Rangareddy district Top in India: ఇండియా ప్రపంచంలో మరి కొద్ది రోజుల్లో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ వేగవంతమైన ఎదుగుదల వెనుక ప్రధాన కారణం ఏంటంటే.. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న కొన్ని జిల్లాలు ఆర్థిక శక్తి కేంద్రాలుగా మారిపోవడమేనని చెప్పుకోవచ్చు. ఇటీవల విడుదలైన ఆర్థిక సర్వే 2024-25 ఆసక్తికర అంశాలను వెల్లడించింది. దేశవ్యాప్తంగా అత్యధిక తలసరి జిడిపి (Per Capita GDP) కలిగిన టాప్ 10 జిల్లాల వివరాలను ఈ నివేదిక వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ జాబితాలో తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
దేశంలో నంబర్ 1 జిల్లాగా రంగారెడ్డి : హైదరాబాద్ ఐటీ కారిడార్‌కి హార్ట్ గా నిలిచే రంగారెడ్డి జిల్లా ఇప్పుడు భారతదేశపు అత్యంత సంపన్న జిల్లాగా ఎదిగింది. ఇక్కడ తలసరి జిడిపి రూ. 11.46 లక్షలుగా ఉందని నివేదిక తెలిపింది. హైదరాబాద్ చుట్టుపక్కల ఏర్పడిన ఐటీ పార్కులు, ఫార్మాస్యూటికల్ క్లస్టర్లు, రియల్ ఎస్టేట్ బూమ్ ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయని నివేదిక తెలిపింది. ప్రపంచ కనెక్టివిటీతో రంగారెడ్డి ఇప్పుడు గ్లోబల్ ఇన్వెస్టర్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

రెండో స్థానంలో గుర్గావ్ : హర్యానాలోని గుర్గావ్ ఒకప్పుడు నంబర్ 1గా ఉన్నా..హైదరాబాద్ ధాటికి ఇప్పుడు రెండో స్థానంలోకి చేరింది. అయినప్పటికీ దీని ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు.తలసరి జిడిపి రూ. 9.05 లక్షలుగా ఉంది. గుర్గావ్, ఐటీ కార్పొరేట్ సేవల రంగంలో ఇప్పటికీ బలమైన కేంద్రంగా ఉంది. బహుళజాతి సంస్థలు, స్టార్టప్‌లకు ఇది ప్రధాన కేంద్రంగా మారుతోంది.
సిలికాన్ వ్యాలీ బెంగళూరు మూడో స్థానంలో: కర్ణాటకలోని బెంగళూరు అర్బన్ జిల్లా భారత సిలికాన్ వ్యాలీగా గుర్తింపు సంపాదించింది. తలసరి జిడిపి రూ. 8.93 లక్షలతో మూడో స్థానంలో నిలిచింది. ఐటీ ఎగుమతులు, టెక్ స్టార్టప్‌లు, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తి.. ఇవన్నీ బెంగళూరు నగరాన్ని అత్యంత ధనిక జిల్లాలలో ఒకటిగా నిలిపాయి.
గౌతమ్ బుద్ధ నగర్ (నోయిడా) నాలుగవ స్థానంలో: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నాలుగో ఈ నివేదికలో స్థానంలో నిలిచింది. దీని తలసరి జిడిపి రూ. 8.48 లక్షలు. ఐటీ సేవలు, తయారీ, రియల్ ఎస్టేట్ , తయారీ రంగంలో ఇది దేశంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాల్లో ఒకటిగా గుర్తించబడింది.
హిమాచల్ ప్రదేశ్‌సోలన్ 5 వస్థానం: హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్ జిల్లా ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచి దేశాన్ని ఆకర్షించింది. ఈ జిల్లా తలసరి జిడిపి రూ. 8.10 లక్షలుగా ఉంది. ఈ జిల్లా ఆహార ప్రాసెసింగ్, ఫార్మాస్యూటికల్ పరిశ్రమలు ద్వారా అభివృద్ధి చెందింది. కొండ ప్రాంతంగా నిలిచిన హిమాచల్ రాష్ట్రానికి సోలన్ నిజమైన ఆర్థిక శక్తిని ఈ జిల్లా అందిస్తోంది.
పర్యాటక ఆధారిత గోవాకు 6వ స్థానం: ఉత్తర & దక్షిణ గోవా జిల్లాలు కలిసి ఆరవ స్థానంలో నిలిచాయి. ఈ జిల్లాల తలసరి జిడిపి రూ. 7.63 లక్షలుగా నమోదైంది. బీచ్‌లు, హోటళ్లు, పర్యాటక సేవలు గోవా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూర్చుతున్నాయి.
సిక్కిం జిల్లాలో 7 వ స్థానంలో: సిక్కిం రాష్ట్రంలోని గ్యాంగ్‌టాక్, నామ్చి, మంగన్, గ్యాల్షింగ్ జిల్లాలు ఏడో స్థానంలో నిలిచాయి. ఈ జిల్లాల తలసరి జిడిపి రూ. 7.46 లక్షలుగా ఉంది. సిక్కిం రాష్ట్రం పర్యావరణ సంపద, స్థిరమైన పర్యాటకంతో దేశ పటంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.
దక్షిణ కన్నడ జిల్లా 8వ స్థానంలో : కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా తలసరి జిడిపి రూ. 6.69 లక్షలు. ఈ జిల్లా, ఓడరేవు ఆధారిత వాణిజ్యం, విద్యా రంగం, సేవల రంగం వల్ల అభివృద్ధి చెందుతోందని నివేదిక తెలిపింది.
ముంబై 9వ స్థానంలో: భారత ఆర్థిక రాజధాని అయిన ముంబై ఈ నివేదికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.తలసరి జిడిపి రూ. 6.57 లక్షలు ఉన్న ఈ నగరం స్టాక్ మార్కెట్లు, కార్పొరేట్ ప్రధాన కార్యాలయాలు, బ్యాంకింగ్, సేవల రంగంపై ఆధారపడుతోంది.
అహ్మదాబాద్ 10వ స్థానంలో: గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా పదో స్థానంలో నిలిచింది. దీని తలసరి జిడిపి రూ. 6.54 లక్షలుగా ఉంది. ఇది వస్త్రాలు, రసాయనాలు, ఆధునిక పరిశ్రమల మిశ్రమంతో ఒక గొప్ప పట్టణ-పారిశ్రామిక ప్రొఫైల్‌ను కలిగి ఉందని నివేదిక తెలిపింది.
More From GoodReturns

Hyderabad: బేగంపేట ఎయిర్పోర్ట్ కింద భారీ టన్నెల్.. ఇక ఆ ఏరియాల్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Success story: షుగర్ లేని స్వీట్లతో కోట్లల్లో లాభాలు! సాఫ్ట్వేర్ దంపతుల సక్సెస్ స్టోరీ..!

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

బెంగళూరును కుదిపేస్తున్న ఎల్పిజి కొరత.. కొనేవారు లేక బోసిపోయిన కూరగాయల మార్కెట్లు..

Bengaluru: ఉద్యోగం కంటే సొంత వ్యాపారమే మిన్న.. ఒంటరిగా వంట చేస్తూ నెటిజన్ల మనసు గెలిచిన టెక్కీ!

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Bengaluru: ఒరాకిల్‌లో ఉద్యోగం పోయింది.. కానీ దర్జాగా బతుకుతున్నాడు! ఈ టెక్కీ ప్లానింగ్ మామూలుగా లేదుగా!

Bengaluru: బెంగళూరు వాసులకు అలర్ట్! మధ్యాహ్నం బయటకు రావొద్దు.. క్లినిక్‌లకు క్యూ కడుతున్న బాధితులు!

Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ సిలిండర్ల కొరత! దెబ్బకు పడిపోయిన కూరగాయల ధరలు!



Click it and Unblock the Notifications