హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Hyderabad real estate) మార్కెట్ మరోసారి వార్తల్లో నిలిచింది. 2026 మొదటి త్రైమాసికంలో (Q1 2026) దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో ఇళ్ల అమ్మకాలు మందగించినప్పటికీ, మన భాగ్యనగరంలో మాత్రం డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. నైట్ ఫ్రాంక్ ఇండియా (Knight Frank India) తాజా నివేదిక ప్రకారం, హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు ఏడాది కాలంలో 9 శాతం మేర పెరిగాయి. ప్రస్తుతం ఇక్కడ సగటున చదరపు అడుగు ధర రూ. 8,211 కు చేరుకుంది.

అమ్మకాల్లో దూసుకుపోతున్న భాగ్యనగరం
గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే, ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు హైదరాబాద్‌లో 9,541 ఇళ్లు అమ్ముడయ్యాయి. ఇది కేవలం 1 శాతం పెరుగుదల అయినప్పటికీ, ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో అమ్మకాలు పడిపోయిన తరుణంలో హైదరాబాద్ ఈ స్థాయిని నిలబెట్టుకోవడం విశేషం. గ్లోబల్ మార్కెట్‌లో అనిశ్చితి, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు వంటి కారణాల వల్ల దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత ఒడిదుడుకులకు లోనవుతున్నా, హైదరాబాద్‌లో మాత్రం ఎండ్-యూజర్ డిమాండ్ బలంగా ఉంది.
లగ్జరీ ఇళ్లకే మొగ్గు.. మధ్యతరగతికి కష్టమేనా?
ఈ నివేదికలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ ప్రజలు రూ.1 కోటి నుంచి రూ.2 కోట్ల మధ్య ఉండే ఇళ్లపైనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం అమ్మకాల్లో ఈ విభాగం వాటా ఏకంగా 43 శాతం (4,061 యూనిట్లు) ఉండటం గమనార్హం.
- రూ. 50 లక్షల నుంచి రూ. 1 కోటి: 2,467 ఇళ్లు అమ్ముడయ్యాయి.
- రూ. 2 కోట్ల నుంచి రూ. 5 కోట్లు: 2,192 యూనిట్లు అమ్ముడై ప్రీమియం సెగ్మెంట్ బలాన్ని చాటాయి.
- రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లు: ఈ ఖరీదైన ఇళ్ల అమ్మకాల్లో కూడా భారీ వృద్ధి కనిపించింది.
దీన్ని బట్టి చూస్తుంటే, ఒకప్పుడు తక్కువ ధరలో దొరికే 'అఫోర్డబుల్ హౌసింగ్' (Affordable Housing) స్థానాన్ని ఇప్పుడు లగ్జరీ , ప్రీమియం ఇళ్లు ఆక్రమిస్తున్నాయి.
దేశవ్యాప్త పరిస్థితి ఎలా ఉంది?
హైదరాబాద్, బెంగళూరు మినహా దేశంలోని టాప్ 8 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు సగటున 4 శాతం తగ్గాయి. ముఖ్యంగా ముంబైలో 7 శాతం, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 11 శాతం, పూణేలో 11 శాతం చొప్పున అమ్మకాలు పడిపోయాయి. అయితే, దేశవ్యాప్తంగా కూడా రూ. 20 కోట్ల నుంచి రూ. 50 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన ఇళ్ల అమ్మకాలు ఏకంగా 80 శాతం పెరగడం గమనార్హం. అంటే సంపన్నులు రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారని అర్థమవుతోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ జోసెఫ్ తిలక్ అభిప్రాయం ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) లో స్థిరమైన డిమాండ్ ఉండటమే కాకుండా, కొనుగోలుదారులు ప్రీమియం జీవనశైలికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందుకే కొత్త ప్రాజెక్టులు కూడా ఎక్కువగా లగ్జరీ విభాగంలోనే లాంచ్ అవుతున్నాయి. ఈ త్రైమాసికంలో నగరంలో దాదాపు 9,975 కొత్త ఇళ్లు మార్కెట్లోకి వచ్చాయి. ఇళ్ల ధరలు పెరుగుతున్నా, సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వారు వెనకడుగు వేయడం లేదు.
More From GoodReturns

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్‌లో పెరిగిన డిమాండ్!

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

బెంగళూరు అద్దెలు షాకింగ్: సామాన్యుల పరిస్థితి ఏంటి?

అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా?

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

బెంగళూరు సబర్బన్ రైలు ఆగిందా? ఐటీ ఉద్యోగులకు షాకింగ్ వార్త



Click it and Unblock the Notifications