Hyderabad: దేశంలోని రియల్టీ రంగంలో హైదరాబాద్ కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లకు బెస్డ్ రియల్టీ డెస్టినేషన్ గా మారింది. ఈ క్రమంలో నివాస మార్కెట్లో కొత్త ప్రాంతాలను సైతం పెంచుతోంది.

ఫిబ్రవరి మాసంలో..
2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ రియల్టీ సేల్స్ సూపర్ గా ఉన్నాయి. నగరంలో మెుత్తం 5,274 యూనిట్ల రెసిడెన్షియల్ ప్రాపర్టీల విక్రయాలు నమోదయ్యాయి. ఈ నెలలో నమోదైన మెుత్తం ఆస్తుల విలువ రూ.2,816 కోట్లుగా ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.

నాలుగు జిల్లాలు..
హైదరాబాద్ నివాస మార్కెట్‌లో మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి అనే నాలుగు జిల్లాలు ఉన్నాయి. రిజిస్టేషన్ డేటా ప్రకారం ఎక్కువ మంది రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ఉన్న ధరల శ్రేణిలో రెసిడెన్షియల్ యూనిట్ల విక్రయాలు జరిగినట్లు తేలింది. రూ.25 లక్షల కంటే తక్కువ టిక్కెట్ పరిమాణంలో డిమాండ్ వాటా ఫిబ్రవరి 2023లో గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇన్‌లైన్‌లో 18%గా ఉంది.

కోటి ఖరీదైన నివాసాలు..
మహానగరంగా ఎదిగిన హైదరాబాద్ ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేసే వారి సంఖ్య ఇటీవలి కాలంలో భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో కోటి రూపాయల కంటే ఎక్కువ విలువైన ఆస్తిని కొనుగోలు చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నారు. 2023 ఫిబ్రవరిలో 10%కి పెరగడంతో పెద్ద టిక్కెట్ సైజు ఇళ్లకు ఎక్కువ డిమాండ్ స్పష్టంగా ఉంది. 500-1000 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్న ఆస్తులలో రిజిస్ట్రేషన్ల వాటా 18%కి పెరిగింది. అలాగే 1,000-2,000 చదరపు అడుగుల పరిమాణంలో ప్రాపర్టీల విక్రయాలు 68%గా ఫిబ్రవరి 2023లో నమోదయ్యాయి.

నైట్ ఫ్రాంక్ ఇండియా..
హైదరాబాద్ రెసిడెన్షియల్ మార్కెట్ వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ విభిన్నమైన వర్క్‌ఫోర్స్, మారుతున్న సామాజిక-ఆర్థిక వాతావరణం దీనికి కారణంగా ఉన్నాయని నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ బ్రాంచ్ డైరెక్టర్ శాంసన్ ఆర్థర్ తెలిపారు. 25-50 లక్షల రూపాయల కేటగిరీలో రిజిస్ట్రేషన్లు మునుపటి సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్నాయని వెల్లడైంది. ఫిబ్రవరి 2023లో సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 9% పెరుగుదలను నమోదు చేసింది. హైదరాబాద్ మార్కెట్‌లో ధర పెరుగుదల ఇటీవలి కాలంలో బలంగా ఉండగా.. ఫిబ్రవరి 2023లో అధిక విలువ కలిగిన ప్రాపర్టీల విక్రయాలు జరిగాయి.


Click it and Unblock the Notifications