Hyderabad Real Estate Surge: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం రియాల్టీ రంగంలో అపరిమిత వేగంతో దూసుకుపోతోంది. గత రెండు దశాబ్దాల నుంచి ఐటీ హబ్‌గా, స్టార్టప్ కేంద్రంగా, పెట్టుబడిదారుల గమ్యస్థానంగా అమిత వేగంతో అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు చారిత్రక స్మారక చిహ్నాలకే పరిమితమైన ఈ నగరం.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ మార్కెట్లో దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వృద్ధికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. నగరంలో బలమైన ఐటీ రంగం పెట్టుబడిదారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో గ్లోబల్ కంపెనీలు స్థిరపడటంతో..భారీగా ఉద్యోగ అవకాశాలు విస్తరించాయి. దీనివల్ల మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి ప్రజలు ఇళ్ల కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నారు. అంతేకాక, శంషాబాద్ ఎయిర్‌పోర్టు, ORR, మెట్రో రైలు వంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు హైదరాబాద్ నగర విలువను మరింతగా ముందుకు తీసుకువెళుతున్నాయి.

ప్రస్తుతం నగరంలోని పశ్చిమ భాగంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. గచ్చిబౌలి, కోకాపేట్, నార్సింగి, మణికొండ, నానక్‌రామ్‌గూడ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీలు అత్యధికంగా అభివృద్ధి చెందుతున్నాయి. 2020 తర్వాత రిమోట్ వర్క్ పెరిగినప్పటికీ హైదరాబాద్‌లో గృహ అవసరాలు మాత్రం తగ్గలేదు. ఇంతకు ముందు చదరపు అడుగుకు రూ.4 వేల నుంచి -5 వేలు ఉన్న చోట, ఇప్పుడు ఏకంగా రూ.8 వేల నుంచి 12 వేలకు చేరిందని చెప్పుకోవచ్చు.
అద్దె మార్కెట్ కూడా నగరంలో వేగంగా పెరుగుతోంది. ఐటీ ప్రొఫెషనల్స్, స్టార్టప్ ఉద్యోగులు, కొత్తగా నగరానికి వచ్చే వారి కారణంగా.. గచ్చిబౌలి-కోకాపేట్ పరిసరాల్లో 2BHK అద్దె రూ.30 వేల నుంచి 40 వేల మధ్యకు చేరింది. 3BHK అయితే రూ.45 వేల నుంచి 60 వేలు దాటింది. ఇది పెట్టుబడిదారులకు లాభదాయకమైన పరిస్థితిగా కనిపిస్తోంది.ఇక నగరంలో వాణిజ్య విభాగం కూడా చాలా బలంగానే ఉంది. మల్టీనేషనల్ కంపెనీలు కోవిడ్ తర్వాత కూడా హైదరాబాద్‌కు ప్రధాన ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కొత్త ఆఫీస్ స్పేస్‌లకు డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. భారీ స్థాయిలో ముందుకు దూసుకుపోతోంది స్సేస్ పరంగా నగరం. అందుకే రైడూ, మెగాపోలిస్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాజెక్టులు వరుసగా వస్తున్నాయి.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంకా వృద్ధి దిశగానే సాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్‌లో విల్లాలు, లగ్జరీ హోమ్స్, గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ పెరుగుతుండగా, తూర్పు హైదరాబాద్ ( బీబీనగర్, యాదాద్రి, కాప్రా, ఉప్పల్, హయత్ నగర్, ఎల్బీ నగర్)లో అపార్ట్‌మెంట్లు, అఫోర్డబుల్ హోమ్స్ అభివృద్ధి చెందుతున్నాయి. మెట్రో రైలు విస్తరణ, కొత్త రోడ్ల నిర్మాణం, ఐటీ, ఫార్మా, డిఫెన్స్ ప్రాజెక్టులు ఈ వృద్ధికి మరింత ఊతం ఇస్తున్నాయి
ఈ అంశాలతో హైదరాబాద్ ఇప్పుడు దేశంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు టాప్ 3 నగరాల్లో ఒకటిగా నిలిచింది. స్థిరమైన ఆర్థిక వాతావరణం, ఉద్యోగ అవకాశాలు, భద్రతా భావనతో కూడిన అంశాలు పెట్టుబడిదారులు, గృహ కొనుగోలుదారులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. వచ్చే 5 ఏళ్లలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మరింత బలపడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

అమరావతి ల్యాండ్ పూలింగ్: నేడే ఆఖరి అవకాశం, రైతుల పరిస్థితి ఏంటి?

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ భారీ షాక్!

బెంగళూరు సబర్బన్ రైలు ఆగిందా? ఐటీ ఉద్యోగులకు షాకింగ్ వార్త

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్‌మెంట్లు!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క ఏరియాలోనే ఇల్లు కావాలంటున్న కొనుగోలుదారులు..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..



Click it and Unblock the Notifications