నైట్ లైఫ్ అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా స్టూడెంట్స్, IT ఉద్యోగులు ఉదయం నుంచి పని చేసిన తర్వాత, రాత్రి స్నేహితులతో సిటీలో తిరగడం ఇష్టపడతారు. కానీ భద్రతా సమస్యలు, రాత్రి రవాణా సమస్యల కారణంగా చాలామంది బయటికి రాలేకపోతారు. ఇప్పుడు హైదరాబాద్ ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకొచ్చింది. రాత్రి 2 వరకు మేట్రో, బస్సులు, ప్రత్యేక నైట్‌జోన్లు మరియు స్మార్ట్ పోలీసింగ్ తో నగరాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా నైట్ లైఫ్ అనుభవించెలాగా మారుస్తోంది. ఇది యువత, వ్యాపార రంగం, పర్యాటకులు అందరికీ కొత్త అవకాశాలను తెస్తుంది.

తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్‌ను రాత్రి సమయాల్లో కూడా ఉల్లాసభరిత నగరంగా మార్చాలని ప్రణాళికలు చేస్తున్నారు. వచ్చే 7 సంవత్సరాల్లో మేట్రో మరియు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) సర్వీసులు రాత్రి 2 వరకు అమలులో ఉంటాయి. నగరంలోని ప్రత్యేక నైట్‌జోన్‌లు సృష్టించి, వాటికి తగట్టు పాలన మరియు పోలీసింగ్ విధానాలు ఉండనున్నాయి. మహిళల భద్రతను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుని, సురక్షితమైన నైట్ లైఫ్ అందించేలా ప్రభుత్వం హామీ ఇస్తుంది.
ప్రస్తుతం హైదరాబాద్ యొక్క నైట్ టైమ్ ఎకనమీ 2025లో సుమారు రూ. 8,500 కోట్లుగా అంచనా వేయబడుతోంది. వచ్చే 7 సంవత్సరాల్లో, సరైన ప్రోత్సాహం మరియు అభివృద్ధి ద్వారా ఈ సంఖ్య రూ. 26,011 కోట్లు వరకు పెరుగుతుందని ప్రణాళిక. అంటే, నైట్ టైమ్ ఎకనమీలో సంవత్సరానికి సగటున 20.4% వృద్ధి సాధించబడుతుంది.
నైట్ టైమ్ ఎకనమీ అభివృద్ధి చెందితే 2031 నాటికి 2.1-2.4 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనా. హాస్పిటాలిటీ, రిటైల్, వినోదం, రవాణా, సెక్యూరిటీ మరియు నగర వసతుల రంగాలు ముఖ్యంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తాయి. NTE అంటే సాయంత్రం 6 నుంచి రాత్రి 6 వరకు జరిగే వ్యాపారాలు, కార్యకలాపాలు. ఇందులో సేవా రంగం కీలకంగా ఉంటుంది, మహిళల భద్రత ప్రత్యేకంగా పని చేస్తుంది.
గత ఐదు సంవత్సరాల్లో ముంబైలో నైట్ టైమ్ ఎకనమీ సుమారు 22% పెరిగింది. దీని ఫలితంగా 7 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఇదే విధంగా, హైదరాబాద్ కూడా నైట్ టైమ్ ఎకనమీ అభివృద్ధిపై దృష్టి పెట్టింది.
ప్రస్తుతానికి, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర GSDP లో సుమారు 45-50% వాటాను కలిగి ఉంది. నైట్ టైమ్ ఎకనమీ సక్రమంగా అభివృద్ధి చెందితే, 2031 నాటికి NTE తెలంగాణ GSDP కి సుమారు 2.9-3.1% వరకు సహకారం అందిస్తుంది. అంటే రాత్రి సమయంలో జరిగే వ్యాపారాలు, హాస్పిటాలిటీ, రీటైల్, ట్రాన్స్పోర్ట్, వినోద రంగాల ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్తగా సుమారు 3% వృద్ధి వస్తుంది.
దీని ద్వారా రాత్రి వ్యాపారాలు, సేవలు పెరుగుతూ, ఉద్యోగ అవకాశాలు కూడా కొత్తగా సృష్టించబడతాయి. మహిళలు సురక్షితంగా నైట్ టైమ్ అనుభవించగలుగుతారు, నగరంలో రాత్రి రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయి. అందువల్ల, హైదరాబాద్ NTE అభివృద్ధి రాష్ట్రానికి, యువతకు, పర్యాటకులకు మరియు వ్యాపార రంగానికి అన్ని విధాలా లాభదాయకంగా మారుతుంది. జాయేష్ రంజాన్, ముఖ్య కార్యదర్శి మట్లాడుతు, "నైట్ టైం ఎకానమీ హైదరాబాద్‌ను లండన్, న్యూ యార్క్, బెర్లిన్ లాంటి గ్లోబల్ నగరాలతో సమానం చేసే లక్ష్యంతో రూపొందించబడింది. రాత్రి ప్రత్యేక పాలన మరియు స్మార్ట్ రెగ్యులేషన్ NTE అభివృద్ధికి కీలకం" అని చెప్పారు.
ప్రస్తుతం గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్, మాదాపూర్, ట్యాంక్ బండ్, చార్మినార్ ప్రాంతాలు నైట్ జోన్‌లుగా గుర్తించబడ్డాయి. రాత్రి భద్రతా ఏర్పాట్లు సరిగ్గా అమలు అయన తర్వాత, ప్రత్యేక రాత్రి ఆపరేషన్ అనుమతులు అవసరం ఉండదు అని ప్లానర్లు సూచిస్తున్నారు.
రాత్రి సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి హైదరాబాద్ మేట్రో మరియు TSRTC రాత్రి 2 వరకు సేవలు అందిస్తాయి. అలాగే, ఉబెర్, ఓలా వంటి రైడ్-హెయిలింగ్ సర్వీసులతో భాగస్వామ్యం ద్వారా ప్రత్యేక జియో ట్యాగ్ పికప్ మరియు డ్రాప్ పాయింట్లు ఏర్పాటు చేయబడతాయి.
ప్రారంభంలో, మొదటి 3 నెలలు చార్మినార్, గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాల్లో 'నాన్ ఆల్కహాలిక్ పైలెట్' ఆరంభం అవుతుంది. తర్వాతి 3 నెలల్లో జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో అల్కహాల్ సేవలతో NTE విస్తరిస్తారు. చివరి 6 నెలల్లో వారంలో అన్ని రోజులకూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి త్వరలో నైట్ టైం ఎకానమీ ప్రారంభం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు.
More From GoodReturns

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క ఏరియాలోనే ఇల్లు కావాలంటున్న కొనుగోలుదారులు..

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications