Hyderabad Real Estate: భాగ్యనగరానికి దక్షిణ ద్వారంగా పేరొందిన శంషాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోతోంది. రాబోయే సంవత్సరాల్లో ఇది దేశానికే ఒక కీలక హబ్ గా మారనుంది. దీనికి ప్రధాన కారణం దక్షిణ మధ్య రైల్వే చేసిన కీలక ప్రకటన అని చెప్పవచ్చు. ఇంతకీ ఆ ప్రకటన సారాంశం ఏంటంటే.. బెంగళూరు, చెన్నై, పుణె, ముంబై వంటి నాలుగు ప్రధాన మెట్రో నగరాలను అనుసంధానించే హైస్పీడ్ రైల్వే కారిడార్‌లో శంషాబాద్‌లో హైస్పీడ్ టెర్మినల్ ఏర్పాటు. ఈ కారిడార్ ద్వారా శంషాబాద్ దక్షిణ భారత ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంతో శంషాబాద్ ఏరోస్పేస్ హబ్‌గా గుర్తింపు పొందింది. ఇప్పుడు రైలు నెట్‌వర్క్ కూడా అదే స్థాయిలో విస్తరించడంతో.. విమానయానం-రైలు మార్గాల సమ్మేళనంతో ఒక సమగ్ర ఏరోట్రోపోలిస్ ఎకోసిస్టమ్ ఏర్పడనుందని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఏ నగరంలోనైనా రోడ్డు కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. కానీ శంషాబాద్‌కు రోడ్లు మాత్రమే కాకుండా విమానాశ్రయం, రైల్వే, భవిష్యత్‌లో మెట్రో, రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్ ఆర్) వంటి అన్ని రకాల ఆధునిక రవాణా సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా తెలంగాణలోని సగానికి పైగా జిల్లాలతో ఇప్పటికే బలమైన అనుసంధానం కలిగిఉంది.

ఇక ఐటీ హబ్‌లతో శంషాబాద్ అనుసంధానం మరింత బలపడనుంది. దేశంలో అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల్లో ఒకటైన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వందకు పైగా నగరాలకు నేరుగా విమాన సేవలు ఉన్నాయి. ఏటా 2.7 కోట్లకు పైగా ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం శంషాబాద్ వరకు మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకోవడంతో.. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ఐటీ కేంద్రాలకు చేరుకోవడం మరింత సులభమవుతుంది. హైస్పీడ్ రైలు ద్వారా హైదరాబాద్‌ను బెంగళూరు, చెన్నై, పుణె వంటి ఐటీ నగరాలతో కలపడం వల్ల ఒకే పని దినంలో నగరాల మధ్య ప్రయాణం సాధ్యమవుతుంది. ఇది ఐటీ ఉద్యోగులు, కార్పొరేట్లకు పెద్ద ఊరటగా మారనుంది.
ఈ మౌలిక సదుపాయాల ప్రభావంతో శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్‌కు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. గత 2-3 ఏళ్లలో శంషాబాద్, ఔటర్ రింగ్ రోడ్ వెంట ఉన్న ప్రాంతాల్లో భూముల ధరలు 15 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. విమానాశ్రయం, లాజిస్టిక్ హబ్‌లు, గిడ్డంగులు, ప్రతిపాదిత మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తాజా హైస్పీడ్ రైల్వే ప్రకటనతో శంషాబాద్ నుంచి 20 కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాలు మరింతగా అభివృద్ధి చెందనున్నాయి. గచ్చిబౌలి, కోకాపేట, మణికొండ, హైటెక్ సిటీ వంటి ప్రాంతాల్లో భారీ నివాస, వాణిజ్య ప్రాజెక్టులు శంషాబాద్ ఏరియాలో రానున్నాయి.
అయితే సమగ్ర అభివృద్ధి కోసం కేవలం హైరైజ్ అపార్ట్‌మెంట్లు మాత్రమే కాకుండా ఆస్పత్రులు, విద్యాసంస్థలు, రిటైల్ మాల్స్, పౌర సౌకర్యాలు కూడా సమాంతరంగా అభివృద్ధి కావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌లో అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు అడుగుకు రూ.7 వేల నుంచి రూ. 9 వేల మధ్య ఉండగా.. భూముల ధరలు గజానికి రూ.60 వేల నుంచి రూ. 65 వేల మధ్యలో ఉన్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు శాటిలైట్ టౌన్‌షిప్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టాయి. 2027 నాటికి ఈ ప్రాంతం ఏటా 11 నుంచి 18 శాతం వృద్ధి సాధించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఏరోట్రోపోలిస్ హబ్‌గా శంషాబాద్ ఎదుగుదలతో.. ఈ ప్రాంతం సీ-సూట్ ట్రాన్సిట్ ఆఫీస్ గా కూడా మారనుంది. ఇతర మెట్రో నగరాలకు ప్రయాణ సమయం తగ్గడంతో ఎగ్జిక్యూటివ్‌లు, కార్పొరేట్లకు ఇది కీలక కేంద్రంగా మారుతుంది. ఫైవ్‌స్టార్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, లగ్జరీ రెసిడెన్షియల్ క్లస్టర్లు, అవియేషన్, ఫార్మా పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చెందే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే, శంషాబాద్ రాబోయే దశాబ్దంలో హైదరాబాద్ అభివృద్ధికి కొత్త ఆర్థిక ఇంజిన్‌గా మారనుందని నిపుణులు చెబుతున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

హైదరాబాద్‌లో గుడ్డిగా ఇల్లు కొని మోసపోవద్దు.. అనుమతులపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన హైడ్రా..

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications