Hyderabad Real Estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ప్రస్తుతం భారీగా మందగమనాన్ని చూస్తోంది. ఈ క్రమంలో అమ్మకాలు, ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ పడిపోవటం రియల్టీ కంపెనీలు, నిర్మాణదారులను ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది.
నవంబరు మాసంలో హైదరాబాద్ రియల్టీలో కేవలం 5516 రిజిస్ట్రేషన్లు మాత్రమే జరిగాయి. ఏడాది ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లు 12 శాతం తగ్గినట్లు నమోదైంది. అలాగా అక్టోబరుతో పోల్చితే నవంబరులో రిజిస్ట్రేషన్లు 6 శాతం మేర తగ్గినట్లు వెల్లడైంది. పైగా అక్టోబరులో 5894 ప్రాపర్టీల రిజిస్ట్రేషన్ నమోదైందని ప్రముఖ సంస్థ నైట్ ఫ్రాంక్ డిసెంబర్ 24న విడుదల చేసిన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ క్రమంలో నవంబరులో గృహ అమ్మకాల విలువ రూ.3495 కోట్లుగా నిలిచినట్లు రిపోర్ట్ వెల్లడించింది. ఏడాది ప్రాతిపదికన అమ్మకాల విలువ 7 శాతం డ్రాప్ నమోదు చేసింది. అలాగే నెలవారీ ప్రాతిపదికన హైదరాబాద్ రియల్టీ అమ్మకాల పరంగా 3 శాతం తక్కువ అమ్మకాల విలువను రికార్డు చేసింది.

హైదరాబాద్‌లో మొత్తం ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌లు నవంబర్ 2024లో మోడరేట్ చేయబడ్డాయని నైట్ ఫ్రాంక్ ఇండియా ఎండీ శిశిర్ బైజల్ వెల్లడించారు. అయితే అధిక విలువ కలిగిన లగ్జరీ గృహాలకు డిమాండ్ బలంగా ఉన్నట్లు రిపోర్టులో వెల్లడైంది. ఇది కొనుగోలుదారుల ప్రాధాన్యత ముఖ్యంగా విలాసవంతమైన జీవితంపై పెరుగుతున్న మెుగ్గును ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా రూ. కోటి కంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీలపై కొనుగోలుదారులు మెుగ్గుచూపుతున్నట్లు శిశిర్ వెల్లడించారు. నవంబరులో జరిగిన మెుత్తం రిజిస్ట్రేషన్లలో 14 శాతం అధిక విలువ కలిగి గృహాలు ఉన్నట్లు వెల్లడికావటం దీనిని రుజువు చేస్తోంది.
రిజిస్ట్రేషన్లలో మేడ్చల్-మల్కాజ్ గిరి 42 శాతం, రంగారెడ్డి 41 శాతంతో జిల్లాలు ముందు స్థానంలో కొనసాగాయి. అయితే హైదరాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్లు కేవలం 17 శాతంగా ఈ కాలంలో నమోదయ్యాయి. అయితే మెుత్తానికి హైదరాబాదులో కొనుగోళ్ల మందగమనం కనిపించిందని రిపోర్ట్ వెల్లడించింది. అయితే హైదరాబాదులో ప్రధానంగా రూ.50 లక్షల కంటే తక్కువ విలువ కలిగిన ప్రాపర్టీల రిజిస్ట్రేషన్లు అధికంగా నవంబరులో నమోదయ్యాయి. 1000-2000 మధ్య చదరపు అడుగుల మధ్య ప్రాపర్టీలకు 69 శాతం హైదరాబాదులో డిమాండ్ కనిపించింది. అభివృద్ధి చెందుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా ఉన్నత స్థాయి ప్రాజెక్ట్‌లను ప్రవేశపెట్టడం ద్వారా డెవలపర్‌లు ఈ ట్రెండ్‌తో చురుగ్గా ముందుకు సాగుతున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్ నివాస రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో సంపన్న కొనుగోలుదారుల విశ్వాసాన్ని నొక్కి చెబుతోంది. 2024 ప్రారంభం జనవరి నుంచి నవంబరు మధ్య హైదరాబాద్ రూ.43,574 కోట్ల విలువైన గృహ విక్రయాలను నమోదు చేసింది. ఈ క్రమంలో 70,796 యూనిట్ల రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.
More From GoodReturns

Petrol Prices: కేంద్రం పన్ను తగ్గించాక.. మీ నగరంలో రేట్లు మారాయో? లేదో చూడండి!

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

దుబాయ్‌లో క్రెడిట్ కార్డుతో ఇల్లు బుక్ చేసుకుంటున్నారా.. అయితే ఈ ఆర్బీఐ హెచ్చరిక గురించి తప్పక తెలుసుకోండి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..



Click it and Unblock the Notifications