హైదరాబాద్ టెక్కీ స్టోరీ వైరల్.. కంపెనీలు ఇలా కూడా చేస్తున్నాయా, జాగ్రత్త బ్రోస్..

Hyderabad Techie: టెక్ కంపెనీలు రోజురోజుకూ చాలా కఠినంగా వ్యవహరించటంతో పాటు లాయల్టీ అనే పదాన్ని మరచిపోతున్నాయి. భారతీయ పని సంస్కృతిని నేటి కాలంలో అనేక కంపెనీలు పక్కనపెడుతూ, ఆ విలువలకు చెల్లుచీటీ చెబుతున్నాయి. ఈ క్రమంలోనే హైదారాబాదుకు చెందిన ఒక టెక్కీ ఇటీవల తనకు జరిగిన ఒక చేదు అనుభవం గురించి పంచుకోవటం తెగ వైరల్ అవుతోంది.

హైదరాబాదుకు చెందిన ఒక మహిళా టెక్కీ తన కంపెనీతో ఎదురైన అనుభవం గురించి గ్రేప్ వైన్ ఫ్లాట్‍ఫారమ్‍లో పంచుకుంది. గడచిన ఏడాది కాలంలో పనితో బిజిబిజీగా గడిపిన టెక్కీ కాస్త బ్రేక్ తీసుకుందాం అని ఈశాన్య భారతానికి ట్రిప్పుకు వెళ్లారు. హైదరాబాద్ కంపెనీలో సొల్యూషన్స్ కన్సల్టెంట్ స్థాయిలో ఉన్న ఉద్యోగి ప్రాజెక్టుల్లో డెడ్ లైన్స్ పూర్తి చేసుకుని కంపెనీ ఇచ్చిన ఛాలెంజ్ లను పనిలో పూర్తి చేసుకుని విశ్రాంతి కోసం టూర్ వేసినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అనుకోకుండా కంపెనీ నుంచి అందిన ఒక ఈమెయిల్ ఆమె గుండెలను పిండేసింది. సదరు మెయిల్ సబ్జక్ట్ లైన్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ అని రాసి ఉంది. ఓపెన్ చేసి చూడగానే ఒశ్చర్యం, ఒళ్లంతా చల్లబడిపోయింది. కంపెనీ ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎలాంటి డిస్కషన్ కూడా లేకుండానే తనను పనిలోనుంచి తొలగించినట్లు మెయిల్ సారాంశాన్ని చూసింది. ఇకపై కంపెనీలో తాను ఉద్యోగి కాదని ఆమెకు క్లారిటీ వచ్చేసింది.

Hyderabad Techie suddenly fired from job revealed facts in post going viral

దీంతో సదరు టెక్కీ తన రిపోర్టింగ్ మేనేజరుకు కాల్ చేసింది. అసలు హఠాత్తుగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం ఏమిటి, ఎందుకిలా జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు పేర్కొంది. చాలా సేపు మాట్లాడిన తర్వాత ఇటీవల జరిగిన క్లయింట్ మీటింగ్ లో ఏదో పొరపాటు జరిగినట్లు వారు ఆమెకు వెల్లడించారు. అయితే వాస్తవానికి కంపెనీకి చెందిన కీలక క్లయింట్ కి ఇవ్వాల్సిన సాఫ్ట్ వేర్ డెమోలో చివరి నిమిషంలో ఏర్పడిన టెక్నికల్ సమస్యల కారణంగా.. కొన్ని దశలను ఆమె స్కిప్ చేయాల్సి వచ్చింది. అయితే అది తాను కావాలని చేసింది కాదని, కంపెనీ ఉత్పత్తిని తప్పుగా ప్రెజెంట్ చేయలేదని తెలిపింది.

Hyderabad Techie suddenly fired from job revealed facts in post going viral

అయితే ఆమె ఎందుకిలా చేసిందో మేనేజర్ అర్థం చేసుకున్నప్పటికీ.. ఉన్నతస్థాయి కంపెనీ ప్రతినిధులు తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నాడు. దీంతో ఆశ్చర్యానికి గురైన సదరు టెక్కీ భారతీయ సంస్కృతిలో ఉద్యోగులను కంపెనీలు ఫ్యామిలీగా చూస్తాయని, కానీ తన విషయంలో కంపెనీ ప్రవర్తించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసినట్లు పేర్కొంది. ఈ క్రమంలో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తనకు అర్థం కావటం లేదని ఆమె పేర్కొంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+