IT News: ముదిరిపోయిన హైదరాబాద్ టెక్కీలు.. టాక్స్ అధికారుల నోటీసులు, మీరూ ఇలా చేశారా?

Hyderabad News: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది యువత ఐటీ రంగంలో ఉపాధి పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది లక్షల్లో వేతనాలు అందుకుంటున్నారు. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ వారు చేస్తున్న కొన్ని తప్పుడు పనులు ప్రస్తుతం ఆదాయపు పన్ను అధికారుల నుంచి సమస్యలను తెచ్చిపెడుతున్నాయి.

వివరాల్లోకి వెళితే హైదరాబాదుకు చెందిన చాలా మంది టెక్కీలు ఆదాయపు పన్ను అధికారులను బురిడీ కొట్టించి తప్పుడు మార్గాల ద్వారా పన్ను ప్రయోజనాలను అందుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. చాలా మంది టెక్కీలు పెద్దగా ప్రజాధరణ లేని పొలిటికల్ పార్టీకి డొనేషన్లు అందించటంతో పన్ను అధికారుల దృష్టి దీనిపై పడింది. దర్యాప్తు చేయగా టెక్ ఉద్యోగులు పన్ను ఆదా కోసం ఈ అక్రమ మార్గాన్ని వినియోగించుకుంటున్నట్లు తేలింది. పన్ను చట్టంలోని సెక్షన్ 80జీసీసీ కింద రాజకీయ పార్టీలకు అందించే నిధులు పన్ను రహితంగా ఉంటాయి. దీనిని హైదరాబాద్ టెక్కీలు దుర్వినియోగం చేసినట్లు పన్ను అధికారులు గుర్తించారు.

Hyderabad Techies involved in fake donations to Political parties unearthed by Income Tax Department

ఈ వ్యవహారంపై ఐటీ శాఖ చేపట్టిన దర్యాప్తులో రూ.110 కోట్ల రిఫండ్ స్కామ్ బయటకు వచ్చింది. దాదాపు 36 కంపెనీలకు చెందిన టెక్ ఉద్యోగులు సదరు రాజకీయ పార్టీకి డొనేషన్స్ అందించి వాటిని క్యాష్ రూపంలో తిరిగి వెనక్కి పొందినట్లు గుర్తించబడింది. ఈ క్రమంలో ఒక టెక్కీ తన వార్షిక వేతనం రూ.46 లక్షలు ఉండగా అందులో రూ.45 లక్షలు పొలిటికల్ పార్టీకి విరాళంగా అందించినట్లు పన్ను రిటర్న్స్ లో పేర్కొన్నాడు. కొన్ని సార్లు సదరు పొలిటికల్ పార్టీలు బ్యాంక్ ట్రాన్స్ఫర్, చెక్ రూపంలో పేమెంట్ పొంది తర్వాత వాటిని డబ్బు రూపంలో కమిషన్ తీసుకుని తిరిగి టెక్కీలకు చెల్లించాయి.

గతంలో పన్ను అధికారులు హెచ్ఆర్ఏ, హోమ్ లోన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ వడ్డీ క్లెయిమ్‌లలో మోసాలను గుర్తించారు. 2023లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో మోసపూరిత రీఫండ్ క్లెయిమ్‌లలో నిమగ్నమైన ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని కఠిన చర్యలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు పన్ను భారం నుంచి తప్పించుకునేందుకు ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు చేస్తున్న మోసాలను కనిపెట్టే పనిలో పన్ను అధికారులు ఉన్నారు. మోసపూరిత రిటర్న్‌లను దాఖలు చేసే ఐటీ ఉద్యోగులు ఉపయోగించే కామన్ ఇమెయిల్ చిరునామాను ట్రాక్ చేసినప్పుడు ప్రస్తుత మోసం వెలుగులోకి వచ్చింది.

పన్ను అధికారులు గుజరాత్, తెలంగాతలో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన కొన్ని అనామక పొలిటికల్ పార్టీలు ఈ స్కామ్ కింద టెక్కీల నుంచి నిధులను అందుకున్నట్లు దర్యాప్తులో పన్ను అధికారులు గుర్తించారు. ఈ విరాళాలతో ముడిపడి ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు లేదా భారత ఎన్నికల సంఘానికి తమ సహకార నివేదికలను సమర్పించలేదని గుర్తించబడింది.

2021-22 నుంచి 2023-24 ఆర్థిక సంవత్సరాలకు చెందిన పన్ను రిటర్న్‌లను పరిశీలించి, తప్పుడు క్లెయిమ్‌లను ఉపసంహరించుకోవాలని పన్ను చెల్లింపుదారులకు సూచించాలని ఐటీ శాఖ యోచిస్తోంది. దీనికి సంబంధించి నోటీసులు కూడా అందించనున్నట్లు వెల్లడైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+