Hyderabad రియల్ ఎస్టేట్ రంగంలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు ఇళ్ళ ధరల విపరీతంగా పెరగడంతో అమ్మకాలు పడిపోయాయి. మార్కెట్ ఉంటే ఇళ్ల ధరలు పెరగాలి కాని మార్కెట్ లేకుండానే ఇళ్ళ ధరల్లో ఒక్కసారిగా పెరుగదల కనిపిస్తోంది. దీంతో మార్కెట్ డౌన్ అయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్ 2025)లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అమ్మకాలు దారుణంగా పడిపోయాయి.
ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ అనరాక్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. నగరంలో ఇళ్ల అమ్మకాలు 27 శాతం పడిపోయాయి. గతేడాది ఇదే కాలంలో 15,000 యూనిట్లకు పైగా ఇళ్లు విక్రయమయితే ఈ ఏడాది కేవలం 11,040 యూనిట్ల మాత్రమే అమ్ముడుపోయాయి. అయితే అమ్మకాలు తగ్గినప్పటికీ, గృహ ధరలు మాత్రం భారీ స్థాయిలోపెరిగాయి. ఇంకా చెప్పాలంటే.. హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు సగటున 11 శాతం పెరిగాయి.

ఇది దేశవ్యాప్తంగా ఉన్న టాప్-7 మెట్రో నగరాల్లో కనిపించిన సగటు వృద్ధికే సమానం. మొత్తం దేశవ్యాప్తంగా 2025 జూన్ త్రైమాసికంలో 96,285 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి, ఇది గతేడాది ఇదే కాలంతో పోల్చితే సుమారు 20 శాతం తగ్గుదల.అయితే క్రితం ఏడాది 1,20,335 యూనిట్లు అమ్మకాలు జరిగాయి. మొత్తం ఏడు నగరాలను పరిశీలిస్తే..ఆరు నగరాల్లో ఇళ్లు అమ్మకాలు పడిపోగా చెన్నైలో మాత్రం అమ్మకాలు పెరిగాయి.
నగరాల వారీగా మార్కెట్ స్థితిగతులు
ఢిల్లీ-ఎన్సీఆర్: ఇక్కడ ఇళ్ల ధరలు అత్యధికంగా 27% పెరిగినా, అమ్మకాలు 14% తగ్గి 14,255 యూనిట్లకు పరిమితమయ్యాయి.
ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్ (MMR): అమ్మకాలు 25% పడిపోయి 31,275 యూనిట్లకే పరిమితమయ్యాయి.
బెంగళూరు: అమ్మకాలు 8% తగ్గి 15,410 యూనిట్లుగా నమోదయ్యాయి. ధరలు సగటున 12% పెరిగాయి.
పుణె: ఇక్కడ అమ్మకాలు 27% తగ్గి అదే 15,410 యూనిట్ల వద్ద నిలిచాయి.
కోల్‌కతా:23% తగ్గుదలతో 3,525 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి.
చెన్నై:దేశవ్యాప్తంగా ఏకైక నగరంగా చెన్నైలో మాత్రం అమ్మకాలు 11% పెరిగాయి. గతేడాది 5,100 యూనిట్లు అమ్ముడవ్వగా, ఈసారి 5,660 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి.
ఈ గణాంకాలను పరిశీలిస్తే. వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం తగ్గిపోతుండగా, డిమాండ్ కంటే సరఫరా తగ్గడం వల్లే ధరలు పెరుగుతున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. ఇదే ధోరణి కొనసాగితే, రియల్ ఎస్టేట్ రంగం పుంజుకునేందుకు సమయం పట్టేలా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
---
More From GoodReturns

Bengaluru: ఐటీ రేసులో రివర్స్ గేర్! బెంగళూరును దాటేసిన హైదరాబాద్.. లేటెస్ట్ రిపోర్ట్ ఇది!

Hyderabad: ఇక ట్రాఫిక్ టెన్షన్ లేదు! సిటీలో కొత్త అండర్ పాస్, స్టీల్ బ్రిడ్జికి లైన్ క్లియర్! ఎక్కడంటే..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications