Hyderabad Real Estate: గత కొంతకాలంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్ధతకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలోని హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency) చర్యలు కారణమని కొన్ని వర్గాలు ఆరోపిస్తూ వస్తున్న సంగతి విదితమే. ఈ ఆరోపణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోపణలు అసత్యం, హైడ్రా కార్యకలాపాలు కేవలం హైదరాబాద్ నగరానికి పరిమితం. మార్కెట్ నెమ్మదింపుకు వాస్తవ కారణాలు వేరే ఉన్నాయని. కేవలం తమపై నిందలు మోపడం సరిగ్గా లేదని అన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో డిమాండ్‌కు మించి సప్లై ఉంది. మార్కెట్‌లో అన్-సోల్డ్ ఇన్వెంటరీ (అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఫ్లాట్లు, ప్రాజెక్టులు) అధికంగా పేరుకుపోవడం అనేది కొనుగోలు శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన తెలిపారు. ఈ పరిస్థితికి తోడ్పడుతున్న మరో కారణంగా అమెరికా వంటి విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులు, రీమిటెన్స్‌లు గణనీయంగా తగ్గిపోవడంని ఆయన ప్రస్తావించారు.

పెరుగుతున్న వడ్డీ రేట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా ఉద్యోగాలపై ఉన్న భయాలు కూడా భవన కొనుగోలు శక్తిని ప్రభావితం చేస్తున్నాయని రంగనాథ్ అన్నారు. ప్రతిదానికీ హైడ్రాను బాధ్యులను చేయడం ఒక బ్లేమ్ గేమ్‌లా మారింది. మా కార్యకలాపాలు కేవలం హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం. మరి ఖమ్మం, వరంగల్ వంటి నగరాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఎందుకు నెమ్మదించిందని ప్రశ్నించారు.
అసలు రియల్ ఎస్టేట్ అంటే చదరపు అడుగుకు రూ.10,000-15,000 ధరలు పెరగడం మాత్రమే కాదు. సామాన్యుడు, మధ్యతరగతి వ్యక్తులకు సొంత ఇంటి కలను అందించడం నిజమైన అభివృద్ధి అని వివరించారు. అందరికీ ఇళ్లు అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే నిజమైన రియల్ ఎస్టేట్ అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అతను తన వృత్తి పరమైన స్తిరత్వాన్ని కూడా గుర్తుచేశారు. గతంలో అమృత-ప్రణయ్ ప్రేమ వివాహంతో సంబంధించి ప్రణయ్ హత్య కేసు దర్యాప్తు సమయంలో.. సోషల్ మీడియాలో తనపై ఎన్నో ఆరోపణలు వచ్చినా, ఆయన వృత్తిధర్మాన్ని విడిచిపెట్టకపోవడం, బాహ్య ఒత్తిళ్లను పట్టించుకోకపోవడం వంటి విషయాలను ఆయన తాజాగా గుర్తు చేశారు.
ఒత్తిళ్ళకు తలొగ్గకుండా లక్ష్యంపై దృష్టి పెడితే వాస్తవాలన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ఫలితంగా నిజమైన రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధి మాత్రమే ప్రజలకు లాభకరంగా మారుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా, రియల్ ఎస్టేట్ slowdown ఆరోపణలపై ఆయన స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లయింది.
More From GoodReturns

బెంగళూరు సబర్బన్ రైలు ఆగిందా? ఐటీ ఉద్యోగులకు షాకింగ్ వార్త

బెంగళూరు సబర్బన్ రైలు ప్రాజెక్టుకు మళ్లీ భారీ షాక్!

Bengaluru: బెంగళూరులో 14 శాతం పెరిగిన ప్రాపర్టీ రేట్లు..! 3BHK ఫ్లాట్ ధర ఎంతంటే..

Hyderabad: హైదరాబాద్‌లో ఇళ్ల ధరల విస్ఫోటనం..! చిన్నగా మారుతున్న అపార్ట్మెంట్లు!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్.. ఈ ఒక్క ఏరియాలోనే ఇల్లు కావాలంటున్న కొనుగోలుదారులు..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!



Click it and Unblock the Notifications