కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నుండి ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ పడిపోయిన విషయం తెలిసిందే. అన్-లాక్ తర్వాత కార్యకలాపాలు క్రమంగా వేగవంతం అవుతోన్న విషయం తెలిసిందే. మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ రియాల్టీ, ఆఫీస్ స్పేస్ మెరుగ్గా ఉంది. ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలను భాగ్యనగరం మించింది. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో హైదరాబాద్ నెట్ ఆఫీస్ స్పేస్ లీజ్ రికార్డ్‌స్థాయిలో 1.54 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా ఉంది. అంతకుముందు త్రైమాసికంలో 1.18 మిలియన్ స్క్వేర్ ఫీట్లుగా ఉంది. ఈ మేరకు జేఎల్ఎల్ (జోన్స్ లాంగ్ లాసెల్) డేటా వెల్లడిస్తోంది.

గాడిన హైదరాబాద్ రియాల్టీ
ఇప్పుడిప్పుడే హైదరాబాద్ రియల్టీ మార్కెట్ గాడిన పడుతోంది. నివాస గృహాల కంటే కార్యాలయాల భవనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అంతకు ముందు త్రైమాసికంతో పోలిస్తే సెప్టెంబర్ క్వార్టర్‌లో 31 శాతం ఎక్కువ. ఆఫీస్ స్పేస్ లీజులో బెంగళూరు (504 శాతం) తర్వాత హైదరాబాద్ రెండోస్థానంలో ఉంది. మెట్రోల్లో టాప్ 2 నగరాలుగా రెండు దక్షిణాదివే ఉండటం గమనార్హం. కొత్త ప్రాజెక్టుల్లో హైదరాబాద్ 40 శాతం వృద్ధితో 2.38 మిలియన్ స్క్వేర్ ఫీట్స్ నుండి 3.33 మిలియన్ స్క్వేర్ ఫీట్స్‌గా ఉంది.

ముందస్తు బుకింగ్స్
నగరంలో ఎక్కువ శాతం ముందే జరిగిన ఒప్పందాలు ఉన్నాయి. ఇది మార్కెట్‌కు కలిసి వచ్చింది. ముందస్తు బుకింగ్స్ లేకుంటే సెప్టెంబర్ త్రైమాసికంలోను ఆఫీస్ స్పేస్ మార్కెట్‌కు నిరాశ ఎదురయ్యే పరిస్థితి ఉండి ఉండేదని భావిస్తున్నారు. ముందస్తు కమిట్‌మెంట్స్ వృద్ధికి సహకరించాయని జేఎల్ఎల్ ఇండియా (హైదరాబాద్) మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్ అన్నారు.

సైబరాబాద్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్ ఖాళీ!
ఆఫీస్ స్పేస్ లీజ్ పెరుగుతున్నప్పటికీ, వెకెన్సీలు కూడా పెరిగాయి. రెండో త్రైమాసికంలో 9.2 శాతంగా ఉన్న వెకెన్సీ లెవల్స్ సెప్టెంబర్ క్వార్టర్ నాటికి 11.3 శాతానికి పెరిగింది. బంజారాహిల్స్, సోమాజిగూడ, బేగంపేట బెల్ట్‌లో, హైటెక్ సిటీ ప్రాంతంలో, గచ్చిబౌలిలో వెకెన్సీలు పెరిగాయి. ఇక్కడి నుండి చిన్న వ్యాపారాలు, చిన్న ఐటీ కంపెనీలు వెళ్లిపోయాయి. క్యూ3లో దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ డిమాండ్ 64 శాతం పెరిగింది. ఆఫీస్ స్పేస్ లీజుల్లో ఐటీ, ఐటీ సేవల కంపెనీల వాటా క్రమంగా తగ్గుతోంది. ఈ-కామర్స్, ఉత్పత్తి కంపెనీల వాటా పెరుగుతోంది.
More From GoodReturns

IT Jobs: ఐటీ కొలువుల్లో AI కలకలం.. ఇక ఫ్రెషర్లకు ఉద్యోగాలు దొరకడం కష్టమేనా?

అమెరికాలో ఛాయ్ వాలాగా మారిన భారత ఐటీ ఉద్యోగి.. రోజూ వారి సంపాదన చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

రూ. 6 వేల కోట్లకు చేరిన సుందర్ పిచాయ్ జీతం..గూగుల్ తాజాగా వేతన ప్యాకేజీ ఎంత పెంచిందంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..



Click it and Unblock the Notifications