Hyderabad News: స్టాక్ మార్కెట్ పెట్టుబడుల్లో దూసుకుపోతున్న హైదరాబాదీలు.. పూర్తి వివారాలు
Stock Market: దేశీయంగా స్టాక్ మార్కెట్లలో కొన్ని ఏళ్లుగా రిటైల్ ఇన్వెస్టర్ల హవా పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో చాలా మంది తమ పెట్టుబడి అవసరాలకు వివిధ సాధనాలతో పాటు ఈక్విటీలను సైతం ఉత్తమంగా పరిగణిస్తున్నట్లు తాజా ఎన్ఎస్ఈ, బీఎస్ఈ డేటా ప్రకారం వెల్లడైంది. ఈ క్రమంలో హైదరాబాదీలకు సంబంధించి ఆసక్తికర సమాచారం బయటపడింది.
తాజా డేటా ప్రకారం మహారాష్ట్ర, యూపీ, గుజరాత్, వంటి రాష్ట్రాలతో కూడిన ముంబై, అహ్మదాబాద్ వంటి సాంప్రదాయ హాట్‌స్పాట్‌లు ఇప్పటికీ అత్యధిక పెట్టుబడిదారులను కలిగి ఉన్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్, జైపూర్, రాజ్‌కోట్, పూణే నగరాలు స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంఖ్యలో మంచి వృద్ధిని నివేదించాయి.

లడఖ్ 370.57 శాతం, మిజోరం 81.10 శాతం, అరుణాచల్ ప్రదేశ్ 62.19 శాతం, లక్షద్వీప్ 61.78 శాతం, త్రిపుర 56.10 శాతం, జమ్మూ & కాశ్మీర్ 53.79 శాతం, నాగాలాండ్ 52.95 శాతం ఇన్వెస్టర్ల పెరుగుదలను చూశాయని బీఎస్ఈ వెల్లడించింది. ఇక కేంద్రపాలిత ప్రాంతాలను పరిశీలిస్తే.. అండమాన్ & నికోబార్ 49.51 శాతం, బిహార్ 49.41 శాతం కొత్త పెట్టుబడిదాలును నమోదు చేశాయి. ప్రస్తుత క్యాలెండర్ ఇయర్‌లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న మార్కెట్‌లలో భారతీయ స్టాక్ మార్కెట్‌లు ఉండటంతో ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది.
ఇన్వెస్టర్ల గణాంకాలను రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే.. మహారాష్ట్ర ఇప్పటికీ దాదాపు 3.35 కోట్ల మంది పెట్టుబడిదారులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. దీని తర్వాత ఉత్తర ప్రదేశ్ 1.97 కోట్లు, గుజరాత్ 1.68 కోట్లు, రాజస్థాన్ 1.08 కోట్లు, పశ్చిమ బెంగాల్ 1.01 కోట్లు మంది పెట్టుబడిదారులను కలిగి ఉన్నాయి. దేశంలో కోటి మందికి పైగా నమోదిత పెట్టుబడిదారులను కలిగి ఉన్న ఐదు రాష్ట్రాలు కూడా ఇవే కావటం గమనార్హం. రాష్ట్రాల పరంగా ఉత్తరప్రదేశ్ మే నెలలో 2.6 లక్షల కొత్త రిజిస్ట్రేషన్లతో ముందంజలో కొనసాగింది, నెలవారీగా 15.5 శాతం పెరుగుదల నమోదు చేసింది.


Click it and Unblock the Notifications