Hyderabad Real Estate: రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ మార్కెట్ నేల చూపులు చూస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరంలో రియాల్టీ రంగం వేగంగా దూసుకుపోయిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు డీలా పడింది. గతంలో రికార్డు స్థాయిలో ఆస్తుల క్రయవిక్రయాలు జరిగినా తాజాగా పరిస్థితులు మారాయి. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం, భూముల అధిక ధరలు, అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రభావంతో రియల్ ఎస్టేట్ ఢమాల్ అయింది.
అధికారిక గణాంకాల ప్రకారం.. 2023 జనవరి-జూలై మధ్య 1,47,091 రిజిస్ట్రేషన్లు జరగగా..రూ. 2,157.60 కోట్లు ఆదాయం వచ్చింది. ఇది 2024 జనవరి-జూలై మధ్య కాలంలో 1,50,247 రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదు చేసింది. రూ. 2,481.58 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక తాజాగా 2025 తొలి ఏడు నెలలను చూసుకున్నట్లయితే..కేవలం 1,47,236 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. 2,518.98 కోట్లు ఆదాయం మాత్రమే వచ్చింది. అయితే విచిత్రంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గినప్పటికీ ఆదాయం పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే..భూముల ధరలు పెరగడం వల్ల ఆస్తుల మార్కెట్ విలువలు రికార్డు స్థాయిలో పెరిగాయి.
మహమ్మారి అనంతరం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా పుంజుకుంది. కోకాపేట, నార్సింగి, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, శంకర్‌పల్లి, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, మణికొండ, మహేశ్వరం వంటి ప్రాంతాల్లో ధరలు చుక్కలను తాకాయి. కోకాపేటలో ఎకరా ధర రూ. 100 కోట్లకు పైగా పలికిందంటే రియాల్టీ బూమ్ ధరను అర్థం చేసుకోవచ్చు. ఓఆర్‌ఆర్ చుట్టుపక్కల విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీలు, హైరేంజ్ విల్లాలు, ఎత్తైన అపార్ట్‌మెంట్ ప్రాజెక్టులు వేగంగా నిర్మితమయ్యాయి.దీంతో దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఈ ప్రాజెక్టులపై భారీగా ఆసక్తి చూపాయి.ఈ డిమాండ్ మధ్య రోజుకు సగటున 750-1000 రిజిస్ట్రేషన్లు జరగడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.

అయితే 2024 తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం మధ్య ఇన్వెస్టర్లు సైలెంట్ అయ్యారు. దీంతో పాటుగా ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌లలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనుగోలుదారుల్లో ఆందోళనను రేకెత్తించాయి. ఈకారణాలతో ఈ ఏడాది రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గి.. రియల్టీ మార్కెట్‌లో ఊహించని నిశ్చబ్దం నెలకొంది.ఒకప్పుడు రియల్ ఎస్టేట్ ద్వారా విలాసవంతమైన జీవితం గడిపిన కమీషన్ ఏజెంట్లు ఇప్పుడు పరిస్థితులు తారుమారు కావడంతో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారు.
ఖరీదైన కార్లు నడిపిన వారు..ఇప్పుడు రోజువారీ ఖర్చుల కోసం తమ ఆస్తులు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టే పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆదాయం పెరిగినా.. లావాదేవీల సంఖ్య తగ్గిపోవడం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి దీర్ఘకాలిక హెచ్చరికగా మారింది. ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకోవాలని రియల్ ఎస్టేట్ నిపుణులు కోరుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications