హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఏరియా హైటెక్ సిటీని మించిపోవడం పక్కా అంటున్న రియల్టర్లు.. కారణం ఏంటంటే..
హైదరాబాద్ చుట్టుపక్కల రియాల్టీ రంగం భారీగా ఊపందుకుంది. కండ్లకోయలో వస్తున్న ఐటీ పార్కుతో ఆ చుట్టుపక్కల ఉన్న మండలాల్లో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని పూడూర్ ఐటీ హబ్ కండ్లకోయకు పక్కనే ఉండటంతో ఇప్పుడు పెట్టుబడిదారులు అక్కడ భూములు కొనేందుకు ఎగబడుతున్నారు. అక్కడ స్థలాలకు పుల్లు డిమాండ్ ఏర్పడింది. కండ్లకోయలో ఆరు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐటీ టవర్ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించిన సంగతి విదితమే. తద్వారా దాదాపు 100 టెక్నాలజీ కంపెనీలు కొలువు ా పార్కులో తీరనున్నాయి. దీంతో పూడూర్ లోని భూములకు రెక్కలు వచ్చాయి.
ప్రస్తుతం ఈ మండలం ఉత్తర హైదరాబాద్‌లో వేగంగా మారిపోతున్న రియల్ ఎస్టేట్ హాట్‌స్పాట్‌గా అవతరిస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ (ORR), ప్రధాన పారిశ్రామిక కారిడార్లు, అభివృద్ధి చెందుతున్న రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు సమీపంలో ఉండటం వలన ఇక్కడ భూమి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా ప్రకారం.. రాబోయే ఐదు నుంచి పది సంవత్సరాల్లో పూడూర్ లో మార్కెట్ విలువను పెంచుకుని హైదరాబాద్ లో అత్యంత వేగంగా పెరిగే ప్రాంతాల్లో Pudur IT hub ఒకటిగా నిలవనుంది.

పూడూర్, ORR ఎగ్జిట్ 6 నుండి కేవలం 10 నిమిషాల దూరంలో ఉండటంతో ఇక్కడ స్థలాలకు పుల్లు డిమాండ్ ఏర్పడింది. పైగా ఈ ప్రదేశం మేడ్చల్ ఇండస్ట్రియల్ కారిడార్, దుండిగల్ ఏరోస్పేస్ & డిఫెన్స్ క్లస్టర్ వంటి కీలక పరిశ్రమలకు సమీపంలో ఉండటంతో పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. వీటికి ఊతంగా కండ్లకోయలో నిర్మాణంలో ఉన్న 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఐటీ టవర్ దీని రియల్ ఎస్టేట్ అవకాశాలను మరింతగా పెంచుతోంది. అదేవిధంగా, జీనోమ్ వ్యాలీ - నోవార్టిస్, భారత్ బయోటెక్, డుపాంట్ వంటి గ్లోబల్ లైఫ్ సైన్సెస్ కంపెనీల హబ్ లు కూడా దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఉద్యోగ అవకాశాలు విస్తృతంగా పెరుగుతాయని భావిస్తున్నారు.
పూడూర్‌లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ధరలు హైదరాబాద్ సెంట్రల్ లేదా వెస్ట్ జోన్లతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. భవిష్యత్తులో వాణిజ్య, పారిశ్రామిక ప్రాజెక్టులు, ఐటీ పార్కులు పూర్తి అయితే ఇక్కడ పెట్టిన పెట్టుబడికి రాబడులు గణనీయంగా పెరుగుతాయని రియల్టర్లు చెబుతున్నారు. ఇప్పుడే ఇక్కడ భూమి లేదా రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెడితే దీర్ఘకాలంలో మంచి లాభాలు పొందే అవకాశం ఉందని సూచిస్తున్నారు. పూడూర్ కేవలం పరిశ్రమలు, ఐటీ ప్రాజెక్టులకే కాకుండా మౌళిక సదుపా
ఉద్యోగాలు, పరిశ్రమలు, విద్య, ఆరోగ్యం, వినోదం అన్నీ ఒకే ప్రాంతంలో అందుబాటులోకి వస్తున్నందున పూడూర్ హైదరాబాద్ ఆర్థిక వృద్ధికి కొత్త కేంద్రంగా మారుతోంది. ఇది కేవలం రియల్ ఎస్టేట్ హబ్ మాత్రమే కాదు, సాంకేతికత, పరిశోధన, తయారీ, జీవనశైలి కలిసిన అభివృద్ధి చెందుతున్న స్మార్ట్ సిటీ మోడల్ గా రూపుదిద్దుకోబోతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి


Click it and Unblock the Notifications