రాయపడ్డారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+