హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. కోకాపేట రియల్ భూమ్ ఖేల్ ఖతం..ఈ ఏరియాల పైనే రియల్టర్ల కన్ను..

Hyderabad Real Estate: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి.. గతంలో రికార్డు స్థాయి అమ్మకాలు జరిగిన కోకాపేట ప్రాంతం ఇప్పుడు బేలచూపులు చూస్తోంది. పశ్చిమ కారిడార్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాంతంగా పేరుగాంచిన కోకాపేట్ భూముల వేలంలో శుక్రవారం నమోదైన మందకొడి స్పందనపై హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిశ్రమ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

హెచ్‌ఎండిఏ (HMDA) నిర్వహించిన ఈ వేలం ఫలితాలు తమను పూర్తిగా సమ్మశక్యంగా లేవని పేర్కొన్న పరిశ్రమ నిపుణులు, ముఖ్యంగా కోకాపేట్ మార్కెట్‌లో నెలకొన్న నిరాశావాదం భావనే కొనుగోలుదారుల వెనుకడుగుకు ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. గత వేలం పాటల ప్రభావంతో ఈ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకడంతో పాటు ఇప్పటికే భారీ స్థాయిలో నిర్మాణాలు చేపడుతుండటంతో.. మార్కెట్ మళ్లీ పూర్తిస్థాయిలో పుంజుకుని కొత్త పెట్టుబడిదారులను ఆకర్షించడానికి మరికొంత సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

Kokapet land market Kokapet real estate market 2026 Hyderabad property market Neopolis land auction HMDA land auction Kokapet property prices Hyderabad luxury housing inventory unsold luxury flats Hyderabad Hyderabad real estate slowdown Miyapur Budvel real estate

నియోపోలిస్, పరిసర ప్రాంతాలలో ఇప్పటికే తగినంత వ్యాపార, నిర్మాణ కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉన్నాయని క్రెడాయ్-హైదరాబాద్ (CREDAI-Hyderabad) అధ్యక్షుడు ఎన్. జైదీప్ రెడ్డి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో డెవలపర్లు ఇప్పుడు కేవలం కోకాపేట్‌కే పరిమితం కాకుండా.. కొత్తగా భూమి పార్శిళ్లు అందుబాటులోకి వస్తూ మెరుగైన వృద్ధి అవకాశాలను అందిస్తున్న మియాపూర్, బుద్వేల్ వంటి ఇతర ప్రాంతాలపై దృష్టి సారిస్తున్నారని ఆయన వివరించారు.

దీనికి తోడు శుక్రవారం వేలానికి ఉంచిన కోకాపేట్ ప్లాట్.. చుట్టూ ఉన్న ఇతర ప్రాజెక్టుల మధ్య ఇరుక్కుపోయి ఉండటం, ప్రత్యేకమైన వ్యూ ఆకర్షణ లేకపోవడం కూడా బిల్డర్లు దానిపై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు వెనుకాడటానికి కారణమైందని జైదీప్ రెడ్డి విశ్లేషించారు.

Also Read

మరోవైపు కోకాపేట్, పశ్చిమ ఐటీ కారిడార్ ప్రాంతాలలో పేరుకుపోయిన అమ్ముడుపోని విలాసవంతమైన గృహాల నిల్వలు హెచ్‌ఎండిఏ వేలంలో డెవలపర్లు ఉత్సాహం చూపకపోవడానికి అసలు కారణమని పరిశ్రమ వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఖాళీగా ఉన్న లగ్జరీ ఫ్లాట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, గత వేలంపాటల వల్ల ఆస్తుల ధరలు గణనీయంగా పెరిగిపోవడం సామాన్య, మధ్యతరగతి కొనుగోలుదారులనే కాకుండా అనేక మంది పెట్టుబడిదారులనూ నిరుత్సాహపరిచిందని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ సిరిల్' డైరెక్టర్ అజు థామస్ తెలిపారు. రాబోయే ఆరు నెలల్లో మార్కెట్ తిరిగి పుంజుకుంటుందని పలువురు డెవలపర్లు ఆశాభావంతో ఉన్నప్పటికీ.. గత వేలం తర్వాత ప్రకటించిన అనేక భారీ ప్రాజెక్టులు ఇంకా క్షేత్రస్థాయిలో ప్రారంభం కాలేదని నిపుణులు ఎత్తిచూపుతున్నారు.

