మధ్యతరగతి జీవుల కలలు మింగేస్తున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బూమ్..ఏంటి నమ్మలేకున్నారా.. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. హైదరాబాద్ నగరం ఒకప్పుడు సామాన్యులకు, పేదవారికి, మధ్య తరగతి బతుకులకు గమ్య స్థానంగా ఉండేది. హైదరాబాద్ లో బతకడానికి ఎక్కువ డబ్బులు అవసరం లేదు అని గ్రామాల్లో చాలామంది అనుకుని రైలు ఎక్కారంటే హైదరాబాద్ సామాన్యులకు కేరాఫ్ అడ్రస్ గా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే ఇప్పుడు హైదరాబాద్ మారిపోయింది. సామాన్యులకు అందనంత దూరంలో రియల్ ఎస్టేట్ వెళ్లిపోయింది. ఒకప్పుడు సౌకర్యవంతమైన గృహాలకు గమ్యస్థానంగా ఉన్న నగరం నేడు కార్పోరేట్ నీడలో సేద తీరుతోంది. ఇప్పుడు యువత, మధ్యతరగతి జీతాల ఉద్యోగులకు హైదరాబాద్ లో సొంతిళ్లు అనేది కలగానే మిగిలిపోతోంది. వారి కలలు నెరవేరడం అసాధ్యంగా మారుతోంది. దీనికి ప్రధాన కారణం గత 5 ఏళ్లలో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పీక్ స్టేజ్ కు వెళ్లిపోయింది.నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్నంటాయి.

కేవలం 5 ఏళ్లలోనే రియల్ బూమ్ సామాన్యులకు అందనంత దూరంలోకి వెళ్లిపోయింది. రుగుతున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట్, నియోపోలిస్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల్లో ఆస్తి ధరలు ఆకాశాన్నంటాయి. ఇక్కడ గృహావసరాల విషయంలో సామాన్య కుటుంబాలకు దాదాపుగా ఇళ్లు అందకుండా పోయాయి. మధ్య తరగతి జీవులు ఇప్పుడు నగరంలో ఇల్లు కొనాలంటే తలకు మించిన భారంలా మారింది.
2019లో గచ్చిబౌలిలో చదరపు అడుగుకు రూ. 5,000కే ఫ్లాట్లు అందుబాటులో ఉండేవి. కారి ఇప్పుడు ఆ పరిస్థితి కనపడటం లేదు. ప్రస్తుతం అదే ప్రాంతంలో ధరలు రూ. 14,000 నుండి రూ. 18,000 వరకు పెరిగాయి. నియోపోలిస్‌లో అయితే లగ్జరీ ప్రాజెక్టులు చదరపు అడుగుకు రూ. 20,000ను తాకుతున్నాయి. ఇది ప్రారంభ స్థాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తీవ్ర ఆర్ధిక ఒత్తిడిగా మారుతోంది. వారు ఇల్లు అంటేనే భయపడే పరిస్థితికి వస్తున్నారు.
నగరంలో పనిచేసే ఎంట్రీ లెవల్ ఉద్యోగులు..నెలకు రూ. 40,000-60,000 వేతనమున్న వారు గచ్చిబౌలి, హైటెక్ సిటీ వంటి ప్రాధాన్య ప్రాంతాల్లో ఇల్లు కొనాలంటే తలకు మించిన భారం అవుతోంది. మిగతా ఖర్చులను పక్కన బెట్టి కేవలం ఇంటికే తమ జీతమంతా పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. వారి జీతం కన్నా శక్తికి మించిన ధరలతో వీరంతా మియాపూర్, నిజాంపేట్, కొండాపూర్ వంటి ప్రాంతాల వైపు చూస్తున్నారు. అది కూడా అక్కడ పాత ఫ్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోనూ పాత 2BHK ఫ్లాట్లు రూ. 1.5 కోట్ల నుండి రూ. 2 కోట్ల వరకూ పలుకుతోంది.
హైదరాబాద్ నగరంలో ఈ ధరల పెరుగుదలకు అనేక కారణాలను చెప్పుకోవచ్చు. ఒకటి భూముల కొరత వెంటాడుతోంది. ఇక రెండవది అందరూ ప్రీమియం హౌసింగ్ పై దృష్టి పెడుతున్నారు. మూడవది ఐటీ హబ్ సమీపంలో సరసమైన హౌసింగ్ అందుబాటులో లేకపోవడం వల్ల సామాన్యులకు ఇల్లు అనేది గగనం అవుతోంది. బ్యాంక్ లోన్లపై పెరుగుతున్న వడ్డీ రేట్లు వారికి భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య నగరంలో చాలామంది ఇంటిని కొనాలనే లక్ష్యాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. చాలా మంది సిటికీ దూరంగా ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఇక ఊరట కలిగించే అంశం ఏంటంటే.. బాచుపల్లి, కొంపల్లి, షాద్‌నగర్ వంటి మార్జినల్ ప్రాంతాలు కొంతవరకు సామాన్యులకు గృహ కలలను నిజం చేస్తున్నాయి. ప్రభుత్వ మద్దతుతో మెరుగైన ప్రణాళికలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతాలన్నీ భవిష్యత్తులో స్మార్ట్ మిడిల్ క్లాస్ నివాస గమ్యస్థలాలుగా మారే అవకాశం అయితే ఉంది. ఏదేమైనా హైదరాబాద్ నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నప్పటికీ సామాన్యులకు ఇల్లు విషయంలో మాత్రం వెనకబడిపోతోంది. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
More From GoodReturns

ప్రాప్షేర్ సెలెస్టియా REIT ఐపీఓ: నేడే చివరి అవకాశం!

Hyderabad: హైదరాబాద్లో డ్రైవర్ లేని పాడ్ టాక్సీలు! ఆ ఏరియా వాళ్లకు పండగే!

హైదరాబాద్ ఎండలు, కరెంట్ కోతలు.. రియల్ ఎస్టేట్లో పెరిగిన డిమాండ్!

Hyderabad: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ జోరు! అలాంటి ఇళ్లకే ఫుల్ డిమాండ్!

హైదరాబాద్ నీటి కష్టాలు: ఐటీ కారిడార్లో అద్దెలు ఆకాశానికి!

Bengaluru: ఇన్వెస్టర్లకు పండగే: బెంగళూరులోని ఈ ప్రాంతాల్లో ఆస్తుల విలువ భారీగా జంప్!

బెంగళూరు అద్దెలు షాకింగ్: సామాన్యుల పరిస్థితి ఏంటి?

అమరావతి రియల్ ఎస్టేట్: ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయా?

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications