దేశంలో విమాన ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. గుజరాత్ అహమ్మదాబాద్ విమానాశ్రయంలో జరిగిన ప్రమాద ఘటన అందర్నీ కలిచివేసిన సంగతి విదితమే. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు సిబ్బంది అందరూ తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారు. ఒకే ఒక్కడు ప్రాణాతో బయటపడ్డాడు. ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానం టేకాఫ్ సమయంలోనే కుప్పకూలిపోయింది. తాజాగా మరో విమానం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది.
వివరాల్లోకెళితే..తిరుపతికి బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం ఆకాశమార్గంలో విద్యుత్ సమస్య తలెత్తి వెంటనే హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. గురువారం హైదరాబాద్ నుండి తిరుపతికి బయలుదేరిన స్పైస్‌జెట్ Q400 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఆకాశంలో విద్యుత్ సమస్యను ఎదుర్కొంది.దీంతో అప్రమత్తమైన పైలట్ దానిని దారి మళ్లించాడు. వెంనే హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి తీసుకువచ్చాడు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాద జరగలేదు. సురక్షితంగా ఉండటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

టేకాఫ్ తర్వాత సమస్య : ఈ ఘటనపై స్పైస్ జెట్ ప్రతినిధి మాట్లాడుతూ.. హైదరాబాద్ నుండి తిరుపతికి బయలుదేరిన స్పైస్‌జెట్ Q400 విమానం సురక్షితంగా రాజీవ్ గాంధీ విమానాశ్రయానంలో ల్యాండ్ అయిందన్నారు. ల్యాండ్ కాగానే ప్రయాణికులందరినీ సేఫ్ గా దించేసినట్లు తెలిపారు. తర్వాత ప్రయాణీకుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా, విమానంలో 80 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిని ఇతర విమానాల్లో తిరుపతికి పంపించేందుకు విమానయాన సంస్థకు చెందిన అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రం నుంచి బయల్దేరిన 10 నిమిషాలకే ఈ సమస్య తలెత్తింది.
స్పైస్‌జెట్ షేరు ధర : ఇదిలా ఉంటే ఈ వారాంతంలో క్యూ4 ఫలితాలు విడుదలైన తర్వాత స్పైస్‌జెట్ షేరు ధర 5 శాతం పెరిగింది . FY25 నాల్గవ త్రైమాసికంలో దాని Q4 స్వతంత్ర నికర లాభం దాదాపు మూడు రెట్లు పెరిగిందని స్పైస్‌జెట్ వెల్లడించింది. మార్చి 2025 త్రైమాసికంలో.. బడ్జెట్ క్యారియర్ రూ. 324.87 కోట్ల స్వతంత్ర నికర లాభాన్ని ఆర్జించింది. ఇది గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ 118.9 కోట్లు.. అంటే 174 శాతం ఎక్కువ. త్రైమాసికంలో కార్యకలాపాల నుండి వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 16% తగ్గి రూ.1,446.37 కోట్లకు చేరుకుందని స్పైస్‌జెట్ తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటన విషయం తెలియగానే స్పైస్‌జెట్ షేరు ధర పడిపోయింది. రూ.41.60 వద్ద 0.57 శాతం పతనంతో కొనసాగుతంది.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం : గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన ప్రమాదంగా ఈ విషాదకర ఘటన నిలిచింది. ఈ దుర్ఘటనలో విమాన ప్రయాణికుల్లో ఒక్కరు మినహా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ ఘోర ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఏఐ171 విమాన ప్రమాదంలో చనిపోయిన ఒక్కొక్కరి కథ దేశ ప్రజల గుండెను పిండేసింది.
మృతుల్లో 229 మంది ప్రయాణికులు కాగా.. 12 మంది సిబ్బంది ఉన్నారని పేర్కొంది. వారిలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, ఏడుగురు పోర్చగీస్ వాసులు, కెనడా దేశస్థుడు ఒకరు ఉన్నారని ప్రకటించింది. ఇక ఎయిర్ ఇండియా విమానం మెడికల్ కాలేజీ భవనంపై కూలిపోవడంతో 24 మంది మెడికోలు చనిపోయారు. దీంతో ప్రమాదంలో మొత్తం మృతుల సంఖ్య 265కు చేరింది.


Click it and Unblock the Notifications