మార్కెట్‌లో మళ్లీ కొత్త పెట్టుబడుల ప్రవాహం మొదలవ్వాలంటే ముందుగా ద్రవ్య ప్రసరణ వేగవంతం కావాలని ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ సీనియర్ అధికారి అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్టులకు ప్రభుత్వ ఆమోదాలు లభించి, నిర్మాణాలు ప్రారంభమై, గృహాల అమ్మకాలు ఊపందుకున్నప్పుడే డెవలపర్ల చేతికి తిరిగి నిధులు అందుతాయని.. ఆ చక్రం మందకొడిగా ఉన్నంత కాలం కొత్త భూముల కొనుగోలుకు మరిన్ని నిధులను కేటాయించడం నిర్మాణ సంస్థలకు సవాలుగానే మారుతుందని ఆయన స్పష్టం చేశారు.

హెచ్‌ఎండీఏ (HMDA) నిర్వహించిన ఈ-వేలంలో కోకాపేట నియోపోలిస్‌లోని ప్లాట్ నంబర్ 17 కు కనీస ధర (అప్‌సెట్ ప్రైస్) ఎకరాకు రూ. 120 కోట్లుగా నిర్ణయించారు. మొత్తం 4.59 ఎకరాల విస్తీర్ణం గల ఈ భూమికి కనీస మొత్తం విలువ రూ. 550.80 కోట్లు కాగా.. వేలంలో పాల్గొనేందుకు ధరావత్తు (EMD) గా రూ. 5 కోట్లు చెల్లించాలని నిబంధన విధించారు. అయితే ఒక్క బిడ్డు కూడా దాఖలు కాకపోవడంతో అధికారులు ఈ వేలాన్ని రద్దు చేశారు. సెప్టెంబర్ 2026లోనూ ఇదే ప్లాట్‌కు ఎకరా రూ. 120 కోట్ల కనీస ధరతో వేలం నిర్వహించగా కేవలం ఒకే ఒక బిడ్డు రావడంతో అప్పట్లోనూ వేలాన్ని నిలిపివేశారు.

కోకాపేటతో పాటు శుక్రవారం మధ్యాహ్నం కూకట్‌పల్లి మండలంలోని మూసాపేట (పాత హుడా ట్రక్ పార్క్ స్థలం) లోని 3.15 ఎకరాల భూమికి కూడా హెచ్‌ఎండీఏ వేలం నిర్వహించింది. దీనికి ఎకరా కనీస ధర రూ. 99 కోట్లుగా (మొత్తం కనీస విలువ రూ. 311.85 కోట్లు) నిర్ణయించగా.. దీనికి సైతం కొనుగోలుదారుల నుండి స్పందన కరవైంది. అంతకుముందు నవంబర్ 25న బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీ సమీపంలోని హుడా హైట్స్ (HUDA Heights) లోని 8 ప్లాట్లకు చదరపు గజానికి రూ. 2 లక్షల కనీస ధరతో వేలం నిర్వహించగా అక్కడ కూడా బిడ్లు దాఖలు కాలేదు. ముందే భారీ స్థాయిలో కనీస ధరలు నిర్ణయించడం.. పశ్చిమ కారిడార్‌లో అమ్ముడుపోని విలాసవంతమైన గృహాల నిల్వలు పేరుకుపోవడం వల్లే బిల్డర్లు ఈ వేలాలకు దూరంగా ఉన్నారని రియల్ ఎస్టేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+