చాలా ఏళ్ల నుంచి హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేవి గచ్చిబౌలి, హైటెక్ సిటీ లాంటి పశ్చిమ ప్రాంతాలే. టెక్ కంపెనీలన్నీ అక్కడే ఏర్పాటయ్యాయి. కానీ, ఇప్పుడు ఆ ఏరియాలు ఫుల్ రద్దీగా మారడంతో పాటు అక్కడ రియల్ ఎస్టేట్ ధరలు కూడా చాలా ఎక్కువైపోయాయి. ఇక్కడ స్థలం దొరకడం కూడా కష్టమే. అందుకే సిటీ డెవలప్‌మెంట్ ఇప్పుడు రూటు మార్చుకుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో ఇప్పుడు అసలైన వృద్ధి అంతా దక్షిణ ప్రాంతంలోనే మొదలవుతోంది. భవిష్యత్తులో ఇక్కడ అదిరిపోయే డెవలప్‌మెంట్ చూడబోతున్నాం.

తుక్కుగూడ ఫ్యాబ్ సిటీ
ఈ మార్పుకు మెయిన్ కారణం.. తుక్కుగూడ దగ్గర ఉన్న 900 ఎకరాల ఫ్యాబ్ సిటీ ని ప్రభుత్వం భారీగా డెవలప్ చేస్తుండటం. ఇది 'తెలంగాణ రైజింగ్ 2047' ప్లాన్‌లో చాలా ముఖ్యమైన భాగం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ స్టోరేజ్ కోసం దీన్ని 'నెక్స్ట్ జనరేషన్ హబ్' గా మారుస్తున్నారు. దీనివల్ల పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తాయి. దాదాపు 15,000 ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఒకప్పుడు మాదాపూర్‌లో ఎలా డెవలప్‌మెంట్ జరిగిందో ఇప్పుడు ఇక్కడ అంతకంటే ఎక్కువ జరుగుతుందని అంటున్నారు. అందుకే ఇక్కడ ప్లానింగ్ తో కూడిన డెవలప్ మెంట్ ఉండే అవకాశం ఉంది.
దక్షిణ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు పశ్చిమ ప్రాంతం కంటే ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది. ముందుగానే రెడీగా ఉన్న మంచి రోడ్లు, సౌకర్యాలు. ఇక్కడ ORR (ఔటర్ రింగ్ రోడ్) కనెక్టివిటీ చాలా బాగుంది. ఎయిర్‌పోర్ట్‌కి కేవలం 15 నిమిషాల్లో వెళ్లొచ్చు. అంటే, పాత ఏరియాల లాగా ట్రాఫిక్ సమస్యలు, రోడ్ల ఇబ్బందులు లేకుండా ఒక పక్కా ప్లానింగ్‌తో ఈ ఏరియా డెవలప్ అవుతుంది.
లైఫ్‌స్టైల్ మారింది
దక్షిణ హైదరాబాద్‌లో ఇల్లు కొనడానికి వస్తున్న ప్రొఫెషనల్స్, బిజినెస్ లీడర్స్ అంతా సిటీ మధ్యలో ఉండే రద్దీ, చిన్న అపార్ట్‌మెంట్స్ లాంటి లైఫ్‌స్టైల్‌కి దూరంగా ఉండాలనుకుంటున్నారు. వాళ్ళ దృష్టి సంపాదనతో పాటు లైఫ్ స్టైల్ మీద కూడా ఉంది. వాళ్ళ కోరిక సింపుల్.. ఆఫీస్‌కి త్వరగా వెళ్లగలగాలి. కానీ ఇల్లు మాత్రం ప్రశాంతంగా, విశాలంగా, ప్రకృతికి దగ్గరగా ఉండాలి. స్వచ్ఛమైన గాలి, చుట్టూ పచ్చదనం ఉండే చోట ఉండటమే ఇప్పుడు వాళ్లకు అసలైన లగ్జరీ. అందుకే కొద్ది మంది మాత్రమే ఉండే, మంచి గాలి, వెలుతురు వచ్చే పెద్ద స్థలాల్లో కట్టే ఇళ్లకు డిమాండ్ పెరిగింది.
రియల్ ఎస్టేట్ బూమ్..
ఈ కొత్త డిమాండ్‌ను గుర్తించి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కూడా సౌత్ వైపుగా విస్తరిస్తోంది. ఈ ఏరియాల్లో కొత్తగా పలు వెంచర్లు వస్తున్నాయి. ఫ్యాబ్ సిటికి అనుసంధానంగా పలు బిజినెస్ పార్క్ లు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే రియల్ ఎస్టేట్ వ్యాపారుల చూపు ఇప్పుడు తుక్కుగూడ ఏరియాపై పడింది.శంషాబాద్ నుంచి తక్కుగూడ వైపుగా రింగ్ రోడ్డుకి అటు ఇటు భూముల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!



Click it and Unblock the Notifications