హైదరాబాద్ నుండి విజయవాడకు వెళ్లాలంటే ప్రస్తుతం ట్రైన్‌లో కనీసం 5 నుండి 6 గంటల సమయం పడుతోంది. వందే భారత్ లాంటి ప్రీమియం రైళ్లు వచ్చాక ఈ సమయం 4 గంటలకు తగ్గింది. అయితే భవిష్యత్తులో ఈ దూరాన్ని కేవలం 3 గంటల్లోపే చేరుకునేలా దక్షిణ మధ్య రైల్వే (SCR) ఒక భారీ మాస్టర్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. విమాన ప్రయాణానికి గట్టి పోటీనిచ్చేలా రైల్వే ట్రాక్‌లను ఆధునీకరించే పనులు త్వరలోనే మొదలుకానున్నాయి.

ఏమిటి ఈ 'గోల్డెన్ డయాగ్నల్' అప్‌గ్రేడ్?
ప్రస్తుతం మన పట్టాలపై రైళ్లు గరిష్టంగా గంటకు 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాయి. కానీ, ఇప్పుడు 'గోల్డెన్ డయాగ్నల్' (Golden Diagonal) కారిడార్ లో భాగంగా ఈ వేగాన్ని 160 కిలో మీటర్లకు పెంచాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకమైన ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. ఈ ప్రాజెక్ట్ గనుక పట్టాలెక్కితే.. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సెమీ హైస్పీడ్ కారిడార్‌గా ఇది నిలుస్తుంది. ప్రస్తుతం ఢిల్లీ-ఆగ్రా వంటి రూట్లలో మాత్రమే ఇటువంటి హైస్పీడ్ ట్రాక్ లు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లైట్ జర్నీకి చెక్ పడుతుందా?
హైదరాబాద్ నుంచి విజయవాడకు(hyderabad to vijayawada) విమానంలో వెళ్లాలన్నా దాదాపు 3 గంటల సమయం పడుతుంది. ఎలాగంటే.. సిటీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లడానికి గంట, ఫ్లైట్ జర్నీ ఒక గంట, మళ్ళీ గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి విజయవాడ సిటీకి వెళ్లడానికి మరో 40 నిమిషాలు పడుతుంది. అదే రైలు వేగం గంటకు 160 కి.మీలకు పెరిగితే.. సిటీ సెంటర్ నుంచి సిటీ సెంటర్‌కు కేవలం 3 గంటల్లోపే చేరుకోవచ్చు. ఇది విమానం కంటే సౌకర్యవంతంగా అలాగే తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణంగా మారుతుంది.
ముఖ్యమైన రూట్లు ఇవే..
ఈ స్పీడ్ అప్‌గ్రేడ్ కోసం దక్షిణ మధ్య రైల్వే కొన్ని కీలకమైన మార్గాలను గుర్తించింది..
- సికింద్రాబాద్ - కాజీపేట
- కాజీపేట - విజయవాడ
- విజయవాడ - దువ్వాడ
- విజయవాడ - గూడూరు
ఈ మార్గాల్లో ఇప్పటికే వందే భారత్, దురంతో, రాజధాని వంటి ప్రీమియం రైళ్లు నడుస్తున్నాయి. ట్రాక్ లను బలోపేతం చేయడం, సిగ్నలింగ్ వ్యవస్థను మార్చడం ద్వారా ఈ స్పీడ్ ను అందుకోవాలని అధికారులు భావిస్తున్నారు.
ఎప్పటికల్లా పూర్తవుతుంది?
గతంలో రైళ్ల వేగాన్ని 110 కి.మీ నుండి 130 కి.మీకి పెంచడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. ఇప్పుడు 160 కి.మీ స్పీడ్ పనులకు అనుమతి లభించిన తర్వాత, సుమారు రెండేళ్ల వ్యవధిలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సుమారు 2,500 కిలోమీటర్ల మేర ట్రాక్‌లను ఆధునీకరించనున్నారు. అదే జరిగితే, హైదరాబాద్ టూ విజయవాడ (hyderabad to Vijayawada) ప్రయాణం సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది.
ఏదేమైనా.. రైల్వే శాఖ తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల వేలాది మంది నిత్య ప్రయాణికులకు సమయం ఆదా అవ్వడమే కాకుండా.. రవాణా రంగంలో ఒక విప్లవాత్మక మార్పు రానుంది.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

Train tickets: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్..ఇకపై వీరికి జీవితాంతం ఫ్రీ జర్నీ!

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అర్థ గంట ముందు బోర్డింగ్ పాయింట్ మార్చుకోవచ్చు.. కొత్త నిబంధనలు ఇవే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications