Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నేల చూపులు చూస్తోంది. ఏళ్ళ తరబడి స్థిరమైన వృద్ధిని సాధించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం దీర్ఘకాలిక మందగమన సంకేతాలను చూపుతోంది.తాజాగా ఏప్రిల్ నెలలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు తగ్గాయి. ఇక హౌస్ రిజిస్ట్రేషన్లు కూడా సంవత్సరానికి 12 శాతం వరకు తగ్గాయి. ఏప్రిల్ 2024తో పోలిస్తే రిజిస్టర్డ్ ఆస్తుల విలువ కూడా దాదాపు 4 శాతం తగ్గింది.
అయితే ఇళ్ల అమ్మకాలు తగ్గినప్పటికీ ఏప్రిల్ నెలలో నమోదైన ఇళ్ల రేటు విలువ చాలా ఎక్కువగానే ఉందని చెప్పవచ్చు.తక్కువ ఇళ్లు సేల్ అయినప్పటికీ దాదాపు రూ. 4 వేల కోట్లకు పైగానే విలువ గల అమ్మకాలు జరిగాయి. మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డితో పాటు సంగారెడ్డి లాంటి జిల్లాలో రియల్ ఎస్టేట్ దూసుకుపోతోంది.ఈ జిల్లాలో ప్రీమియం హౌస్ ల అమ్మకాలు చాలా ఎక్కువ విలువతో జరిగాయి. ఈ ప్రాంతాల్లో కమర్షియల్ ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగింది.

హైదరాబాద్ నగరంలో మొత్తం ఇళ్ల రిజిస్ట్రేషన్లు సంఖ్య తగ్గినప్పటికీ, కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న ప్రీమియం ఇళ్లకు భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ విభాగంలో రిజిస్ట్రేషన్లు సంఖ్య ఏటా 2 శాతం పెరుగుతోంది. 2023లో దీని విలువ 17 శాతంగా ఉంది. ఏప్రిల్ 2025లో దీని విలువ 20 శాతంగా నమోదైంది. అంటే ఏడాదికేడాది ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
భాగ్యనగరంలో మొత్తం రిజిస్ట్రేషన్లలో కోటి రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్ల వాటా కేవలం 20 శాతంగా నమోదైంది. అయినప్పటికీ ఏప్రిల్ 2025లో మొత్తం ఆస్తి రిజిస్ట్రేషన్ల విలువకు 51 శాతంగా నమోదైంది. దీని ప్రకారం చూసుకుంటే నికర విలువ ఏప్రిల్ 2024తో పోలిస్తే సంవత్సరానికి 14 శాతం పెరిగింది. కాగా మెజారిటీ రిజిస్ట్రేషన్లు వేయి నుంచి రెండు వేల చదరపు అడుగుల మధ్య ఉన్న ఇళ్లకు సంబంధించినవి.
ఇక రెండు వేల చదరపు అడుగులకు పైగా ఉన్న ఇళ్లు కూడా భారీగానే వృద్ధిని నమోదు చేశాయి. ఈ ఇళ్లు మొత్తం రిజిస్ట్రేషన్లలో ఏప్రిల్ 2024లో 15 శాతం నుండి 18 శాతానికి పెరిగాయి.ఈ వివరాలను నైట్ ఫ్రాంక్ నివేదిక తెలిపింది. ఈ నివేదిక ప్రకారం.. మొత్తం రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లా 48 శాతంతో అగ్రస్థానంలో నిలిచింది. మేడ్చల్-మల్కాజ్‌గిరి 36 శాతం వాటాతో రెండవస్థానంలో నిలవగా..మిగిలిన 15 శాతంతో హైదరాబాద్ జిల్లా మూడవస్థానంలో నిలిచింది.
ఇదిలా ఉంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ప్రస్తుతం ఊపు రాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఒకటి ఎక్కువ ధరలు. ఇప్పటికే అత్యధిక రేట్ల స్థాయికి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ చేరుకుంది. వచ్చే ఐదేళ్ల తర్వాత ఎంత విలువ ఉంటుందో ముందే అంచనా వేసుకున్న బిల్డర్లు ఇప్పుడే ఆ ధరకు విక్రయాలు ప్రారంభించారు. అందుకే హైదరాబాద్ నగరంలో రియల్ ధరలు అనూహ్యంగా పెరిగిపోయాయి.ఈ నేపథ్యంలో ధరలు కొంత కాలం స్థిరంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

వైజాగ్ రియల్ ఎస్టేట్.. ఈ నాలుగు జోన్లలోని ఫ్లాట్ల కోసం ఎగబడుతున్న కొనుగోలుదారులు..కారణం ఏంటంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications